Agent World Wide pre release Business: మూడింతలు పెరిగిన అఖిల్ మార్కెట్.. ఎన్ని కోట్లంటే?
అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న ఏజెంట్ సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమైంది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అఖిల్ కెరీర్ లోనే హైయెస్ట్ అని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

సిసింద్రీతో
నాగార్జున సినీ వారసుడిగా అఖిల్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి బాలనటుడిగా సిసింద్రీతో సూపర్ హిట్ అందుకున్నాడు. అయితే అఖిల్ హీరోగా మారాక హిట్ కొట్టడానికి చాలా ప్రయత్నించాడు. సిసింద్రీ తర్వాత అఖిల్ మనం అనే సినిమాలో ఒక గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. ఆ సినిమా తర్వాత అఖిల్ 'అఖిల్' అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. వీవీ వినాయక్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఆ సినిమా కలిసి రాకపోవడంతో సంవత్సరం గ్యాప్ తీసుకుని హలో అనే సినిమా చేశారు అఖిల్.

బ్లాక్ బస్టర్ కాకున్నా
అయితే ఈ హలో సినిమా కూడా హిట్ దక్కించుకోలేకపోయింది. దీంతో మళ్లీ సంవత్సరం గ్యాప్ తీసుకుని యువ దర్శకుడు వెంకీ అట్లూరితో మిస్టర్ మజ్ను అనే మారో సినిమా చేశారు. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగా డిజాస్టర్ అయ్యింది. ఇక వరుస దెబ్బలతో అఖిల్ సినిమాల ఎంపిక మీద దృష్టి పెట్టి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమా చేశారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా బ్లాక్ బస్టర్ కాకున్నా మంచి పేరు హిట్ అయితే అయింది.

హైలైట్
ఈ సినిమా తర్వాత అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు. ఈ సినిమాకు ఏజెంట్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టుకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో అఖిల్ బాడీ బిల్డింగ్ గురించి ప్రత్యేక చర్చ జరుగుతోంది. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు. సురేందర్ రెడ్డి స్టైలిష్ టేకింగ్ సినిమాకు మేజర్ హైలైట్ కానుంది.

60 కోట్ల ప్రీ రిలీజ్
ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ సినిమా కేవలం ఆంధ్ర ఏరియాలోనే దాదాపు 30 కోట్ల బిజినెస్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక మిగతా చోట్ల కూడా మంచి బిజినెస్ జరగనుందని అంటున్నారు. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 55 నుంచి 60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగే అవకాశం ఉందని అంటున్నారు.

చర్చనీయాంశంగా
అఖిల్ మార్కెట్ తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ అనే చెప్పాలి. ఎందుకంటే ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా 21.5 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కానీ ఇప్పుడు ఏజెంట్ సినిమాకు దానికి మూడింతలు బిజినెస్ జరగడం ఆసక్తికరంగా మారింది. పూర్తి లెక్కలు ఇంకా బయటకు రాలేదు కానీ ప్రస్తుతం అయితే ఈ లెక్కలు చర్చనీయాంశంగా మారాయి.


Click it and Unblock the Notifications











