వంద కోట్లు దాటేస్తుందని అంచనా
బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ తాజా చిత్రం 'అగ్నిపథ్' బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియోట్ చేస్తోంది. ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్ తమ ధర్మ ప్రొడక్షన్స్ పై నిర్మించిన ఈ చిత్రం ఓపినింగ్ రోజు నుంచి అదరకొడుతూనే ఉంది. హృతిక్ రోషన్, ప్రియాంక చోప్రా ల కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం తొలి నాలుగు రోజుల్లో రూ.68 కోట్లు వసూళ్లు దక్కించుకొన్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ హవా ఇలాగే వందకోట్లు ని అతి కొద్ది రోజుల్లోనే దాటేయిటం జరుగుతుందంటున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలో సంజయ్ దత్,హృతిక్ రోషన్ నటన అద్వితీయంగా ఉందని అంటున్నారు. రిషీ కపూర్ కూడా చాలా గ్యాప్ తర్వాత తనదైన అధ్బుతమైన నటనను ప్రదర్శించాడని చెప్తున్నారు. ఈ చిత్రం కలెక్షన్స్ ముఖ్యంగా మహారాష్ట్ర,బీహార్ లలో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది.
అగ్నిపథ్ చిత్రం మొన్న శుక్రవారం అంటే జనవరి 26న విడుదల అయ్యింది. మార్నింగ్ షోకే ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ 41 కోట్లు చెల్లించి జీ టీవీ వారు సొంతం చేసుకున్నారు. ఈ మొత్తం బాలీవుడ్ చరిత్రంలో ఓ పెద్ద రికార్డుగా అభివర్ణిస్తున్నారు. 1990లో అమితాబ్ హీరోగా, డాని డెంజోపా విలన్ గా నటించిన చిత్రం 'అగ్నిపధ్'కి ఇది రిమేక్. ఇందులో సంజయ్‌దత్ 'కంచా చీనా' పాత్ర చేసాడు. ఇందులో విలన్ గా చేస్తున్న సంజయ్ దత్ ని చూస్తేనే విలన్‌కి కూడా వెన్నులో వణుకు పుట్టేలా ఉన్నాడు. విలన్ గా కనపడేందుకు సంజయ్ తలనీలాలు సమర్పించుకోవడమే కాక, చెవి పోగు కూడా పెట్టుకున్నారు. సినిమాలో చాలావరకు నలుపు రంగు దుస్తుల్లోనే కనిపించి అలరిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











