దిల్‌రాజుకు దెబ్బ మీద దెబ్బ.. అప్పుడు స్పైడర్.. ఇప్పుడు అజ్ఞాతవాసి.. నష్టం ఎన్ని కోట్లంటే..
అజ్ఞాతవాసి బ్లాక్‌బస్టర్ అవుతుందని పెట్టుబడి పెట్టిన డిస్టిబ్యూటర్లందరి పరిస్థితి చెప్పరాని విధంగా ఉన్నట్టు సినీ వర్గాల టాక్. జల్సా, అత్తారింటికి దారేది తర్వాత పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రావడంతో భారీగా అంచనాలు నెలకొన్నాయి. దాంతో రికార్డుస్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందనే సంగతి తెలిసిందే. ఈ చిత్రం నిర్మాత దిల్ రాజుకు భారీగా నష్టాన్ని తెచ్చినట్టు సమాచారం.
Recommended Video


రికార్డుస్థాయిలో ప్రీ రిలీజ్
అజ్ఞాతవాసి చిత్రంపై భారీ అంచనాలు నెలకొనడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగింది. విడుదలకు ముందే 150 కోట్లకుపైగా బిజినెస్ చేసింది. తెలుగు సినీ పరిశ్రమలో ఇది ఓ రికార్డుగా నమోదైంది.

ప్రీ రిలీజ్ వివరాలు
థియేట్రికల్ రైట్స్ 120 కోట్లు
తెలుగు శాటిలైట్ రైట్స్ 19 కోట్లు
ఇతర భాషల శాటిలైట్ రైట్స్ 6 కోట్లు
డిజిటల్ రైట్స్ 7 కోట్లు
ఇతర హక్కులకు 3 కోట్లు
మొత్తంగా అజ్ఞాతవాసి చిత్రం రూ.155 కోట్లకుపైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం ఓ రికార్డు.

29 కోట్లకు నైజాం హక్కులు
నైజాంలో డిస్ట్రిబ్యూషన్ రంగంలో కింగ్ అని చెప్పుకొనే ప్రముఖ నిర్మాత దిల్ రాజు అజ్ఞాతవాసి హక్కులను దక్కించుకొన్నారు. భారీ అంచనాలు నెలకొనడంతో సుమారు రూ.29 కోట్లు చెల్లించి నైజాం హక్కులను దక్కించుకొన్నట్టు సమాచారం.

దారుణమైన నష్టాలు
అజ్ఞాతవాసి చిత్రానికి ఫ్లాప్ టాక్ రావడంతో పరిస్థితి దారుణంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా డిస్టిబ్యూటర్లను తీవ్ర నష్టాల్లోకి నెట్టింది. జిల్లాల వారీగా, ఏరియాల వారీగా పంపిణీదారులు భారీ నష్టాలను చవిచూశారనేది టాక్.

నైజాంలో రూ.11 కోట్లు
నైజాం ఏరియాలో అజ్ఞాతవాసి చిత్రం రూ.11 కోట్లు కలెక్ట్ చేసినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. అంటే ఈ చిత్రానికి దిల్ రాజుకు సుమారు రూ.18 కోట్లు నష్టం వాటిల్లిందనేది సినీ వర్గాల సమాచారం.

దిల్ రాజుకు చేదు అనుభవం
2017 సంవత్సరంలో స్వీయ నిర్మాణాలకు సంబంధించి దిల్ రాజకు పట్టిందల్లా బంగారమే. టాలీవుడ్‌కు వరుసగా ఆరు బ్లాక్‌బస్టర్లను అందించారు. పంపిణీరంగంలో స్పైడర్‌తోపాటు అజ్ఞాతవాసి చిత్రం కలెక్షన్లపరంగా చేదు అనుభవాన్ని మిగిల్చింది.


Click it and Unblock the Notifications











