అజ్ఞాతవాసి ఫైనల్ కలెక్షన్లు.. దేశంలోనే అతిపెద్ద డిజాస్టర్‌గా.. ఆ రెండు చిత్రాల సరసన పవన్

By Rajababu

టాలీవుడ్ చరిత్రలో ఎన్నడూలేని విధంగా అజ్ఞాతవాసి సినిమా విషయంలో హైప్ వచ్చింది. పవన్ కల్యాణ్ స్టామినాకు అనుగుణంగా రికార్డుస్థాయిలో బిజినెస్ జరిగింది. అయితే రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. అయితే ఈ చిత్రం డిస్టిబ్యూటర్లకు తీరని నష్టాన్ని కలిగించింది. రూ.150కు పైగా బిజినెస్ జరిగినట్టు వార్తలు వచ్చాయి. అయితే దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా దారుణమైన పరాజయంగా రికార్డు సృష్టించింది. ఈ సినిమాకు ఫైనల్‌గా ఎంత నష్టం వచ్చిందంటే..

 అజ్ఞాతవాసి ప్రీరిలీజ్ బిజినెస్

అజ్ఞాతవాసి ప్రీరిలీజ్ బిజినెస్

అజ్ఞాతవాసి చిత్రం విడుదలకు ముందే 150 కోట్లకుపైగా బిజినెస్ చేసింది.
థియేట్రికల్ రైట్స్ 120 కోట్లు
తెలుగు శాటిలైట్ రైట్స్ 19 కోట్లు
ఇతర భాషల శాటిలైట్ రైట్స్ 6 కోట్లు
డిజిటల్ రైట్స్ 7 కోట్లు
ఇతర హక్కులకు 3 కోట్లు
మొత్తంగా అజ్ఞాతవాసి చిత్రం రూ.150 కోట్లకుపైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం ఓ రికార్డు.

Recommended Video

Intelligent Bigger Flop Than Agnyaathavaasi
తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు

తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు

తెలుగు రాష్ట్రాల్లో అజ్ఞాతవాసి తొలిరోజు భారీగానే కలెక్షన్లు సాధించింది. తొలిరోజు సినిమాకు ప్రతికూలంగా టాక్ రావడంతో కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. ఆంధ్రప్రదేశ్ నైజాంలో ఈ చిత్రం 40.9 కోట్లు షేర్ (63.5 కోట్ల గ్రాస్) కలెక్షన్లను సాధించింది అని ట్రేడ్ అనలిస్టుల వెల్లడించారు.

 ఆంధ్రాలో అజ్ఞాతవాసి వసూళ్లు

ఆంధ్రాలో అజ్ఞాతవాసి వసూళ్లు

అజ్ఞాతవాసి చిత్రం ఆంధ్రాలో 25.15 కోట్లు, సీడెడ్‌లో 5.30 కోట్లు, నైజాంలో 10.45 కోట్లు వసూలు చేసింది. ఏపీలో జిల్లాల వారీగా చూసుకొంటే.. వైజాగ్‌లో 5.40 కోట్లు, తూర్పు గోదావరిలో 4.25 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 4.75 కోట్లు, కృష్ణా జిల్లాలో 3.35 కోట్లు, గుంటూరులో 5.15 కోట్లు, నెల్లూరులో 2.25 కోట్లు వసూలు చేసింది.

కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో

కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో

తెలుగేతర రాష్ట్రాల్లో కూడా అజ్ఞాతవాసికి దారుణమైన కలెక్షన్లు ఉన్నట్టు స్పష్టమవుతున్నది. కర్ణాటకలో 7.2 కోట్లు వసూలు చేయగా, దేశంలోని మిగితా రాష్ట్రాల్లో 1.15 కోట్లు వసూలు చేసింది.

అమెరికా, ఓవర్సీస్‌లో కలెక్షన్లు

అమెరికా, ఓవర్సీస్‌లో కలెక్షన్లు

ఇక ఓవర్సీస్‌ బిజినెస్ విషయానికి వస్తే.. అమెరికాలో అజ్ఞాతవాసి చిత్రం 7.20 కోట్లు వసూలు చేసింది. అమెరికా కాకుండా మిగితా దేశాల్లో ఈ చిత్రం 1.90 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టింది.

ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు

ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు

ప్రపంచవ్యాప్తంగా అజ్ఞాతవాసి చిత్రం 150 కోట్లకుపైగా బిజినెస్ చేసింది. అయితే ఈ చిత్రానికి ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్లు 57 కోట్లు షేర్ (94.6 కోట్ల గ్రాస్) మాత్రమే. పవన్ కల్యాణ్ సినిమా ఇంత దారుణంగా కలెక్షన్లు సాధించిన దాఖలాలు గతంలో లేవు.

50 శాతం కూడా రాబట్టకుండా

50 శాతం కూడా రాబట్టకుండా

అజ్ఞాతవాసి చిత్రం జరిగిన బిజినెస్‌లో కేవలం 50 శాతం కూడా వసూళ్లను రాబట్టలేకపోవడంతో డిస్టిబ్యూటర్లు దారుణంగా దెబ్బతిన్నారు. దాంతో దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత రాధాకృష్ణ రంగంలోకి దిగి డిస్టిబ్యూటర్లకు సర్దుబాటు చేసినట్టు వార్తలు వచ్చాయి.

దేశంలోనే దారుణమైన పరాజయం

దేశంలోనే దారుణమైన పరాజయం

అజ్ఞాతవాసి చిత్రం దేశంలోనే అతిదారుణంగా పరాజయం పొందిన చిత్రంగా ఓ రికార్డును సొంతం చేసుకొన్నది. దేశంలోనే అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచిన మూడో చిత్రంగా పేరును మూటగట్టుకొన్నది.

 దేశంలోనే మూడో డిజాస్టర్‌గా

దేశంలోనే మూడో డిజాస్టర్‌గా

ఇంతకు ముందు కరణ్ జోహర్ తీసిన బాంబే వెల్వెట్, మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన స్పైడర్ చిత్రం ఒకటి, రెండు స్థానాల్లో నిలిచాయి. ఆ చిత్రాల తర్వాత అజ్ఞాతవాసి అట్టర్ ఫ్లాప్ చిత్రంగా మూటగట్టుకొన్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X