twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రిలీజ్లో బాహుబలిని మించింది... అయినా కొట్టలేక పోయిన ‘అజ్ఞాతవాసి’ (టాప్-10 లిస్ట్)

    By Bojja Kumar
    |

    Recommended Video

    రిలీజ్లో బాహుబలిని మించింది... అయినా కొట్టలేక పోయింది.. టాప్-10 లిస్ట్ ఇదే !

    పవన్ కళ్యాణ్ నటించిన 'అజ్ఞాతవాసి' చిత్రం యూఎస్ఏలో గతంలో ఏ తెలుగు సినిమా రిలీజ్ అవ్వనన్ని లొకేషన్లలో విడుదలైంది. 'ఎల్ఏ తెలుగు' వారు ఈ చిత్రాన్ని అక్కడ 209 లొకేషన్లలో విడుదల చేశారు. రిలీజ్ విషయంలో ఇది 'బాహుబలి', 'బాహుబలి-2'ని సైతం మించిన రికార్డ్. ఇంత భారీగా విడుదలవ్వడం, పవర్ స్టార్ అంటే విపరీతమైన క్రేజ్ ఉండటంతో 'అజ్ఞాతవాసి' సినిమా బాహుబలి-2 ప్రీమియర్ షో కలెక్షన్ రికార్డులను బద్దలు కొడుతుందని అంతా భావించారు.

    బాహుబలి-2ను కొట్టలేక పోయిన ‘అజ్ఞాతవాసి’

    బాహుబలి-2ను కొట్టలేక పోయిన ‘అజ్ఞాతవాసి’

    ‘బాహుబలి-2' కంటే ఎక్కువ లొకేషన్లలో పవర్ స్టార్ సినిమా ప్రీమియర్ షోలు పడ్డప్పటికీ..... కలెక్షన్ల విషయంలో బాహుబలి-2ను మించలేక పోయింది ‘అజ్ఞాతవాసి'. దాదాపు మిలియన్ డాలర్ వెనకే ఉండిపోయింది.

    నెం.1 స్థానంలో బాహుబలి-2

    నెం.1 స్థానంలో బాహుబలి-2

    రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్,రానా, అనుష్క ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన బాహుబలి-2 చిత్రం $ 2.45 మిలియన్ డాలర్స్‌ ప్రీమియర్ షో వసూళ్లతో నెం.1 స్థానంలో కొనసాగుతోంది.

    నెం.2 స్థానంలో ‘అజ్ఞాతవాసి’

    నెం.2 స్థానంలో ‘అజ్ఞాతవాసి’

    యూఎస్ఏలో 209 లొకేషన్లలో విడుదలైన ‘అజ్ఞాతవాసి' చిత్రం ప్రీమియర్ షోల ద్వారా $ 1,46 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. సెకండ్ హయ్యెస్ట్ ఆల్ టైమ్ ప్రీమియర్ షో కలెక్షన్ ఇది.

    మూడో స్థానంలో బాహుబలి-1

    మూడో స్థానంలో బాహుబలి-1

    2015లో వచ్చిన బాహుబలి-1 మూవీ $ 1.36 మిలియన్ డాలర్స్ వసూళ్లతో ఇప్పటికీ నెం. 3 పొజిషన్లో కొనసాగుతోంది.

    నాలుగో స్థానంలో ఖైదీ నెం. 150

    నాలుగో స్థానంలో ఖైదీ నెం. 150

    గత సంక్రాంతికి విడుదలైన మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ‘ఖైదీ నెం. 150' చిత్రం $ 1.29 మిలియన్ డాలర్స్ ప్రీమియర్ షో వసూళ్లతో 4వ స్థానంలో ఉంది.

    నెం.5 స్పైడర్

    నెం.5 స్పైడర్

    మహేష్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో 2017లో వచ్చిన ‘స్పైడర్' మూవీ యూఎస్ఏలో ప్రీమియర్ షోల ద్వారా $ 1.003 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది.

    నెం.6 సర్దార్ గబ్బర్ సింగ్

    నెం.6 సర్దార్ గబ్బర్ సింగ్

    2016లో వచ్చిన పవన్ కళ్యాణ్ మూవీ ‘సర్దార్ గబ్బర్ సింగ్' యూఎస్ఏలో ప్రీమియర్ షోల ద్వారా $ 0.61 మిలియన్ డాలర్స్ వసూలు చేసి ప్రస్తుతం 6వ స్థానంలో కొనసాగుతోంది.

    7వ స్థానంలో జై లవ కుశ

    7వ స్థానంలో జై లవ కుశ

    ‘జై లవకుశ' మూవీ 2017లో విడుదలైంది. ఈ చిత్రం యూఎస్ఏ ప్రీమియర్ షోల ద్వారా $ 0.59 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది.

    8వ స్థానంలో జనతా గ్యారేజ్

    8వ స్థానంలో జనతా గ్యారేజ్

    ఎన్టీఆర్ నటించి మరో చిత్రం ‘జనతా గ్యారేజ్'. ఈ చిత్రం 2016లో విడుదలైంది. ఈ చిత్రం ప్రీమియర్ షోల ద్వారా $ 0.58 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది.

    9వ స్థానంలో బ్రహ్మోత్సవం

    9వ స్థానంలో బ్రహ్మోత్సవం

    మహేష్ బాబు నటించిన ‘బ్రహ్మోత్సవం' మూవీ 2016లో విడుదలై యూఎస్ఏ ప్రీమియర్ షోల ద్వారా $ 0.56 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది.

    10వ స్థానంలో శ్రీమంతుడు

    10వ స్థానంలో శ్రీమంతుడు

    మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు మూవీ 2015లో విడుదలైంది. ఈ చిత్రం అప్పట్లో ప్రీమియర్ షోల ద్వారా $ 0.53 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది.

    English summary
    Pawan Kalyan's Agnyaathavaasi has collected over $1.40 million at the US box office in the premieres and beaten the records of Baahubali: The Beginning and Khaidi No 150.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X