పవన్ రెమ్యునరేషన్ వింటే షాకే.. అజ్ఞాతవాసి కలెక్షన్ల సునామీ.. రికార్డులు బ్రేక్..
ప్రపంచవ్యాప్తంగా అజ్ఞాతవాసి సినిమా ప్రభంజనం సృష్టిస్తున్నది. సినిమాపై వచ్చిన డివైడ్ టాక్‌ను ఎదురించి సినిమా కలెక్షన్లపరంగా దూసుకెళ్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం బాహుబలి2, ఖైదీ నంబర్ 150 తొలిరోజు వసూళ్లను అమెరికాలో అజ్ఞాతవాసి తిరుగరాసింది.
Recommended Video


అమెరికాలో రికార్డు
అజ్ఞాతవాసి చిత్రం అమెరికాలో 576 స్క్రీన్లలో ప్రదర్శింపబడుతున్నది. అమెరికాలో ఓ భారతీయ చిత్రం ఈ రేంజ్‌లో విడుదలవ్వడం ఇదే మొదటిసారి.

10 కోట్లకుపైగా వసూళ్లు
అమెరికాలో 491 లోకేషన్ల నుంచి అందిన సమాచారం ప్రకారం అజ్ఞాతవాసి చిత్రం 1.5 మిలియన్ డాలర్లకుపైగా వసూలు చేసింది. అంటే భారతీయ కరెన్సీలో సుమారు 10 కోట్ల రూపాయలు.

తమిళనాడులో భారీగా
ఇక అజ్ఞాతవాసి చిత్రం తమిళనాడులో 150 స్క్రీన్లలో రిలీజ్ అయింది. తమిళనాడులో కూడా ఈ చిత్రం 100 శాతం అక్యుపెన్సీ ఉన్నట్టు సమాచారం. త్వరలోనే తొలిరోజు కలెక్షన్లు వెల్లడయ్యే అవకాశం.

తొలిరోజున 45 కోట్లకుపైగానే
బాహుబలి2 చిత్రం తొలిరోజున అమెరికా, తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.45 కోట్లు వసూలు చేసింది. అయితే బాహుబలి2 విడుదలైన స్క్రీన్ల సంఖ్య కంటే అజ్ఞాతవాసి చిత్రం విడుదలైన స్క్రీన్ల సంఖ్య ఎక్కువ. అంతే కాకుండా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలతోపాటు అమెరికాలో కూడా 100 శాతం అక్యుపెన్సీని సాధించింది.

బాహుబలి2 మించి
అజ్ఞాతవాసి చిత్రం బాహుబలి2 మించిన కలెక్షన్లను సాధించే అవకాశాలు కనపడుతున్నాయి. వచ్చే నాలుగు రోజులు కూడా సెలవులు కావడం వల్ల అజ్ఞాతవాసి చిత్రం భారీ కలెక్షన్లను సాధించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ చిత్రం టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. దాంతో వారాంతంలో వంద కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది.

పవన్ రెమ్యునరేషన్
అజ్ఞాతవాసి చిత్రం రూపొందించడానికి అయిన అంచనా బడ్జెట్ ఇదే.
పవన్ కల్యాణ్ రెమ్యునరేషన్ 30 కోట్లు
త్రివిక్రమ్ రెమ్యునరేషన్ 20 కోట్లు
కీర్తి సురేష్ రెమ్యునరేషన్ 1 కోటి
అను ఇమ్మాన్యుయేల్ రెమ్యునరేషన్ 20 లక్షలు
అనిరుధ్ రెమ్యునరేషన్ రూ.3 కోట్లు
ఇతర ఖర్చులు 6 కోట్లు
ప్రొడక్షన్ కాస్ట్ 13 కోట్లు
రిలీజ్ ఖర్చు 2 కోట్లు

అజ్ఞాతవాసి ప్రీరిలీజ్ బిజినెస్
అజ్ఞాతవాసి చిత్రం విడుదలకు ముందే 150 కోట్లకుపైగా బిజినెస్ చేసింది.
థియేట్రికల్ రైట్స్ 120 కోట్లు
తెలుగు శాటిలైట్ రైట్స్ 19 కోట్లు
ఇతర భాషల శాటిలైట్ రైట్స్ 6 కోట్లు
డిజిటల్ రైట్స్ 7 కోట్లు
ఇతర హక్కులకు 3 కోట్లు
మొత్తంగా అజ్ఞాతవాసి చిత్రం రూ.155 కోట్లకుపైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం ఓ రికార్డు.


Click it and Unblock the Notifications











