మల్లిగాడు వచ్చేస్తున్నాడు.. ఆహాలోకి ఈ ఏడాది బ్లాక్ బస్టర్ మూవీ
టాలీవుడ్‌లో చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టి.. ఆ తర్వాత హీరోలుగా మారిన వాళ్లు చాలా మందే ఉన్నారు. అందులో కొందరు మాత్రమే ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని సత్తా చాటుకుంటున్నారు. అలాంటి వారిలో సుహాస్ ఒకడు. ఇప్పటికే హీరోగా వరుస హిట్లను అందుకున్న అతడు.. ఇటీవలే 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
సుహాస్ హీరోగా దుశ్యంత్ కటికనేని తెరకెక్కించిన చిత్రమే 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు'. ఎమోషనల్ కంటెంట్‌తో రూపొందిన ఈ మూవీకి ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే మొదటి రోజు నుంచే ఈ చిత్రానికి ప్రేక్షకుల స్పందన భారీ స్థాయిలో లభించింది. ఫలితంగా ఈ సినిమాకు వసూళ్లు అదిరిపోయేలా వచ్చాయి.

రూరల్ బ్యాగ్‌డ్రాప్‌తో వచ్చిన 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' సినిమా థియేటర్లలో దాదాపు రెండు వారాల పాటు గట్టిగానే రన్‌ను కొనసాగించింది. ఇలా ఈ చిత్రం టార్గెట్‌ను చేరుకుని క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంది. అదే సమయంలో రెండు కోట్ల రూపాయలకు పైగా లాభాలను కూడా సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్‌గా హిట్‌గా నిలిచింది.
థియేటర్లలో కొద్ది రోజుల పాటు సందడి చేసిన 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' మూవీకి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు సంబంధించి మంచి పోటీ వచ్చింది. ఈ పరిస్థితుల్లో తెలుగు ఓటీటీ సంస్థ ఆహా ఈ హక్కులను సొంతం చేసుకుంది. ఇందుకోసం నిర్మాతలకు సదరు సంస్థ మంచి మొత్తాన్ని కూడా ఇచ్చినట్లు తెలిసింది.
సుహాస్ హీరోగా నటించిన 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ఎన్నో ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆహా సంస్థ ఈ చిత్రం త్వరలోనే స్ట్రీమింగ్ కాబోతుందని ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో 'మల్లిగాడి మాయా ప్రపంచంలో పడిపోడానికి సిద్ధంగా ఉండండి' అంటూ పోస్ట్ కూడా చేసింది. ఇక, ఈ చిత్రం మార్చి 1 నుంచి స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.
'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' మూవీని ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్, జీఏ2 పిక్చర్స్ బ్యానర్లపై బన్నీ వాస్, వెంకటేష్ మహా సమర్పణలో ధీరజ్ నిర్మించారు. ఈ మూవీకి శేఖర్ చంద్ర సంగీతాన్ని అందించారు. ఇందులో శివానీ హీరోయిన్‌గా, శరణ్య ప్రదీప్, గోపరాజు రమణ కీలక పాత్రల్లో నటించారు.


Click it and Unblock the Notifications











