Ahimsa closing Collections బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన అహింస.. తేజా మూవీకి ఎన్ని కోట్ల నష్టమంటే?

దర్శకుడు తేజ డైరెక్షన్‌లో ఆనంది ఆర్ట్స్ బ్యానర్‌పై జెమిని కిరణ్ నిర్మించిన చిత్రం అహింస. దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి నిర్మాత సురేష్ కుమారుడు అభిరామ్ హీరోగా పరిచయమవుతూ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం టీజర్లు, ట్రైలర్లు మరో జయం అనే విధంగా ఫీలింగ్‌ను కల్పించాయి. అయితే తొలి చిత్ర హీరోగా అభిరామ్ ఎలా చేస్తారో అనే విషయం మీడియాలో ఆసక్తిగా కనిపించింది. అలాంటి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అహింస చిత్రం గత వారం రోజుల్లో ఎలాంటి కలెక్షన్లు రాబట్టిందంటే?

దర్శకుడు తేజకు ఉన్న క్రేజ్‌తో అహింస చిత్రం ఓ అంచనాతో ప్రేక్షకలు ముందుకు వచ్చింది. ఈ చిత్రం తొలి ఆట నుంచే ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. సినీ విమర్శకులు కూడా చేతులెత్తేశారు. దాంతో ఈ సినిమా భారీగా కలెక్షన్లను రాబట్టలేకపోయింది. దాంతో మరీ నిరాశజనకంగా సినిమా కలెక్షన్ల యాత్రను మొదలుపెట్టింది.

Ahimsa Telugu movie closing collections worldwide

అహింస చిత్రాన్ని సాంకేతికంగా రిచ్ చిత్రీకరించడమే కాకుండా తెలుగు ప్రేక్షకుల ఎప్పుడూ చూడని లొకేషన్లలో తీశారు. దాంతో ఈ సినిమా ఖర్చు సుమారు 15 కోట్ల రూపాయలని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. అహింస సినిమాను సురేష్ డిస్ట్రిబ్యూషన్, దర్శకుడు తేజ సొంతంగా రిలీజ్ చేసింది. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్‌ను 7 కోట్ల రూపాయలు వ్యాల్యూ కట్టారు. అయితే ఈ సినిమా థియేట్రికల్ వ్యాల్యూకు దరిదాపులో కూడా లేకపోవడం గమనార్హం.

అహింస గత వారం రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు ఈ చిత్రం 30 లక్షలు, రెండో రోజు 29 లక్షలు, మూడో రోజు 31 లక్షలు, నాలుగో రోజు 26 లక్షలు, ఐదో రోజు 24 లక్షలు, ఆరో రోజు 26 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం మొత్తంగా 1.66 కోట్ల గ్రాస్ రాబట్టింది.

ఇక అహింస చిత్రం తొలివారం ముగిసే సమయానికి థియేట్రికల్‌గా బాక్సాఫీస్ జర్నీ ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా థియేటర్ల నుంచి దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. దాంతో తొలివారం లోపే థియేట్రికల్ రన్ ముగిసే అవకాశాలు స్పష్టమయ్యాయి. దాంతో ఈ సినిమా 7వ రోజు మరో 20 లక్షలు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

అహింస చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 1.9 కోట్ల మేర, ఓవర్సీస్‌లో సుమారు 10 లక్షల రూపాయలు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ చిత్రం థియేట్రికల్‌గా 2 కోట్ల గ్రాస్, 80 లక్షల షేర్ వసూలు చేసినట్టు సమాచారం. దాంతో ఈ సినిమా థియేట్రికల్ వాల్యూ ప్రకారం.. 5 కోట్ల మేర నష్టాలకు గురి అయినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X