Ahimsa Collections అలాంటి టాక్‌తో అహింసకు షాకింగ్ కలెక్షన్లు.. తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే?
తెలుగు సినిమా ప్రపంచంలో లెజెండరీ నిర్మాత డీ రామానాయుడు ఫ్యామిలీ నుంచి మరో హీరోగా అభిరామ్ దగ్గుబాటి పరిచయం అవుతూ రూపొందిన చిత్రం అహింస. ఆనంది ఆర్ట్స్ బ్యానర్‌పై జెమినీ కిరణ్ నిర్మాణంలో ప్రముఖ దర్శకుడు తేజ డైరెక్షన్‌లో రూపొందిన ఈ చిత్రం జనవరి 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే దగ్గుబాటి వారసుడు, తేజ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం భారీ అంచనాలు పెంచింది. ఈ క్రమంలో తొలి రోజు కలెక్షన్ల అంచనా ఎలా ఉందంటే?
అభిరామ్ దగ్గుబాటి, గీతికా తివారీ, సదా, రజత్ బేడీ, కమల్ కామరాజు, దేవీ ప్రసాద్, రవి కాలే తదితరులు నటించిన ఈ చిత్రాన్ని ఖర్చుకు వెనుకాడకుండా ఇండియాలో అద్బుతమైన లొకేషన్లలో షూట్ చేశారు. ఈ సినిమా ప్రారంభం తర్వాత కొన్ని అడ్డంకులను ఎదుర్కొని ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాన్ని సుమారు 15 కోట్ల రూపాయలతో రిచ్‌గా తెరకెక్కించారు.

అహింస సినిమాను సురేష్ డిస్ట్రిబ్యూషన్ సొంతంగా రిలీజ్ చేసింది. తేజ మూవీ కావడంతో ప్రేక్షకుల్లో పెరిగిన అంచనాలతో ఈ సినిమాకు 7 కోట్ల రూపాయలు థియేట్రికల్ వ్యాల్యూగా అంచనా వేశారు. దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ లక్ష్యం భారీగానే ముందు ఉంచారు. భారీ టార్గెట్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.
ఇక అహింస సినిమాకు సంబంధించిన ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. తొలి రోజు భారీగానే రెస్పాన్స్ లభించింది. ఈ చిత్రం మార్నింగ్ షోకు 22 శాతం, మధ్యాహ్నం 20 శాతం, ఫస్ట్ షోకు 25 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. సెకండ్ షోకు సుమారు 30 శాతం వరకు ఆక్యుపెన్సీ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
అహింస తొలి రోజు కలెక్షన్ల విషయంలో తాజా అంచనాల ప్రకారం.. ఈ సినిమా మంచి ఒపెన్సింగ్స్ సాధించిందనే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో సుమారు 60 లక్షల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఓవర్సీస్‌లో మరో 10 లక్షల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని తెలుస్తున్నది. దాంతో ఈ సినిమా తొలి రోజు 70 లక్షలు వసూలు చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











