Ahimsa 3 days Collections బాక్సాఫీస్‌ను మెప్పించని అహింస.. భారీ నష్టాల దిశగా తేజ మూవీ!
లెజెండరీ నిర్మాత, స్వర్గీయ డీ రామానాయుడు కుటుంబం నుంచి హీరోగా అభిరామ్ దగ్గుబాటి పరిచయమైన చిత్రం అహింస. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ బ్యానర్‌పై జెమినీ కిరణ్ నిర్మాణంలో ప్రముఖ దర్శకుడు తేజ డైరెక్షన్‌లో రూపొందించారు. అభిరామ్ దగ్గుబాటి, గీతికా తివారీ, సదా, రజత్ బేడీ, కమల్ కామరాజు, దేవీ ప్రసాద్, రవి కాలే తదితరులు నటించారు. ఈ చిత్రం జనవరి 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తేజ మార్కుగా రూపొందిన ఈ చిత్రం కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే..
అహింస చిత్రాన్ని సుమారు 15 కోట్ల రూపాయలతో రిచ్‌గా తెరకెక్కించారు. అహింస సినిమాను సురేష్ డిస్ట్రిబ్యూషన్, దర్శకుడు తేజ సొంతంగా రిలీజ్ చేసింది. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్‌ను 7 కోట్ల రూపాయలు వ్యాల్యూ కట్టారు. దాంతో భారీ టార్గెట్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.

అయితే ప్రేమ కథకు యాక్షన్ జోడించి సినిమాలను రూపొందించే తేజ తన మార్కుతోనే అహింసను రూపొందించారు. ఈ సినిమాను టెక్నికల్‌గా, నిర్మాణ పరంగా రిచ్‌గా రూపొందించారు. ఈ సినిమాకు లొకేషన్లు స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారాయి. అయితే తేజ డైరెక్టర్‌గా, అభిరామ్ హీరోగా ప్రేక్షకులను థియేటర్ వరకు రప్పించలేకపోయారనే విషయం కలెక్షన్లతో స్పష్ఠమవుతున్నది.
అహింస చిత్రం తొలి రోజు 30 లక్షల రూపాయలతో ఒపెనింగ్స్ ప్రారంభించింది. రొటీన్ కథ, కథనాల కారణంగా ప్రేక్షకుడిని మెప్పించలేకపోయిందనే విషయం మీడియాలో ప్రచారం జరిగింది. దాంతో రెండో రోజు పెద్దగా ఈ సినిమా కలెక్షన్లను రాబట్టలేకపోయింది. ఈ సినిమా తొలి రోజు కంటే బెటర్‌గా 29 లక్షలు తెలుగు రాష్ట్రాల్లో రాబట్టింది.
ఇక మూడో రోజు అహింస రెండు రోజుల కంటే బెటర్‌గా వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం.. 3వ రోజు సుమారు 20 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసే అవకాశం ఉంది. దాంతో ఈ సినిమా 35 నుంచి 40 లక్షల కలెక్షన్లు వసూలు చేయవచ్చని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దాంతో ఈ చిత్రం తొలి వారాంతానికి 1 కోటి రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











