Ponniyin Selvan 2 Collections 100 కోట్లు కోల్లగొట్టిన పొన్నియన్ సెల్వన్ 2.. రెండో రోజు ఎన్ని కోట్లంటే?
తమిళ స్టార్ హీరో విక్రమ్, టాప్ స్టార్ హీరోయిన్లు ఐశ్వర్య రాయ్ బచ్చన్, త్రిష, కార్తీ, జయం రవి నటించిన పొన్నియన్ సెల్వన్ 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా సంచలన రీతిలో కలెక్షన్లు సాధిస్తున్నది. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నది. ఏప్రిల్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి రోజే రికార్డు కలెక్షన్లను రాబట్టింది. అయితే రెండో రోజు అదే జోష్‌ను కొనసాగించిందా? ఈ చిత్రం ఏ రేంజ్‌లో వసూళ్లను సాధించిందనే వివరాల్లోకి వెళితే..
2800 స్క్రీన్లలో గ్రాండ్‌గా : పొన్నియన్ సెల్వన్ 2 చిత్రం సుమారు 250 కోట్ల బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్ అధినేత సుభాస్కరన్ నిర్మించారు. తమిళనాడులో 600 స్క్రీన్లతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 2800 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌ను భారీగా అంచనా వేశారు. దాదాపు ఈ చిత్రం 170 కోట్ల మేర ప్రపంచవ్యాప్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

తొలి రోజు రికార్డు కలెక్షన్లు : పొన్నియన్ సెల్వన్ 2 చిత్రం దేశీయంగాను, విదేశాల్లోనే ప్రభంజనం సృష్టిస్తున్నది. తొలి రోజు తమిళనాడులో 21.1 కోట్ల రూపాయలతో మొత్తంగా ఇండియాలో 32 కోట్ల గ్రాస్, 27 కోట్ల షేర్ రాబట్టింది. తెలుగు, కేరళ, కన్నడ, హిందీలో కలిపి 10 కోట్లు వసూలు చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. 64 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

2వ రోజు ఆక్యుపెన్సీ : పొన్నియన్ సెల్వన్ 2 రెండో రోజు ఆక్యుపెన్సీ వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం విడుదలైన చోట భారీ ఆక్యుపెన్సీ నమోదు చేసింది. తమిళనాడులో 64 శాతం ఆక్యుపెన్సీ, హిందీలో 15 శాతం, మలయాళంలో 25 శాతం, తెలుగు భాషలో సుమారు 37 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. తొలి రోజు కంటే ఈ చిత్రం రెండో రోజు భారీ ఆక్యుపెన్సీని పెంచుకోవడం విశేషంగా మారింది.

2వ రోజు ఎన్ని కోట్ల కలెక్షన్లు అంటే : ఇక పొన్నియన్ సెల్వన్ 2 రెండో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. చిత్రం తమిళనాడులో 20 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఇండియాలో 2 రోజు మొత్తంగా30 కోట్ల గ్రాస్, 25 కోట్ల షేర్ నమోదు చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా 45 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఈ చిత్రం 109 కోట్ల వసూళ్లను నమోదు చేసింది.
పొన్నియన్ సెల్వన్ 2 లాభాల్లోకి రావాలంటే? : పొన్నియన్ సెల్వన్ 2 చిత్రం బ్రేక్ ఈవెన్ వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం 170 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. ఇప్పటికే ఈ చిత్రం 100 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. త్వరలోనే అంటే.. ఈ వారం ముగిసే సమయానికి ఈ చిత్రం లాభాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











