Ponniyin Selvan 2 Day 3 Collections 150 కోట్లకు చేరువగా పొన్నియన్ సెల్వన్ 2.. 3వ రోజు కలెక్షన్ల కుంభవృష్టి!
చోళ, పాండ్య సామ్రాజ్యాల మధ్య అంతర్గత కలహాల నేపథ్యంలో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల జాతరను కొనసాగిస్తున్నది. ప్రముఖ దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టుగా రూపొందిన ఈ చిత్రం తొలి రోజు నుంచే భారీ కలెక్షన్లను రాబడుతున్నది. విక్రమ్, ఐశ్వర్యరాయ్ బచ్చన్, జయం రవి, త్రిష, కార్తీ, రెహ్మాన్, ప్రకాశ్ రాజ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి అన్ని వర్గాల నుంచి మంచి స్పందన లభించడంతో భారీ కలెక్షన్లను నమోదు అవుతున్నాయి. గత 3 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే...
పొన్నియన్ సెల్వన్ 2 బిజినెస్ :పొన్నియన్ సెల్వన్ 2 చిత్రం బడ్జెట్ విషయానికి వస్తే.. సుమారు 500 కోట్ల బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్ అధినేత సుభాస్కరన్ నిర్మించారు. పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 మూవీకి 250 కోట్లు బడ్జెట్ కేటాయించారు. భారీగా రూపొందిన ఈ సినిమానును తమిళనాడులో 600 స్క్రీన్లకుపైగా, ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 2800కుపైగా స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు భారీ బిజినెస్ జరిగింది. దాదాపు 170 కోట్ల మేర ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

పొన్నియన్ సెల్వన్ 2 3వ రోజు:పొన్నియన్ సెల్వన్ 2 సినిమా 3వ రోజు కలెక్షన్లు భారీగా నమోదు అయ్యాయి. తమిళంలో 23 కోట్ల రూపాయలు, హిందీలో 3 కోట్లు, మలయాళంలో 1.28 కోట్లు, తెలుగులో 2.5 కోట్ల రూపాయలు రాబట్టింది. మొదటి, రెండో రోజు కంటే ఈ చిత్రం 12 శాతం వృద్దిని కలెక్షన్ల రూపంలో సాధించింది. దాంతో ఈ చిత్రం ఇండియాలో 3 వ రోజు 29 కోట్లకుపైగా కలెక్షన్లను వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల వసూళ్లను రాబట్టింది.

మూడు రోజుల్లో రికార్డు కలెక్షన్లు:పొన్నియన్ సెల్వన్ 2 గత మూడు రోజుల్లో రికార్డు కలెక్షన్లను సాధించింది. గత 3 రోజుల్లో ఈ చిత్రం తమిళంలో సుమారు 61 కోట్లకుపైగా కలెక్షన్లను నమోదు చేసింది. హిందీలో 7 కోట్ల రూపాయలు, తెలుగులో సుమారు 7.5 కోట్లు, మలయాళంలో 3.75 కోట్లు, కన్నడలో 1 కోటి రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ఇండియాలో ఈ చిత్రం 88 కోట్ల రూపాయలు రాబట్టింది.

పొన్నియన్ సెల్వన్ 2 ఓవర్సీస్ కలెక్షన్లు:పొన్నియన్ సెల్వన్ 2 చిత్రం ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రికార్డు వసూళ్లను నమోదు చేస్తున్నది. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే, సింగపూర్, మలేషియా, మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌లో భారీ కలెక్షన్లను నమోదు చేసింది. తొలి రోజు ఈ చిత్రం 9 కోట్లు రాబట్టిన ఈ చిత్రం మూడో రోజు ముగిసే సమయానికి ఈ చిత్రం 52 కోట్ల కలెక్షన్లను రాబట్టింది.

ఇండియాలో 100 కోట్లకు చేరువగా :ఇక పొన్నియన్ సెల్వన్ 2 చిత్రం ఇండియాలో 100 క్లబ్‌కు చేరువైంది. ఈ చిత్రం ఇండియాలో 88 కోట్లు, ఓవర్సీస్‌లో 52 కోట్లు రాట్టింది. దాంతో ఈ చిత్రం 140 కోట్ల కలెక్షన్లను నమోదు చేసింది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 80 కోట్ల షేర్ సాధించిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. సోమవారం కూడా భారీ వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

పొన్నియన్ సెల్వన్ 2 లాభాల్లోకి రావాలంటే? :పొన్నియన్ సెల్వన్ 2 సినిమా లాభాల విషయానికి వస్తే.. తొలి వారం ముగిసే సమయానికి ఈ చిత్రం డిస్టిబ్యూటర్లకు లాభాలను పంచిపెట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. కనీసం 170 షేర్ ప్రపంచవ్యాప్తంగా రాబట్టాల్సి ఉంది. ఇప్పటికే 88 కోట్లు రాబట్టినందున్న త్వరలోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











