Sankranthiki Vasthunam Day 32 Collection : చేతులెత్తేసిన వెంకటేష్ .. షాకిచ్చేలా వసూళ్లు , ఎన్ని కోట్లంటే?

విక్టరీ వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం విజయవంతంగా 5 వారాలు పూర్తి చేసుకుంది. త్వరలోనే ఆరో వారం కూడా పూర్తి చేసుకునే దిశగా కదులుతున్నాడు వెంకటేష్. చిన్నా పెద్దా సినిమాల రాకతో వెంకీ మామ జోరు తగ్గుతోంది. ఈ నేపథ్యంలో 32వ రోజు సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో పరిశీలిస్తే:

సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించగా.. వీకే నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, సాయికుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. నటీనటుల రెమ్యునరేషన్‌, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను దాదాపు 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించారు.

Aishwarya Rajesh Meenakshi Chowdhury Victory Venkatesh Sankranthiki Vasthunam

ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. దాదాపు 42 కోట్లుగా జరిగింది. ఆంధ్రా, నైజాంలో కలిపి 33 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి 9 కోట్ల రూపాయలుగా నమోదైంది. అలా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మొత్తంగా 42 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాదాపు 85 కోట్ల రూపాయలు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నిర్దేశించారు ట్రేడ్ పండితులు. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌ లక్ష్యాన్ని పూర్తి చేసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా.. ఇప్పటి వరకు దాదాపు రూ. 150 కోట్లకు పైగా లాభాలను డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతకు పంచి పెట్టింది .

ఇకపోతే.. 31 రోజుల వరకు ఈ సినిమా నైజాంలో రూ.42.47 కోట్లు, సీడెడ్‌లో రూ.19.01 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.22.42 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ.13.72 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 8.97 కోట్లు, గుంటూరులో రూ.10.39 కోట్లు, కృష్ణాలో రూ.9.62 కోట్లు, నెల్లూరులో రూ. 4.80 కోట్లు చొప్పున మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 131.40 కోట్ల షేర్ రాబట్టింది. కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో రూ.8.97 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 16.97 కోట్లు అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో రూ.213.10 కోట్ల గ్రాస్ అందుకోగా ప్రపంచవ్యాప్తంగా రూ.157.34 కోట్ల షేర్‌ను రాబట్టింది.

Aishwarya Rajesh Meenakshi Chowdhury Victory Venkatesh Sankranthiki Vasthunam

గత వారం నాగచైతన్య నటించిన తండేల్, అజిత్ నటించిన పట్టుదల చిత్రాలతో పాటు ఫిబ్రవరి 14న దిగ్గజ కమెడియన్ బ్రహ్మానందం నటించిన బ్రహ్మ ఆనందం, పాటు మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ నటించిన లైలా చిత్రాలు రిలీజ్ అయ్యాయి. డిఫరెంట్ జోనర్స్‌తో తెరకెక్కిన ఈ సినిమాల నుంచి సంక్రాంతికి వస్తున్నాం సినిమా గట్టి పోటీని ఎదుర్కొంది.

ఈ నేపథ్యంలో 32వ రోజు వసూళ్ల విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం ఈ సినిమా వసూళ్లు షాకిచ్చేలా పడిపోయాయి. తొలిసారిగా రూ.30 లక్షల లోపే చాప చుట్టేసిన వెంకటేష్ 32వ రోజు కేవలం రూ. 26 లక్షల గ్రాస్ మాత్రమే అందుకున్నాడు. తండేల్, పట్టుదల వంటి క్రేజీ చిత్రాలు రిలీజైన అంతటి టఫ్ ఫైట్‌లోనూ గత వీకెండ్‌లో రూ. 3 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించడంతో ఈ వీకెండ్‌ పైనా సంక్రాంతికి వస్తున్నాం యూనిట్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. మరి ఐదో వారం ముగిసేసరికి సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఎలాంటి మేజిక్ చూస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X