Son of Sardaar 2 Day 9 Collections: మృణాల్ చిత్రానికి కోట్లలో నష్టం.. సన్ ఆఫ్ సర్దార్ 2 9 రోజుల కలెక్షన్స్?

బాలీవుడ్ లేటెస్ట్ కామెడీ ఫిల్మ్ సన్ ఆఫ్ సర్దార్ 2. ఈ చిత్రానికి అజయ్ కుమార్ అరోరా దర్శకత్వం వహించారు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు. ఆగస్టు 1న ఈ చిత్రం కేవలం హిందీ భాషలోనే విడుదలైంది. అయితే ఈ చిత్రంలో తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న మృణాల్ ఠాకూర్ నటించడంతో బాక్సాఫీస్ కలెక్షన్లపై ఇంట్రెస్ట్ కుదిరింది. ఈ క్రమంలో సన్ ఆఫ్ సర్దార్ 2 మూవీ బడ్జెట్ ఎంత? 9వ రోజు ఎంత వసూల్ చేసింది? ఇప్పటి వరకు ఎన్ని కోట్లు నష్టాల్లో ఉందనేది వివరాల్లోకి వెళితే..

సన్ ఆఫ్ సర్దార్ 2 బడ్జెట్?
దేవగన్ ఫిల్మ్స్, జియో స్టూడియోస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. అజయ్ దేవగన్, జ్యోతి దేశ్ పాండే, ఎన్ఆర్ పచిసియా, ప్రవీణ్ నిర్మాతలుగా వ్యవహరించారు. మరోవైపు అజయ్ దేవగన్, మృణాల్ ఠాకూర్ తో పాటు రవి కిషణ్, నీరు బజ్వా, చుంకీ పాండే, శరత్ సక్సెనా, సంజయ్ మిశ్రా వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషించారు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, మ్యూజిక్ విభాగాల్లో టాప్ టెక్నీషియన్లు పనిచేశారు. మరోవైపు సినిమాను కూడా ఎంతో గ్రాండ్ గా తెరకెక్కించారు. ఇలా నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు కలుపుకొని చిత్రానికి రూ.150 కోట్ల బడ్జెట్ అయ్యిందని ట్రేడ్ నిపుణులు వెల్లడించారు.

Ajay Devgn Mrunal Thakur Movie Son of Sardaar 2 Day 9 Collections

సన్ ఆఫ్ సర్దార్ 2 బ్రేక్ ఈవెన్ పాయింట్?
ప్రీరిలీజ్ ప్రమోషన్స్ ను సన్ ఆఫ్ సర్దార్ 2 విషయంలో భారీగానే చేశారు. కానీ ఎందుకో సినిమాకు ప్రీ రిలీజ్ బజ్ కూడా పెద్దగా వినిపించలేదు. బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు మాత్రం ఈ చిత్రం థియేట్రికల్ రన్ ద్వారా ఈ చిత్రం 140 కోట్లు గ్రాస్ వసూల్ చేస్తే సేఫ్ జోన్ లోకి వస్తుందని, ఆ తర్వాత వసూలైతే లాభాలుగా లెక్క గట్టాలని తెలిపారు.

8 రోజుల వసూళ్లు..
స్టార్ హీరో అజయ్ దేవగన్, మృణాల్ ఠాకూర్, భారీ ప్రొడక్షన్ ఉన్నప్పటికీ ఈ చిత్రానికి ఓపెనింగ్ డే మాత్రం రూ.7.25 కోట్ల నెట్ వసూల్ చేసింది. ఇక 2వ రోజు 8.25 కోట్లు, 3వ రోజు 9.25 కోట్లు, 4వ రోజు రూ.2.35 కోట్లు, 5వ రోజు 2.75 కోట్లు, 6వ రోజు రూ.1.75 కోట్లు, 7వ రోజు 1.4 కోట్లు, 8వ రోజు రూ.1.25 కోట్లు వసూల్ చేసింది. ఇలా 8 రోజుల్లో ఈ చిత్రం 34.25 కోట్ల ఇండియా నెట్ ను వసూల్ చేసింది. ఇక ఇండియా గ్రాస్ రూ.41 కోట్లు కాగా, ఓవరీస్ లో రూ.8 కోట్లు వసూళ్లు చేసింది. ఇలా 8 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 49 కోట్లు వసూళ్లు చేసిందని సాక్ నిక్ రిపోర్ట్ తెలిపింది.

9వ రోజు కలెక్షన్స్..
ఇక 9వ రోజు శనివారం వీకెండ్ అయినప్పటికీ ఈ చిత్రానికి తక్కువగానే వసూళ్లు దక్కాయి. కేవలం 4 కోట్ల ఇండియా నెట్ ను వసూల్ చేసింది. దీంతో ఇండియా నెట్ రూ.38.25 కోట్లకు చేరుకుంది. ఈ వసూళ్ల ప్రకారం.. సన్ ఆఫ్ సర్దార్ 2 నష్టాల్లోనే ఉంది. ఇంకా థియేట్రికల్ రన్ నుంచి ఈ చిత్రం 90 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టాలని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ప్రస్తుతం 2వ వారంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిత్రం కేవలం వీకెండ్ లోనే పెర్ఫామ్ చేస్తోంది. మిగితా రోజుల్లో వసూళ్లు భారీగా పడిపోతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X