అజయ్ ..సారాయి వీర్రాజు చిత్రం ఏమైంది?
అజయ్ హీరోగా డి.యన్.కన్నన్ రూపొందించిన 'సారాయి వీర్రాజు' ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకుంది. తమిళ వాసనలు బాగా ఉండటం, సరైన స్క్రీన్ ప్లే రాసుకోలేకపోవటం ఈ చిత్రానికి మైనస్ లుగా చెప్తున్నారు. కథలో సారాయి వీర్రాజు(అజయ్) అమాయికత్వంలో ఓ నలుగురు (విలన్స్)చెప్పిన మాటలు నమ్మి ఊరందరి చేతా వారి నెట్ వర్క్ బిజినెస్ లో డబ్బులు కట్టిస్తాడు. ఆ తర్వాత వారు ఆ డబ్బులు పట్టుకుని గ్రామ ప్రజలను మోసం చేసి జంప్ అయ్యే ప్రయత్నాల్లో ఉంటారు. అది గమనించిన వీర్రాజు ప్రేయసి ధనలక్ష్మి(రమ్య)నిలదీస్తుంది. దాంతో వారు ఆమెను గ్యాంగ్ రేప్ చేస్తారు. అయితే ఆ సమయంలో అజయ్ త్రాగి పడిపోయి ఉంటాడు. లేచి జరిగిన ఘోరం తెలుసుకుని వారిపై పగ తీర్చుకోవటానికి ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. ఈలోగా వారు దుబాయ్ పారిపోతారు. వారిని పట్టుకుని ఎలా తన పగ తీర్చుకున్నాడనేదే మిగతా కథ. ఇక ఈ చిత్రం కథ ప్లాష్ బ్యాక్ లో వస్తుంది. అప్పటి వరకూ సారాయి వీర్రాజు గా అజయ్ చేష్టలు ఫస్టాఫ్ లో వస్తాయి. ఇక చిత్రం కథాంశంలో మన నేటివిటీ తక్కువ అవటం సన్నివేశాలు మరీ మోటుగా అల్లటం ప్రేక్షకులుకు సహన పరీక్ష పెడుతోందంటున్నారు.


Click it and Unblock the Notifications











