Thunivu Closing Collection: అజిత్ 'తెగింపు'కు ఊహించని కలెక్షన్స్.. బోనీ కపూర్ కి లాభమెంతో తెలిస్తే!

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ సినిమాల్లో తన యాక్షన్ స్టంట్స్ తో అదరగొడుతుంటాడు. దాదాపుగా రియల్ యాక్షన్ సన్నివేశాలు చేస్తూ అభిమానులకు ఐ ట్రీట్ ఇస్తుంటాడు ఈ యాక్షన్ హీరో. అందుకే ఆయన్ను ముద్దుగా తలా అని పిలుచుకుంటారు అభిమానులు. ఇటీవల నేర్కొండ పార్వై (హిందీ పింక్ రీమేక్), వలిమై చిత్రాలతో అభిమానులను పలకరించిన అజిత్ తాజాగా తెగింపు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు గత రెండు చిత్రాలకు దర్శకత్వం వహించిన హెచ్ వినోద్ తెరకెక్కించడం విశేషం. కాగా సంక్రాంతి కానుకగా జనవరి 11న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన అజిత్ తునివుకు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన టోటల్ కలెక్షన్స్ ఎంతో ఓ లుక్కేద్దాం.

 తెలుగులో తెగింపుగా..

తెలుగులో తెగింపుగా..

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఆయనకు తెలుగులో కూడా కొంతమేర ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే ఆయన సినిమాలు తెలుగులోనూ అప్పుడ్పుడు విడుదలై సందడి చేస్తుంటాయి. ఈ క్రమంలోనే అజిత్ నటించిన తాజా సినిమా తెగింపు. తమిళ చిత్రమైన తునివుని తెలుగులో తెగింపు టైటిల్ తో విడుదల చేశారు. గత రెండు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన బోనీ కపూర్ ఈ సినిమాకు కూడా నిర్మాత బాధ్యతలు చేపట్టారు. అజిత్-వినోద్-బోనీ కపూర్ కాంబినేషన్ లో వరుసగా వచ్చిన మూడో చిత్రమే తెగింపు.

ప్రీ రిలీజ్ బిజినెస్ డిటేల్స్..

ప్రీ రిలీజ్ బిజినెస్ డిటేల్స్..

తలా అజిత్ కు ఉన్న మార్కెట్ ను బట్టి తెగింపు సినిమాకు ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 3.20 కోట్లు, తమిళనాడులో రూ. 58 కోట్లు, కర్ణాటక రాష్ట్రంలో రూ. 3.60 కోట్లు, కేరళలో రూ. 2.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.70 కోట్లు, ఓవర్సీస్ రూ. 15 కోట్లు కాగా ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ. 84 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో తెగింపు చిత్రానికి బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా రూ. 85 కోట్లు ఫిక్స్ అయింది.

 తెలుగు రాష్ట్రాల్లో..

తెలుగు రాష్ట్రాల్లో..

అజిత్ తెగింపు సినిమాలో తన మ్యూజిక్ తో ఆకట్టుకున్నాడు జిబ్రాన్. దీంతో అజిత్ తెగింపు చిత్రానికి ఫుల్ రన్ కలెక్షన్స్ పర్వాలేదనిపించుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నైజాం రూ. 1.83 కోట్లు, సీడెడ్ లో రూ. 53 లక్షలు, ఆంధ్రాలో రూ. 1.84 కోట్లు వసూలు చేసింది. ఇలా మొత్తంగా ఏపీ తెలంగాణలో తెగింపు సినిమాకు రూ. 4.20 కోట్లు గ్రాస్ గా, రూ. 2.16 కోట్లు షేర్ నమోదైంది.

 ప్రపంచవ్యాప్తంగా..

ప్రపంచవ్యాప్తంగా..

కోలీవుడ్ స్టార్ నటి మంజు వారియర్ యాక్షన్ సీక్వెన్స్ తో అలరించిన తెగింపు చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా టాక్ పర్వాలేదనిపించింది. ఫలితంగా ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.52 కోట్లు, తమిళనాడులో రూ. 121.10 కోట్లు, కర్ణాటకలో రూ. 13.25 కోట్లు, కేరళ రాష్ట్రంలో రూ. 3.85 కోట్లు కలెక్ట్ చేయగా.. రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 55.30 కోట్లు కలెక్షన్స్ సాధించింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా రూ. 200.02 కోట్లు గ్రాస్, రూ. 103.10 కోట్ల షేర్ వసూళ్లు రాబట్టింది. అంటే గ్రాస్ లో రూ. 200 కోట్ల క్లబ్, షేర్ లో రూ. 100 కోట్ల క్లబ్ లో చేరి రికార్డ్ క్రియేట్ చేసింది.

లాభం ఎంతంటే..

లాభం ఎంతంటే..

అజిత్-హెచ్ వినోద్-బోనీ కపూర్ ముగ్గురి కాంబినేషన్ లో మూడో సినిమాగా వచ్చిన తెగింపు క్లీన్ హిట్ కొట్టేసింది. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 84 కోట్లు మేర బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 85 కోట్లుగా ఫిక్స్ అయింది. అజిత్ తునివు చిత్రం ఫుల్ రన్ లో ప్రపంచవ్యాప్తంగా రూ. 103.10 కోట్లు వసూళు చేసింది. అంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేసుకుని మరి రూ. 18.10 కోట్ల లాభం సాధించి సూపర్ హిట్ గా నిలిచింది.

 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం..

తెలుగు రాష్ట్రాల్లో మాత్రం..

మాస్ యాక్షన్ స్టంట్స్, బైక్ చేజింగ్స్ తో ఆద్యంతం అలరించే కోలీవుడ్ స్టార్ హీరో తలా అజిత్ నటించిన లేటెస్ట్ మూవీ తెగింపుకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 3.20 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో రూ. 3.50 కోట్లుగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ నమోదైంది. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో టోటల్ గా రూ. 2.16 కోట్లు కొల్లగొట్టింది. అంటే ఇంకో రూ. 1.34 కోట్లు రాబట్టలేకపోయింది. దీంతో అజిత్ తెగింపు చిత్రం ఏపీ తెలంగాణలో ఫ్లాప్ గా మిగిలిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X