twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Thunivu Collection: సక్సెస్ కానున్న అజిత్ బ్యాంక్ రాబరీ.. ఇంకొన్ని లక్షలు వస్తే హిట్టు, తెలుగులో మాత్రం!

    |

    తన యాక్షన్ అడ్వెంచర్స్, పర్ఫామెన్స్, హావాభావాలతో నిత్యం స్టన్ చేస్తుంటాడు కోలీవుడ్ స్టార్ హీరో తలా అజిత్. సినిమాలో దాదాపుగా రియల్ బైక్ స్టంట్స్ చేసి ఫ్యాన్స్, ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంటాడు ఈ హీరో. అందుకే ఆయను తెలుగులోనూ అభిమానులు ఉన్నారు. తలా అజిత్ ఇటీవల నేర్కొండ పార్వై (హిందీ పింక్ రీమేక్), వలిమై చిత్రాలతో అభిమానులను పలకరించాడు. ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు. అయితే ఇప్పుడు ముచ్చటగా మూడోసారి హెచ్ వినోద్ దర్శకత్వంలో అజిత్ నటించిన లేటెస్ట్ సినిమా తునివు. తెలుగులో తెగింపు అనే టైటిల్ తో విడుదల చేశారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్స్ 10వ రోజు ఎలా ఉన్నాయో చూద్దామా!

    గత రెండు చిత్రాలకు..

    గత రెండు చిత్రాలకు..

    తమిళ స్టార్ హీరో అజిత్ తెలుగులో కూడా కొంతమేర ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అందుకే ఆయన సినిమాలు తెలుగులోనూ అప్పుడ్పుడు విడుదలై సందడి చేస్తుంటాయి. ఈ క్రమంలోనే అజిత్ నటించిన తాజా సినిమా తెగింపు. అజిత్ నటించిన అంతకుముందు వచ్చిన రెండు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన బోనీ కపూర్ ఈ సినిమాకు కూడా నిర్మాత బాధ్యతలు చేపట్టారు. అజిత్-వినోద్-బోనీ కపూర్ కాంబినేషన్ లో వరుసగా వచ్చిన మూడో చిత్రమే తెగింపు.

     ప్రీ రిలీజ్ బిజినెస్ డీటేల్స్..

    ప్రీ రిలీజ్ బిజినెస్ డీటేల్స్..

    తునివు సినిమాకు తలా అజిత్ కు ఉన్న మార్కెట్ దృష్ట్యా ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 3.20 కోట్లు, తమిళనాడులో రూ. 58 కోట్లు, కర్ణాటక రాష్ట్రంలో రూ. 3.60 కోట్లు, కేరళలో రూ. 2.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.70 కోట్లు, ఓవర్సీస్ రూ. 15 కోట్లు కాగా ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ. 84 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీని ప్రకారం తెగింపు చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను సాధించాలంటే రూ. 85 కోట్ల కలెక్షన్స్ రాబట్టాలి.

    10వ రోజు ఏపీ, తెలంగాణ వసూళ్లు..

    10వ రోజు ఏపీ, తెలంగాణ వసూళ్లు..

    జీబ్రాన్ తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేసిన చిత్రం తునివు. తెలుగులో డబ్బింగ్ చిత్రంగా తెగింపు టైటిల్ తో విడుదలైన ఈ సినిమాకు కలెక్షన్లు కాస్తా తగ్గుముఖం పడినట్లు తెలుస్తోంది. అజిత్ తెగింపు చిత్రం 10వ రోజు తెలుగు రాష్ట్రాల్లో నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్ర, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణా, నెల్లూరు ఇలా అన్ని ఏరియాల్లో కలిపి రూ. 6 లక్షలు వసూలు చేసింది. ఇక 10 రోజుల్లో నైజాంలో రూ. 1.71 కోట్లు, సీడెడ్ రూ. 49 లక్షలు, ఆంధ్రప్రదేశ్ మొత్తం రూ. 1.72 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక 10 రోజుల్లో ఏపీ తెలంగాణలో రూ. 3.92 కోట్లు గ్రాస్ గా, రూ. 2 కోట్లు షేర్ నమోదైంది.

    10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా..

    10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా..

    కోలీవుడ్ స్టార్ నటి మంజు వారియర్ యాక్షన్ సీక్వెన్స్ తో అలరించిన తెగింపు చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా పర్వాలేదనిపిస్తోంది. ఫలితంగా 10 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 3.92 కోట్లు, తమిళనాడులో రూ. 93.20 కోట్లు, కర్ణాటకలో రూ. 11.80 కోట్లు, కేరళ రాష్ట్రంలో రూ. 3.65 కోట్లు కలెక్ట్ చేయగా.. రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.85 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 48.90 కోట్లు కలెక్షన్స్ సాధించింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా రూ. 163.32 కోట్లు గ్రాస్, రూ. 84.83 కోట్ల షేర్ వసూళ్లు రాబట్టింది.

    రావాల్సింది ఎంతంటే..

    రావాల్సింది ఎంతంటే..

    అజిత్-హెచ్ వినోద్ కాంబినేషన్ లో మూడోసారి విడుదలైన తెగింపు చిత్రం హ్యాట్రిక్ గా నిలిచింది. ఇక తునివు సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 84 కోట్లు మేర బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 85 కోట్లుగా ఫిక్స్ అయింది. అజిత్ తునివు చిత్రం 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 84.83 కోట్లు వసూళు చేసింది. కాబట్టి, ఇంకా రూ. 17 లక్షలు వస్తే ఈ సినిమా క్లీన్ హిట్ గా నిలుస్తుంది.

    తెలుగు రాష్ట్రాల్లో మాత్రం..

    తెలుగు రాష్ట్రాల్లో మాత్రం..

    మాస్ యాక్షన్ స్టంట్స్, బైక్ చేజింగ్స్ తో ఆద్యంతం అలరించే కోలీవుడ్ స్టార్ హీరో తలా అజిత్ నటించిన లేటెస్ట్ మూవీ తెగింపుకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 3.20 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో రూ. 3.50 కోట్లుగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ నమోదైంది. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పది రోజుల్లో రూ. 2 కోట్లు కొల్లగొట్టగా.. మరో రూ. 1.50 కోట్లు వసూళ్లు రాబట్టగలిగితే ఇక్కడ కూడా క్లీన్ హిట్ స్టేటస్ సొంతం చేసుకునే అవకాశం ఉంది. అంటే.. వరల్డ్ వైడ్ గా హిట్ కొట్టాలంటే రూ. 17 లక్షలు, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం రూ. కోటిన్నర రావాల్సిందే.

    English summary
    Thala Ajith H Vinoth Hatrick Combination Movie Thunivu 10 Days Worldwide Box Office Collection Is Rs 163.32 Cr.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X