Don't Miss!
- Sports
సెంచరీ చేసినా శుభ్‌మన్ గిల్‌తో టీమిండియాకు ప్రమాదమే!
- News
ఉపాది హామీ పథకానికి తూట్లు పొడిచిన కేంద్రం.!మరోసారి మండిపడ్డ కల్వకుంట్ల కవిత.!
- Technology
రియల్మీ కొత్త ఫోన్ టీజర్ విడుదలయింది! లాంచ్ కూడా త్వరలోనే!
- Finance
ghmc tax fraud: అలా పన్ను చెల్లించిన వారిపై GHMC ఆగ్రహం.. FIR నమోదుకు రంగం సిద్ధం
- Lifestyle
Yoga For Eyes: కంటి యోగా.. చూపు మెరుగవుతుంది, ఇంకా ఎన్నో లాభాలు
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Thunivu Collection: ఒక్కసారిగా పెరిగిన వసూళ్లు.. లాభాల్లోకి అజిత్ సినిమా.. ఒక్కరోజుకి ఎంతో తెలుసా?
కోలీవుడ్ స్టార్ హీరో తలా అజిత్ లేటెస్ట్ గా నటించిన చిత్రం తునివు. ఈ సినిమాను తెలుగులో తెగింపు టైటిల్ తో డబ్ చేసి విడుదల చేశారు. హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు బాలీవుడ్ బడా నిర్మాత బోనీ కపూర్ నిర్మాతగా వ్యవహరించారు. తెలుగులో బాలకృష్ణ, చిరంజీవి, విజయ్ సినిమాలకు పోటీగా తెగింపు సినిమాతో ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచాడు అజిత్. తెలుగు రాష్ట్రాల్లోని అభిమానుల కోసం సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 11న తన సినిమాను విడుదల చేశాడు అజిత్. బ్యాంక్ రాబరీ, మెసేజ్ ఒరియెంటెండ్ మూవీగా వచ్చిన తునివు 11వ రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దామా!

రియల్ బైక్ స్టంట్స్ తో..
తన యాక్షన్ అడ్వెంచర్స్, పర్ఫామెన్స్, హావాభావాలతో నిత్యం స్టన్ చేస్తుంటాడు కోలీవుడ్ స్టార్ హీరో తలా అజిత్. సినిమాలో దాదాపుగా రియల్ బైక్ స్టంట్స్ చేసి ఫ్యాన్స్, ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంటాడు ఈ హీరో. అందుకే ఆయను తెలుగులోనూ అభిమానులు ఉన్నారు. అజిత్ నేర్కొండ పార్వై (హిందీ పింక్ రీమేక్), వలిమై చిత్రాలకు దర్శకత్వం వహించిన హెచ్ వినోద్, నిర్మాత బోనీ కపూర్ ఈ సినిమాకు సైతం అవే బాధ్యతలు స్వీకరించారు.

తెగింపు ప్రీ రిలీజ్ బిజినెస్..
అజిత్ తునివు చిత్రానికి అతనికి ఉన్న మార్కెట్ ను బట్టి ప్రీరిలీజ్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ. 3.20 కోట్లు, తమిళనాడులో రూ. 58 కోట్లు, కర్ణాటక రాష్ట్రంలో రూ. 3.60 కోట్లు, కేరళలో రూ. 2.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.70 కోట్లు, ఓవర్సీస్ రూ. 15 కోట్లు కాగా ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ. 84 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీని ప్రకారం తెగింపు చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను సాధించాలంటే రూ. 85 కోట్ల కలెక్షన్స్ రాబట్టాలి.

11వ రోజు ఏపీ, తెలంగాణ వసూళ్లు..
కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్ సంగీతం అందించిన లేటెస్ట్ మూవీ తునివు. తెలుగులో డబ్బింగ్ చిత్రంగా తెగింపు టైటిల్ తో విడుదలైన ఈ సినిమాకు కలెక్షన్లు రోజు రోజు కాస్తా తగ్గుముఖం పడ్డాయి. కానీ 11వ రోజు మాత్రం పదో రోజు కలెక్షన్లను సాధించింది. అజిత్ తెగింపు చిత్రం 11వ రోజు తెలుగు రాష్ట్రాల్లో నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్ర, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణా, నెల్లూరు ఇలా అన్ని ఏరియాల్లో కలిపి 10వ రోజు వచ్చినట్లే రూ. 6 లక్షలు వసూలు చేసింది. ఇక 11 రోజుల్లో నైజాంలో రూ. 1.73 కోట్లు, సీడెడ్ రూ. 50 లక్షలు, ఆంధ్రప్రదేశ్ మొత్తం రూ. 1.75 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక 11 రోజుల్లో ఏపీ తెలంగాణలో రూ. 3.98 కోట్లు గ్రాస్ గా, రూ. 2.03 కోట్లు షేర్ నమోదైంది.

11 రోజుల్లో ఎక్కడెక్కడా ఎంతంటే..
అజిత్ తో కలిసి కోలీవుడ్ స్టార్ నటి మంజు వారియర్ యాక్షన్ సీక్వెన్స్ తో అదరగొట్టిన చిత్రం తెగింపుకు ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు పర్వాలేదనిపిస్తోంది. ఫలితంగా 11 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 3.98 కోట్లు, తమిళనాడులో రూ. 97.85 కోట్లు, కర్ణాటకలో రూ. 12.15 కోట్లు, కేరళ రాష్ట్రంలో రూ. 3.70 కోట్లు కలెక్ట్ చేయగా.. రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.85 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 50.55 కోట్లు కలెక్షన్స్ సాధించింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా రూ. 170.08 కోట్లు గ్రాస్, రూ. 88.25 కోట్ల షేర్ వసూళ్లు రాబట్టింది.

ఒక్కసారిగా వచ్చిన లాభం ఎంతంటే..
అజిత్-హెచ్ వినోద్ కాంబినేషన్ లో మూడోసారి విడుదలైన తునివు చిత్రం హ్యాట్రిక్ హిట్ గా నిలిచింది. ఈ తునివు సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 84 కోట్లు మేర బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 85 కోట్లుగా ఫిక్స్ అయింది. అజిత్ తునివు చిత్రం 11 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 88.25 కోట్లు వసూళు చేసింది. అంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి కాగా రూ. 3.25 కోట్లు లాభం వసూళు చేసి క్లీన్ హిట్ గా నిలిచింది అజిత్ తెగింపు చిత్రం.

తెలుగు రాష్ట్రాల్లో మాత్రం..
మాస్ యాక్షన్ స్టంట్స్, బైక్ చేజింగ్స్ తో ఆద్యంతం అలరించే కోలీవుడ్ స్టార్ హీరో తలా అజిత్ నటించిన లేటెస్ట్ మూవీ తెగింపుకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 3.20 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో రూ. 3.50 కోట్లుగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ నమోదైంది. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 11 రోజుల్లో రూ. 2.03 కోట్లు కొల్లగొట్టగా.. మరో రూ. 1.47 కోట్లు వసూళ్లు రాబట్టగలిగితే ఇక్కడ కూడా క్లీన్ హిట్ స్టేటస్ సొంతం చేసుకునే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే అజిత్ సినిమా క్లీన్ హిట్ కొట్టి రూ. 3.25 కోట్లతో లాభంలోకి వెళితే.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇంకా రూ. కోటీ 47 లక్షలు సాధించాల్సి ఉంది.