twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Thunivu Collection: లాభాల దిశగా అజిత్ 'తెగింపు'.. తెలుగులో మాత్రం కష్టమే.. ఇప్పటికీ వచ్చింది ఎంతంటే?

    |

    కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ సినిమాల్లో తన యాక్షన్ స్టంట్స్ తో అదరగొడుతుంటాడు. దాదాపుగా రియల్ యాక్షన్ సన్నివేశాలు చేస్తూ అభిమానులకు ఐ ట్రీట్ ఇస్తుంటాడు ఈ యాక్షన్ హీరో. అందుకే ఆయన్ను ముద్దుగా తలా అని పిలుచుకుంటారు అభిమానులు. ఇటీవల నేర్కొండ పార్వై (హిందీ పింక్ రీమేక్), వలిమై చిత్రాలతో అభిమానులను పలకరించిన అజిత్ తాజాగా తెగింపు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

    ఈ సినిమాకు గత రెండు చిత్రాలకు దర్శకత్వం వహించిన హెచ్ వినోద్ తెరకెక్కించడం విశేషం. కాగా సంక్రాంతి కానుకగా జనవరి 11న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన అజిత్ తునివు 19 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దామా!

    బోనీ కపూర్ నిర్మాతగా..

    బోనీ కపూర్ నిర్మాతగా..

    కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఆయనకు తెలుగులో కూడా కొంతమేర ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే ఆయన సినిమాలు తెలుగులోనూ అప్పుడ్పుడు విడుదలై సందడి చేస్తుంటాయి.

    ఈ క్రమంలోనే అజిత్ నటించిన తాజా సినిమా తెగింపు. తమిళ చిత్రమైన తునివుని తెలుగులో డబ్బింగ్ చేసి తెగింపుగా తీసుకొచ్చారు. గత రెండు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన బోనీ కపూర్ ఈ సినిమాకు కూడా నిర్మాత బాధ్యతలు చేపట్టారు. అజిత్-వినోద్-బోనీ కపూర్ కాంబినేషన్ లో వరుసగా వచ్చిన మూడో చిత్రమే తెగింపు.

    ప్రీ రిలీజ్ బిజినెస్ డిటేల్స్..

    ప్రీ రిలీజ్ బిజినెస్ డిటేల్స్..

    తలా అజిత్ కు ఉన్న మార్కెట్ ను బట్టి తెగింపు సినిమాకు ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 3.20 కోట్లు, తమిళనాడులో రూ. 58 కోట్లు, కర్ణాటక రాష్ట్రంలో రూ. 3.60 కోట్లు, కేరళలో రూ. 2.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.70 కోట్లు, ఓవర్సీస్ రూ. 15 కోట్లు కాగా ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ. 84 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో తెగింపు చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను సాధించాలంటే రూ. 85 కోట్ల కలెక్షన్స్ రాబట్టాలి.

    19వ రోజు ఏపీ, తెలంగాణలో వసూళ్లు..

    19వ రోజు ఏపీ, తెలంగాణలో వసూళ్లు..

    అజిత్ తెగింపు సినిమాలో తన మ్యూజిక్ తో ఆకట్టుకున్నాడు జిబ్రాన్. అజిత్ తెగింపు చిత్రం 19వ రోజు తెలుగు రాష్ట్రాల్లో నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్ర, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణా, నెల్లూరు ఇలా అన్ని ఏరియాల్లో కలిపి రూ. 2 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం.

    ఇక 19 రోజుల్లో నైజాంలో రూ. 1.82 కోట్లు, సీడెడ్ రూ. 53 లక్షలు, ఆంధ్రప్రదేశ్ మొత్తం రూ. 1.83 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక మొత్తం 19 రోజుల్లో ఏపీ తెలంగాణలో తెగింపు సినిమా రూ. 4.18 కోట్లు గ్రాస్ గా, రూ. 2.15 కోట్లు షేర్ నమోదైంది.

    19 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా..

    19 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా..

    కోలీవుడ్ స్టార్ నటి మంజు వారియర్ యాక్షన్ సీక్వెన్స్ తో అలరించిన తెగింపు చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా టాక్ బాగానే ఉంటోంది. ఫలితంగా 19 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.50 కోట్లు, తమిళనాడులో రూ. 110.80 కోట్లు, కర్ణాటకలో రూ. 13.10 కోట్లు, కేరళ రాష్ట్రంలో రూ. 3.82 కోట్లు కలెక్ట్ చేయగా.. రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.95 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 52.60 కోట్లు కలెక్షన్స్ సాధించింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా రూ. 186.77 కోట్లు గ్రాస్, రూ. 96.30 కోట్ల షేర్ వసూళ్లు రాబట్టింది.

    లాభం ఎంతంటే..

    లాభం ఎంతంటే..

    అజిత్-హెచ్ వినోద్-బోనీ కపూర్ ముగ్గురి కాంబినేషన్ లో మూడో సినిమాగా వచ్చిన తెగింపు క్లీన్ హిట్ కొట్టేసింది. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 84 కోట్లు మేర బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 85 కోట్లుగా ఫిక్స్ అయింది. అజిత్ తునివు చిత్రం 19 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 96.30 కోట్లు వసూళు చేసింది. అంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి కాగా రూ. 11.30 కోట్లు లాభంతో సూపర్ హిట్ గా నిలిచింది అజిత్ తెగింపు చిత్రం.

    తెలుగు రాష్ట్రాల్లో ఇంకా..

    తెలుగు రాష్ట్రాల్లో ఇంకా..

    మాస్ యాక్షన్ స్టంట్స్, బైక్ చేజింగ్స్ తో ఆద్యంతం అలరించే కోలీవుడ్ స్టార్ హీరో తలా అజిత్ నటించిన లేటెస్ట్ మూవీ తెగింపుకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 3.20 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో రూ. 3.50 కోట్లుగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ నమోదైంది.

    ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 19 రోజుల్లో రూ. 2.15 కోట్లు కొల్లగొట్టగా.. మరో రూ. 1.35 కోట్లు వసూళ్లు రాబట్టగలిగితే ఇక్కడ కూడా క్లీన్ హిట్ స్టేటస్ సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ. 96.30 కోట్ల షేర్ సాధించగా.. మరో రూ. 4 కోట్లు వస్తే రూ. వంద కోట్లు కొల్లగొట్టినట్లు అవుతుంది.

    English summary
    Thala Ajith H Vinoth Hatrick Combination Movie Thunivu 12 Days Worldwide Box Office Collection Is Rs 186.77 Cr Gross And Thunivu Gets Rs. 11.30 Cr Profit.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X