twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Thunivu Collection: 100 కోట్ల షేర్ క్లబ్ లో అజిత్ 'తెగింపు'.. కానీ, అక్కడ మాత్రం ఫ్లాప్!

    |

    కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ సినిమాల్లో తన యాక్షన్ స్టంట్స్ తో అదరగొడుతుంటాడు. దాదాపుగా రియల్ యాక్షన్ సన్నివేశాలు చేస్తూ అభిమానులకు ఐ ట్రీట్ ఇస్తుంటాడు ఈ యాక్షన్ హీరో. అందుకే ఆయన్ను ముద్దుగా తలా అని పిలుచుకుంటారు అభిమానులు. ఇటీవల నేర్కొండ పార్వై (హిందీ పింక్ రీమేక్), వలిమై చిత్రాలతో అభిమానులను పలకరించిన అజిత్ లేటెస్ట్ గా తెగింపు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

    ఈ సినిమాకు గత రెండు చిత్రాలకు దర్శకత్వం వహించిన హెచ్ వినోద్ డైరెక్ట్ చేయడం విశేషం. కాగా సంక్రాంతి కానుకగా జనవరి 11న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన అజిత్ తునివు 26 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దామా!

    తెలుగులోనూ అభిమానులు..

    తెలుగులోనూ అభిమానులు..

    కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ అశేషమైన అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ క్రమంలో తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఆయనకు కొంతమేర ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే ఆయన సినిమాలు తెలుగులోనూ అప్పుడ్పుడు విడుదలై సందడి చేస్తుంటాయి.

    ఈ క్రమంలోనే అజిత్ నటించిన తాజా సినిమా తెగింపు. తమిళ చిత్రమైన తునివుని తెలుగులో డబ్బింగ్ చేసి తెగింపుగా తీసుకొచ్చారు. గత రెండు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన బోనీ కపూర్ ఈ సినిమాకు కూడా నిర్మాత బాధ్యతలు చేపట్టారు. అజిత్-వినోద్-బోనీ కపూర్ కాంబినేషన్ లో వరుసగా వచ్చిన మూడో చిత్రమే తెగింపు.

    ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు..

    ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు..

    తలా అజిత్ కు ఉన్న మార్కెట్ ను బట్టి తెగింపు సినిమాకు ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 3.20 కోట్లు, తమిళనాడులో రూ. 58 కోట్లు, కర్ణాటక రాష్ట్రంలో రూ. 3.60 కోట్లు, కేరళలో రూ. 2.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.70 కోట్లు, ఓవర్సీస్ రూ. 15 కోట్లు కాగా ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ. 84 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో తెగింపు చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను సాధించాలంటే రూ. 85 కోట్ల కలెక్షన్స్ రాబట్టాలి.

    26వ రోజు ఏపీ, తెలంగాణలో వసూళ్లు..

    26వ రోజు ఏపీ, తెలంగాణలో వసూళ్లు..

    అజిత్ తెగింపు సినిమాలో జిబ్రాన్ తన మ్యూజిక్ తో ఆకట్టుకున్నాడు. అజిత్ తెగింపు చిత్రం 26వ రోజు తెలుగు రాష్ట్రాల్లో నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్ర, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణా, నెల్లూరు ఇలా అన్ని ఏరియాల్లో కలిపి రూ. 1 లక్ష మాత్రమే వసూలు చేసినట్లు సమాచారం. ఇక 26 రోజుల్లో నైజాంలో రూ. 1.83 కోట్లు, సీడెడ్ రూ. 53 లక్షలు, ఆంధ్రప్రదేశ్ మొత్తం రూ. 1.84 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక మొత్తం 26 రోజుల్లో ఏపీ తెలంగాణలో తెగింపు సినిమా రూ. 4.52 కోట్లు గ్రాస్ గా, రూ. 2.16 కోట్లు షేర్ నమోదైంది.

    26 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా..

    26 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా..

    కోలీవుడ్ స్టార్ నటి మంజు వారియర్ యాక్షన్ సీక్వెన్స్ తో అలరించిన తెగింపు చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా టాక్ బాగానే ఉంటోంది. ఫలితంగా 26 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.52 కోట్లు, తమిళనాడులో రూ. 116.05 కోట్లు, కర్ణాటకలో రూ. 13.20 కోట్లు, కేరళ రాష్ట్రంలో రూ. 3.85 కోట్లు కలెక్ట్ చేయగా.. రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.95 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 53.15 కోట్లు కలెక్షన్స్ సాధించింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా రూ. 192.72 కోట్లు గ్రాస్, రూ. 99.35 కోట్ల షేర్ వసూళ్లు రాబట్టింది.

    లాభం ఎంతంటే..

    లాభం ఎంతంటే..

    అజిత్-హెచ్ వినోద్-బోనీ కపూర్ ముగ్గురి కాంబినేషన్ లో మూడో సినిమాగా వచ్చిన తెగింపు క్లీన్ హిట్ కొట్టేసింది. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 84 కోట్లు మేర బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 85 కోట్లుగా ఫిక్స్ అయింది. అజిత్ తునివు చిత్రం 26 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 99.35 కోట్లు వసూళు చేసింది. అంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి కాగా రూ. 14.35 కోట్లు లాభంతో సూపర్ హిట్ గా నిలిచింది అజిత్ తెగింపు చిత్రం.

    తెలుగు రాష్ట్రాల్లో ఫ్లాప్..

    తెలుగు రాష్ట్రాల్లో ఫ్లాప్..

    మాస్ యాక్షన్ స్టంట్స్, బైక్ చేజింగ్స్ తో ఆద్యంతం అలరించే కోలీవుడ్ స్టార్ హీరో తలా అజిత్ నటించిన లేటెస్ట్ మూవీ తెగింపుకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 3.20 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో రూ. 3.50 కోట్లుగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ నమోదైంది. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 26 రోజుల్లో రూ. 2.16 కోట్లు కొల్లగొట్టగా.. మరో రూ. 1.34 కోట్లు నష్టం వాటిళ్లినట్లు ట్రేడ్ వర్గాలు లెక్కలు చూపాయి. వరల్డ్ వైడ్ గా సూపర్ హిట్ టాక్ అయిన అజిత్ తెగింపు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఫ్లాప్ గా మిగిలింది.

    English summary
    Thala Ajith H Vinoth Hatrick Combination Movie Thunivu 12 Days Worldwide Box Office Collection Is Rs 192.72 Cr Gross With Rs. 14.35 Cr Profit And Thunivu Was Flop In Telugu States.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X