Valimai 2 Days Collections: వలిమైకు భీమ్లా నాయక్ దెబ్బ.. రెండో రోజు మరీ దారుణంగా!
విలక్షణమైన నటన.. విభిన్నమైన చిత్రాలతో దక్షిణాది మొత్తంలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్. పేరుకు తమిళ హీరోనే అయినా దక్షిణాది మొత్తంలో ప్రభావాన్ని చూపిస్తున్నాడు. అదే సమయంలోనే మార్కెట్‌ను, ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సైతం భారీ స్థాయిలో పెంచుకున్నాడు. ఇక, హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేసే అజిత్.. కొంత కాలంగా వరుస ఫ్లాఫులతో ఇబ్బంది పడ్డాడు. ఈ పరిస్థితుల్లో 'నెర్కొండ పార్వాయి'తో హిట్ కొట్టాడు. ఆ వెంటనే 'వలిమై' అనే సినిమాలో నటించాడు. గురువారమే ఈ మూవీ విడుదలైంది. మరి ఈ సినిమా రెండు రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

‘వలిమై' మూవీతో వచ్చిన అజిత్
అజిత్ కుమార్ - హెచ్ వినోథ్ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రమే ‘వలిమై'. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో తెలుగు హీరో కార్తికేయ విలన్‌గా నటించాడు. హూమా ఖురేషీ హీరోయిన్‌గా చేసింది. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ బోనీ కపూర్ దీన్ని నిర్మించాడు. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి పాటలు కంపోజ్ చేయగా.. జిబ్రాన్ బ్యాగ్రౌండ్ స్కోర్‌ను సమకూర్చాడు.

5భాషలు.. తెలుగులో బిజినెస్ ఇలా
కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ నటించిన ‘వలిమై' మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో ఐదు భాషల్లో విడుదలైంది. దీంతో ఈ సినిమా రైట్స్‌కు అన్ని చోట్లా భారీ స్థాయిలో పోటీ ఏర్పడింది. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో బిజినెస్ జరిగింది. ఇక, తెలుగు రాష్ట్రాల్లో ‘వలిమై' మూవీకి రూ. 2.65 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్
అజిత్ కుమార్‌కు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. దీనికితోడు ‘వలిమై' మూవీలో మన హీరో కార్తికేయ కూడా నటించాడు. దీంతో ఈ సినిమాను చాలా థియేటర్లలో విడుదల చేశారు. ఫలితంగా ఇక్కడ కలెక్షన్లు భారీగా వస్తాయని అంతా అనుకున్నారు. అందుకు అనుగుణంగానే ఈ సినిమా మొదటి రోజు రెండు రాష్ట్రాల్లో కలుపుకుని రూ. 85 లక్షల షేర్‌ను వసూలు చేసుకుంది.

2వ రోజు దారుణంగా మూవీ వసూళ్లు
మొదటి రోజున ‘వలిమై' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలెక్షన్లు చక్కగా వచ్చాయి. కానీ, రెండో రోజు మాత్రం ఒక్కసారిగా పడిపోయాయి. శుక్రవారం ‘భీమ్లా నాయక్' మూవీ విడుదల కావడంతో ఈ సినిమాకు థియేటర్లు తగ్గిపోయాయి. ఫలితంగా శుక్రవారం అజిత్ కుమార్ సినిమాకు రెండు రాష్ట్రాల్లో కలిపి కేవలం రూ. 24 లక్షలు షేర్ మాత్రమే వసూలు అయింది.

రెండు రోజల్లో ఎక్కడ? ఎంతంటే?
‘వలిమై' మూవీకి రెండు రోజులకు కలిపి మోస్తరు రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 34 లక్షలు, సీడెడ్‌లో రూ. 18 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 16 లక్షలు, ఈస్ట్‌లో రూ. 10 లక్షలు, వెస్ట్‌లో రూ. 8 లక్షలు, గుంటూరులో రూ. 9 లక్షలు, కృష్ణాలో రూ. 8 లక్షలు, నెల్లూరులో రూ. 6 లక్షలతో కలిపి.. తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.09 కోట్లు షేర్, రూ. 2.05 కోట్లు గ్రాస్ వచ్చింది.
Recommended Video

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?
విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ చేసుకున్న ‘వలిమై' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.65 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. దీంతో ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 2.70 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా రెండు రోజుల్లో రూ. 1.09 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అంటే మరో 1.61 కోట్లు కలెక్ట్ చేస్తేనే ఇది హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.


Click it and Unblock the Notifications











