Valimai 6 Days Collections: వలిమై‌కు తెలుగులో షాకింగ్ కలెక్షన్లు.. ఇంకా అన్ని లక్షలు వస్తేనే హిట్

విలక్షణమైన నటన.. విభిన్నమైన శైలి.. పక్కా కమర్షియల్ సినిమాలతో సుదీర్ఘ కాలంగా తమిళంలో స్టార్‌గా వెలుగొందుతున్నాడు థలా అజిత్ కుమార్. అక్కడ మాత్రమే కాదు.. డబ్బింగ్ చిత్రాల ద్వారా దక్షిణాది మొత్తం పాపులర్ అయ్యాడాయన. దీంతో సౌతిండియాలోనే సూపర్ స్టార్ అనిపించుకుంటున్నాడు. 'నెర్కొండ పార్వాయి'తో భారీ విజయాన్ని అందుకున్న అజిత్.. ఇటీవలే 'వలిమై' అనే పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయిన ఈ చిత్రం.. మిగిలిన భాషల్లో కష్టాలను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన ఈ చిత్రం తెలుగు వెర్షన్‌కు ఆరు రోజుల్లో ఎంత కలెక్షన్లు వచ్చాయన్న దానిపై ఓ లుక్కేద్దాం పదండి!

 వలిమై మూవీతో వచ్చిన అజిత్

వలిమై మూవీతో వచ్చిన అజిత్

థలా అజిత్ కుమార్ - హెచ్ వినోథ్ కాంబోలో వచ్చిన చిత్రమే 'వలిమై'. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో తెలుగు హీరో కార్తికేయ ప్రతినాయకుడిగా నటించాడు. హూమా ఖురేషీ హీరోయిన్‌గా చేసింది. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ బోనీ కపూర్ దీన్ని నిర్మించారు. ఇక, యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి పాటలు కంపోజ్ చేయగా.. జిబ్రాన్ బ్యాగ్రౌండ్ స్కోర్‌ను ఇచ్చాడు.

వలిమై తెలుగు బిజినెస్ డీటేల్స్

వలిమై తెలుగు బిజినెస్ డీటేల్స్

స్టార్ హీరో అజిత్ కుమార్‌ నటించిన 'వలిమై' మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో ఐదు భాషల్లో విడుదలైంది. దీంతో ఈ సినిమా రైట్స్‌కు అన్ని చోట్లా భారీ స్థాయిలో పోటీ ఏర్పడింది. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో బిజినెస్ జరిగింది. ఇక, తెలుగు రాష్ట్రాల్లో 'వలిమై' మూవీకి రూ. 2.65 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

టాక్‌కు సంబంధం లేని వసూళ్లు

టాక్‌కు సంబంధం లేని వసూళ్లు

తమిళ హీరోనే అయినా అజిత్ కుమార్‌కు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్‌ ఉంది. దీనికితోడు 'వలిమై' మూవీలో కార్తికేయ కూడా నటించాడు. ఇక, ఆరంభంలోనే ఈ మూవీకి మంచి టాక్ వచ్చింది. దీంతో ఈ సినిమాను చాలా థియేటర్లలో విడుదల చేశారు. ఫలితంగా ఇక్కడ కలెక్షన్లు భారీగా వస్తాయని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా వసూళ్లు అంతగా రావట్లేదు.

6వ రోజు కొంత పెరిగిన కలెక్షన్లు

6వ రోజు కొంత పెరిగిన కలెక్షన్లు


'వలిమై' మూవీకి తొలిరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలెక్షన్లు మంచిగా వచ్చాయి. కానీ, రెండు, మూడు రోజులు మాత్రం వసూళ్లు పడిపోయాయి. దీనికి కారణం 'భీమ్లా నాయక్' మూవీ విడుదల కావడంతో ఈ సినిమాకు థియేటర్లు తగ్గిపోవడమే. ఆ తర్వాత ఆదివారం పెరిగి.. సోమవారం తగ్గాయి. అయితే, మంగళవారం పండుగ కారణంగా కలెక్షన్లు మంచిగానే వచ్చాయి.

6 రోజల్లో ఎంత వసూలు చేసింది

6 రోజల్లో ఎంత వసూలు చేసింది

ఆరు రోజులకు కలిపి 'వలిమై' మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 51 లక్షలు, సీడెడ్‌లో రూ. 28 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 29 లక్షలు, ఈస్ట్‌లో రూ. 21 లక్షలు, వెస్ట్‌లో రూ. 16 లక్షలు, గుంటూరులో రూ. 20 లక్షలు, కృష్ణాలో రూ. 18 లక్షలు, నెల్లూరులో రూ. 14 లక్షలతో కలిపి.. తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.97 కోట్లు షేర్, రూ. 3.75 కోట్లు గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?


తెలుగులోనూ భారీ అంచనాలు ఏర్పరచుకున్న 'వలిమై' మూవీకి రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 2.65 కోట్ల మేర బిజినెస్ జరిగింది. దీంతో ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 2.70 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా ఆరు రోజుల్లో రూ. 1.97 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అంటే మరో రూ. 72 లక్షలు రాబడితేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X