Valimai Total Collections: వలిమైకు తెలుగులో బిగ్ షాక్.. ఎంత నష్టం వచ్చిందో తెలిస్తే!
ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు మూడు దశాబ్దాలుగా తమిళ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని స్టార్‌గా వెలుగొందుతోన్నాడు థలా అజిత్ కుమార్. కెరీర్ ఆరంభంలోనే విలక్షణమైన నటన.. విభిన్నమైన శైలి.. పక్కా కమర్షియల్ సినిమాలతో స్టార్‌డమ్‌ను అందుకున్నాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే అజిత్ 'వలిమై' అనే పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయిన ఈ చిత్రం.. తెలుగు వెర్షన్‌కు మాత్రం పెద్దగా కలెక్షన్లు రాలేదు. ఈ నేపథ్యంలో 'వలిమై' తెలుగులో ఎంత కలెక్షన్లు వచ్చాయో చూద్దాం పదండి!

వలిమై మూవీతో వచ్చిన అజిత్
అజిత్ కుమార్ హీరోగా హెచ్ వినోథ్ రూపొందించిన చిత్రమే 'వలిమై'. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో తెలుగు హీరో కార్తికేయ ప్రతినాయకుడిగా నటించాడు. హూమా ఖురేషీ హీరోయిన్‌గా చేసింది. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ బోనీ కపూర్ దీన్ని నిర్మించారు. ఇక, యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి పాటలు కంపోజ్ చేయగా.. జిబ్రాన్ బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అందించాడు.

వలిమై తెలుగు బిజినెస్ డీటేల్స్
అజిత్ కుమార్ హీరోగా నటించిన 'వలిమై' మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో ఐదు భాషల్లో విడుదలైంది. దీంతో ఈ సినిమా రైట్స్‌కు అన్ని చోట్లా భారీ స్థాయిలో పోటీ ఏర్పడింది. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో బిజినెస్ జరిగింది. ఇక, తెలుగు రాష్ట్రాల్లో 'వలిమై' మూవీకి రూ. 2.65 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

టాక్‌కు సంబంధం లేని వసూళ్లు
పేరుకు తమిళ హీరోనే అయినా అజిత్‌కు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. దీనికితోడు 'వలిమై' మూవీలో కార్తికేయ కూడా నటించాడు. ఇక, ఆరంభంలోనే ఈ మూవీకి మంచి టాక్ వచ్చింది. దీంతో ఈ సినిమాను చాలా థియేటర్లలో విడుదల చేశారు. ఫలితంగా ఇక్కడ కలెక్షన్లు భారీగా వస్తాయని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా వసూళ్లు అంతగా రాలేదు.

మొత్తం ఎంత వసూలు చేసింది
ఫుల్ రన్ పూర్తయ్యే సరికి 'వలిమై' మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 69 లక్షలు, సీడెడ్‌లో రూ. 35 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 38 లక్షలు, ఈస్ట్‌లో రూ. 25 లక్షలు, వెస్ట్‌లో రూ. 20 లక్షలు, గుంటూరులో రూ. 23 లక్షలు, కృష్ణాలో రూ. 21 లక్షలు, నెల్లూరులో రూ. 18 లక్షలతో కలిపి.. తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.49 కోట్లు షేర్, రూ. 4.86 కోట్లు గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. నష్టమెంత
విడుదలకు ముందు భారీ అంచనాలు ఏర్పరచుకున్న అజిత్ కుమార్ 'వలిమై' మూవీకి రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 2.65 కోట్ల మేర బిజినెస్ జరిగింది. దీంతో ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 2.70 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా ముగింపు సమయానికి రూ. 2.49 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అంటే రూ. 21 లక్షలు నష్టాలతో రన్‌ను ముగించుకుంది.

దెబ్బ కొట్టిన పవన్ కొత్త సినిమా
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన 'వలిమై' మూవీకి తెలుగులో రెస్పాన్స్ బాగానే వచ్చింది. అయితే, పవన్ కల్యాణ్ నటించిన 'భీమ్లా నాయక్' విడుదల అవడం వల్ల థియేటర్ల సంఖ్యను తగ్గించారు. అది సినిమా కలెక్షన్ల మీద తీవ్ర స్థాయిలో ప్రభావాన్ని చూపించింది. లేకుంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ను చేరుకునేదే అని ట్రేడ్ పండితులు వెల్లడిస్తున్నారు.


Click it and Unblock the Notifications











