Thunivu 3 Weeks Collections: అజిత్ మూవీకి భారీ వసూళ్లు.. అప్పుడే అన్ని కోట్లు లాభం.. తెలుగులో నష్టమే

కోలీవుడ్‌ నుంచి పరిచయం అయినా.. దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ ప్రభావాన్ని చూపిస్తూ స్టార్ హీరోగా సత్తా చాటుతోన్నాడు థలా అజిత్ కుమార్. కెరీర్ ఆరంభంలోనే విలక్షణమైన నటన.. విభిన్నమైన శైలితో.. పక్కా కమర్షియల్ సినిమాలు చేసి స్టార్‌డమ్‌ను అందుకున్నాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే అజిత్ ఇప్పుడు 'తెగింపు' (తమిళంలో తునివు) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి కలెక్షన్లు భారీగానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'తునివు' మూడు వారాల్లో ఎంత రాబట్టిందో మీరే చూడండి!

తునివు అంటూ వచ్చిన అజిత్

తునివు అంటూ వచ్చిన అజిత్

కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ హీరోగా హెచ్ వినోథ్ రూపొందించిన చిత్రమే 'తునివు'. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో మంజూ వారియర్‌ హీరోయిన్‌గా చేసింది. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ బోనీ కపూర్ దీన్ని నిర్మించారు. ఇక, ఈ చిత్రానికి జిబ్రాన్ మ్యూజిక్ అందించాడు. ఇందులో సముద్రఖని, వీరా, భగవతి పెరుమాల్, అజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

తునివు ప్రీ రిలీజ్ బిజినెస్ ఇలా

తునివు ప్రీ రిలీజ్ బిజినెస్ ఇలా

భారీ బడ్జెట్‌తో మాస్ యాక్షన్ మూవీగా వచ్చిన 'తునివు' మూవీకి తమిళనాడులో రూ. 58 కోట్లు, కర్నాటకలో రూ. 3.60 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 3.20 కోట్లు, కేరళలో రూ. 2.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.70 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 15 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ యాక్షన్ మూవీకి రూ. 84 కోట్ల మేర ప్రీ బిజినెస్ జరిగింది.

3 వారాలకు కలిపి ఎంతొచ్చింది

3 వారాలకు కలిపి ఎంతొచ్చింది


'తెగింపు' పేరుతో తెలుగులో విడుదలైన అజిత్ కుమార్ సినిమాకు ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దీంత తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు ఆశించిన స్థాయిలో రాలేదు. అదే కంటిన్యూ అవుతూ మూడు వారాల్లో ఈ చిత్రానికి నైజాంలో రూ. 1.83 కోట్లు, సీడెడ్‌లో రూ. 53 లక్షలు, ఆంధ్రాలో రూ. 1.84 కోట్లతో కలిపి మొత్తంగా రూ. 4.52 కోట్లు గ్రాస్, రూ. 2.16 కోట్లు షేర్ వచ్చింది.

మిగిలిన భాషల్లో వచ్చింది ఎంత

మిగిలిన భాషల్లో వచ్చింది ఎంత

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 3 వారాల్లో 'తునివు' అంతగా రాణించలేదు. కానీ, తమిళనాడులో రూ. 112.05 కోట్లు, కర్నాటకలో రూ. 13.15 కోట్లు, కేరళలో రూ. 3.83 కోట్లు, హిందీలో ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.95 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 52.80 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 21 రోజుల్లోనే ఈ సినిమాకు రూ. 183.30 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 97.10 కోట్లు షేర్ వసూలు చేసింది.

టార్గెట్ ఎంత.. లాభాలు ఎంత?

టార్గెట్ ఎంత.. లాభాలు ఎంత?

'తునివు' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 84 కోట్లు (టార్గెట్ రూ. 85 కోట్లు) మేర బిజినెస్ జరిగింది. అలాగే, తెలుగులో ఇది రూ. 3.20 కోట్లు (టార్గెట్ రూ. 3.50 కోట్లు) బిజినెస్ చేసుకుంది. ఇది 21 రోజుల్లోనే ఓవరాల్‌గా రూ. 97.10 కోట్లతో.. రూ. 12.10 కోట్ల లాభాలు అందుకుంది. అయితే, తెలుగులో మాత్రం రూ. 1.34 కోట్లు వెనుకబడి ఉండిపోయింది.

నష్టాలతోనే ముగించే దిశగా

నష్టాలతోనే ముగించే దిశగా

కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్‌కు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే అతడి ప్రతి సినిమా గ్రాండ్‌గా విడుదల అవుతుంటాయి. అయితే, సంక్రాంతి బరిలో నిలిచిన 'తునివు' మాత్రం పలు కారణాల వల్ల ఇక్కడ ఆశించిన రీతిలో ఆడలేకపోయింది. దీంతో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో నష్టాలతోనే రన్‌ను ముగించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పుకోవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X