twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Thunivu Day 1 Collections: మొదటిరోజు అజిత్ బీభత్సం.. తెలుగులో షాకింగ్ కలెక్షన్స్!

    |

    కోలీవుడ్ ఇండస్ట్రీలో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్న వారిలో అజిత్ ఒకరు. ఈ మాస్ హీరో గత కొంతకాలంగా తమిళనాడు ఇండస్ట్రీలో ఎలాంటి సినిమా చేస్తున్న కూడా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ అయితే సొంతం చేసుకుంటున్నాడు. ఇక అజిత్ నటించిన భారీ యాక్షన్ మూవీ తునివు బుధవారం రోజు గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మొత్తంగా ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది అని వివరాల్లోకి వెళితే..

    విడుదలకు ముందే..

    విడుదలకు ముందే..

    హెచ్ వినోద్ దర్శకత్వంలో బోనీకపూర్ నిర్మించిన ఈ సినిమాలో అజిత్ న్యూ లుక్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమాకు కొంత నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద సాలిడ్ ఓపెనింగ్స్ అయితే అందుకున్నట్లుగా తెలుస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఈ సినిమా విజయ్ వారిసు సినిమాకు పోటీగా నిలిచింది. అలాగే అంతకు ముందే విడుదలైన ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

    బిజినెస్ ఎంతంటే?

    బిజినెస్ ఎంతంటే?

    ఇక అజిత్ తునివు సినిమా తమిళంలోనే కాకుండా తెలుగులో తెగింపు టైటిల్ తో విడుదలైన విషయం తెలిసిందే. సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎ రేంజ్ లో బిజినెస్ చేసింది అనే వివరాల్లోకి వెళితే.. తమిళనాడులో 58 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 3.20 కోట్లు కర్ణాటకలో 3.60 కోట్లు కేరళలో 2.50 కోట్లు వరకు బిజినెస్ చేసిన తునివు సినిమా రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.50 కోట్లు, ఓవర్సీస్ లో 15 కోట్లు ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 84 కోట్ల వరకు బిజినెస్ చేసింది.

    తెలుగు కలెక్షన్స్

    తెలుగు కలెక్షన్స్

    ఇక తునివు సినిమా మొదటి రోజు ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది అనే వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కలెక్షన్స్ అయితే సొంతం చేసుకుంది. ఒక విధంగా అజిత్ కు తెలుగులో మార్కెట్ లేకపోయినప్పటికీ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా 2.18 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ 1.14 కోట్ల షేర్ కలెక్షన్స్ సొంతం చేసుకోవడం విశేషం.

    తెలుగులో ఎంత రావాలంటే..

    తెలుగులో ఎంత రావాలంటే..

    తెలుగులో అయితే తొలి రోజు ఈ సినిమా అజిత్ రేంజ్ కు తగ్గట్టుగానే 3. 20 కోట్ల వరకు బిజినెస్ చేసింది. ఒక విధంగా ఆంధ్రప్రదేశ్ నైజాం లో అజిత్ కు ఇదే హైయెస్ట్ టార్గెట్ అని కూడా చెప్పవచ్చు. ఇక తెలుగులో 3.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో విడుదలైన ఈ సినిమా తెలుగు బాక్స్ ఆఫీస్ వద్దా 1.14 కోట్ల షేర్ అందుకుంది. ఇక ఈ సినిమా తెలుగులో ప్రాఫిట్ జోన్ లోకి రావాలి అంటే ఇంకా 2. 35 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకోవాలి.

     వరల్డ్ వైడ్ కలెక్షన్స్

    వరల్డ్ వైడ్ కలెక్షన్స్

    ఇక ప్రపంచవ్యాప్తంగా తునివు సినిమా ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది వివరాల్లోకి వెళితే తమిళనాడులో మరోసారి అజిత్ స్టామినా ఏమిటో నిరూపించాడు. అక్కడ 22.25 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.18 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాగా కర్ణాటకలో 4.55 కోట్లు కేరళలో 1.42 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 39.8 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. షేర్ కలెక్షన్స్ 20.10 కోట్లు వచ్చాయి.

     ప్రాఫిట్ లోకి రావాలంటే..

    ప్రాఫిట్ లోకి రావాలంటే..

    ఇక ప్రపంచవ్యాప్తంగా తునివు సినిమా 24 కోట్ల వరకు బిజినెస్ చేసింది. అంటే 85 కోట్ల టార్గెట్ అందుకుంటే తునివు సినిమా సక్సెస్ అయినట్లు లెక్క. ప్రపంచవ్యాప్తంగా రెండు భాషల్లో ఈ సినిమా ఇప్పటివరకు 20.10 షేర్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. అంటే సినిమా ప్రాఫిట్ జోన్ లోకి రావాలి అంటే మొత్తంగా ఇంకా 64.90 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ సాధించాలి.

    English summary
    Ajith kumar thunivu first day world wide box office collections
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X