Don't Miss!
- Lifestyle
డ్రై స్కిన్ మరియు స్కిన్ ఇచ్చింగ్ నివారణకు ఆయుర్వేదంలో సులభ చిట్కాలు
- Sports
SA20 League: శతక్కొట్టిన ఆర్సీబీ కెప్టెన్.. తొలి ప్లేయర్గా రికార్డు!
- News
ఆ నియోజకవర్గాల్లో వైసీపీదే హవా, కానీ - తాజా సర్వేలో కీలక అలర్ట్స్..!?
- Finance
Gautam Adani: ఆ వ్యసనానికి బానిసైన గౌతమ్ అదానీ..! ఒప్పుకున్న బిలియనీర్..
- Automobiles
అమ్మకాల్లో కొత్త మైలురాయి చేరుకున్న TVS iQube: ఈ ఏడాది మరింత పెరిగే అవకాశం..
- Technology
ఇండియా సొంత మొబైల్ OS, BharOS ను మీ ఫోన్లో అప్డేట్ చేయవచ్చా? తెలుసుకోండి.
- Travel
రథసప్తమికి ముస్తాబవుతోన్న అరసవల్లి సూర్యదేవాలయం!
Thunivu 1st Day Collections: వారిసుకు పోటీగా అజిత్ సినిమాకు సాలీడ్ కలెక్షన్స్.. ఎంత రావచ్చంటే?
తమిళ ఇండస్ట్రీలో మంచి మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో అజిత్ కుమార్ ఒకరు. ఇక వినోద్ దర్శకత్వంలో అజిత్ చేసిన మరొక సినిమా తనివు(తెగింపు) జనవరి 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలయింది. ఇక ఈ సినిమాకు ఓపెనింగ్స్ భారీ స్థాయిలో వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక మొత్తంగా ఈ సినిమా మొదటి రోజు ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుంది అలాగే థియేట్రికల్ ఆక్యుపెన్సీ ఎంత వరకు నమోదైంది అనే వివరాల్లోకి వెళితే..

సాలీడ్ అడ్వాన్స్ బుకింగ్స్
బోనికపూర్ నిర్మించిన ఈ సినిమాలో అజిత్ కుమార్ సరికొత్త లుక్కుతో కనిపించడం ప్రేక్షకుల్లో మరింత పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. విడుదలైన ట్రైలర్ తోనే ఈ సినిమా ఊహించని స్థాయిలో అంచనాలను క్రియేట్ చేసుకుంది.
దీంతో సినిమా మొదటిరోజు ఊహించిన స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుంది అని అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే అర్థమైంది.ఇక చాలా ఏరియాలో వారిసు సినిమా పోటీగా ఉన్నప్పటికీ కూడా ఈ సినిమా మంచి అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు చేసుకుంది.

గుడ్ ఆక్యుపెన్సి
ఇక చాలా ఏరియాలో ఈ సినిమా మంచి ఆక్యుపెన్సి ని నమోదు చేసుకుంది. విడుదలకు ముందే మంచి అంచనాలు క్రియేట్ కావడంతో అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా నమోదయ్యాయి. ముఖ్యంగా తమిళనాడులో అయితే మొదటి రోజు విజయ్ సినిమాతో పోటీపడుతూ ఈ సినిమా కూడా 99 శాతం వరకు ఆక్యుపెన్సే నమోదు చేసుకోవడం విశేషం.
అలాగే కొచ్చి పాండిచ్చేరి బెంగుళూరు ఇలా ప్రధాన ఏరియాల్లో కూడా ఈ సినిమా మంచి ఆక్యుపెన్సిని నమోదు చేసుకుంది.

తెలుగులో కూడా..
అజిత్ సినిమా మొదటిసారి తెలుగులో కూడా భారీ స్థాయిలోనే విడుదలైంది. తెగింపు అనే టైటిల్ తో ఈ సినిమాను విడుదల చేశారు. ఇక మొదటి రోజే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి టాక్ తో మధ్యాహ్నం వరకు థియేటర్ ఆక్యుపెన్సిని బాగానే పెంచుకుంది. ముఖ్యంగా హైదరాబాదులో అలాగే వైజాగ్ ఇలా మరికొన్ని ప్రధాన ఏరియాలలో సినిమా 40% నుంచి 50% వరకు ఆక్యుపెన్సిని నమోదు చేసుకుని డీసెంట్ ఓపెనింగ్స్ అయితే అందుకుంటోంది.

ఇండియాలో మొదటిరోజు కలెక్షన్స్
అజిత్ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలోనే విడుదలైంది. బిగ్ యాక్షన్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్ కూడా అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. ఇక తమిళనాడులో కూడా ఈ సినిమాకు మంచి ఓపెనింగ్ వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా ఈ సినిమా ఇండియాలో మొదటి రోజు 20 నుంచి 25 కోట్ల మధ్యలో కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

వరల్డ్ వైడ్ గా ఎంత రావచ్చంటే?
ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే కూడా తెగింపు సినిమా భారీగానే వసూళ్ళను అందుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. వారిసుతో పోటీ ఉన్నప్పటికీ కూడా ఈ సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. దాంతో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే రికార్డులు నమోదయ్యాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే ఈ సినిమా మొదటి రోజు 25 కోట్ల నుంచి 30 కోట్ల మధ్యలో కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉన్నట్లుగా మరొక కొత్త టాక్ వినిపిస్తోంది. మరి ఈ నెంబర్స్ ఎంతవరకు నిజమవుతాయో చూడాలి.