Valimai 4 Days Collections: టాక్ ఒకలా కలెక్షన్లు మరోలా.. 4 రోజుల్లో దారుణంగా.. ఇంకెంత రావాలంటే!
దక్షిణాది మొత్తంలో ప్రభావం చూపిస్తోన్న హీరోలు చాలా తక్కువ మందే ఉన్నారు. అందులో విలక్షణ నటనతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న అజిత్ కుమార్ ఒకరు. సుదీర్ఘ కాలంగా విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోన్న ఆయన.. సౌతిండియన్ సూపర్ స్టార్‌గా వెలుగొందుతున్నారు. అయితే, కొంత కాలం పాటు వరుసగా పరాజయాలతో సతమతం అయ్యాడు.
ఇలాంటి పరిస్థితుల్లో అజిత్ 'నెర్కొండ పార్వాయి' హిట్ ట్రాక్ ఎక్కాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు 'వలిమై' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పాన్ ఇండియా రేంజ్‌లో వచ్చిన ఈ మూవీ.. తెలుగు వెర్షన్‌కు నాలుగు రోజుల్లో ఎంత కలెక్షన్లు వచ్చాయో ఓ లుక్కేద్దాం పదండి!

‘వలిమై' అంటూ వచ్చిన అజిత్
అజిత్ కుమార్ హీరోగా హెచ్ వినోథ్ తెరకెక్కించిన చిత్రమే 'వలిమై'. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో తెలుగు హీరో కార్తికేయ ప్రతినాయకుడిగా నటించాడు. హూమా ఖురేషీ హీరోయిన్‌గా చేసింది. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ బోనీ కపూర్ దీన్ని నిర్మించారు. ఇక, యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి పాటలు కంపోజ్ చేయగా.. జిబ్రాన్ బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అందించాడు.

వలిమై తెలుగు బిజినెస్ వివరాలు
సౌతిండియా స్టార్ అజిత్ కుమార్ నటించిన 'వలిమై' మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో ఐదు భాషల్లో విడుదలైంది. దీంతో ఈ సినిమా రైట్స్‌కు అన్ని చోట్లా భారీ స్థాయిలో పోటీ ఏర్పడింది. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో బిజినెస్ జరిగింది. ఇక, తెలుగు రాష్ట్రాల్లో 'వలిమై' మూవీకి రూ. 2.65 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

టాక్ ఒకలాగ... కలెక్షన్లు మరోలాగ
తెలుగులోనూ అజిత్ కుమార్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. దీనికితోడు 'వలిమై' మూవీలో మన హీరో కార్తికేయ కూడా నటించాడు. ఇక, ఆరంభంలోనే ఈ మూవీకి మంచి టాక్ వచ్చింది. దీంతో ఈ సినిమాను చాలా థియేటర్లలో విడుదల చేశారు. ఫలితంగా ఇక్కడ కలెక్షన్లు భారీగా వస్తాయని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఈ మూవీకి వసూళ్లు తక్కువగా వస్తున్నాయి.

4వ రోజు కొంత పెరిగిన కలెక్షన్లు
తొలిరోజు 'వలిమై' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలెక్షన్లు చక్కగా వచ్చాయి. కానీ, రెండు, మూడు రోజులు మాత్రం వసూళ్లు పడిపోయాయి. దీనికి కారణం 'భీమ్లా నాయక్' మూవీ విడుదల కావడంతో ఈ సినిమాకు థియేటర్లు తగ్గిపోవడమే. ఆదివారం మాత్రం అజిత్ కుమార్ సినిమాకు రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 30 లక్షలు పైగానే షేర్ వసూలు అయిందని తెలిసింది.

4 రోజల్లో ఎంత వసూలు చేసింది
నాలుగు రోజులకు కలిపి 'వలిమై' మూవీకి మోస్తరు రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 43 లక్షలు, సీడెడ్‌లో రూ. 22 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 24 లక్షలు, ఈస్ట్‌లో రూ. 17 లక్షలు, వెస్ట్‌లో రూ. 13 లక్షలు, గుంటూరులో రూ. 16 లక్షలు, కృష్ణాలో రూ. 14 లక్షలు, నెల్లూరులో రూ. 11 లక్షలతో కలిపి.. తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.60 కోట్లు షేర్, రూ. 3 కోట్లు గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?
తెలుగులో కూడా భారీ హైప్ క్రియేట్ చేసుకున్న 'వలిమై' మూవీకి రెండు రాష్ట్రాల్లో రూ. 2.65 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. దీంతో ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 2.70 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా నాలుగు రోజుల్లో రూ. 1.60 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అంటే మరో రూ. 1.10 కోట్లు కలెక్ట్ చేస్తేనే ఇది హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.


Click it and Unblock the Notifications











