అజిత్ ‘ఎంతవాడు గాని’రిలీజ్ డేట్
హైదరాబాద్ : అజిత్, అనుష్క, త్రిష ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘ఎంతవాడు గాని'. రీసెంట్గా తమిళంలో విడుదలైన ఈ చిత్రం(ఎన్నై ఆరిందాల్) మంచి విజయాన్ని నమోదు చేసింది. తెలుగు ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 27న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అజిత్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ చిత్రానికి గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వం వహించారు. హారిస్ జయరాజ్ సంగీత దర్శకుడు. వెంకటేష్ ‘ఘర్షణ', కమల్ హాసన్ ‘రాఘవన్' చిత్రాల తర్వాత గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన మరో పోలీస్ ఆఫీసర్ స్టొరీ ఇది. అజిత్, అనుష్క, త్రిషల నటనకు విమర్శకుల నుండి ప్రశంసలు లభించాయి.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ప్రముఖ నిర్మాత ఏ.ఎం రత్నం పర్యవేక్షణలో శ్రీ సాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మించిన ఈ చిత్రంలో అనుష్క, త్రిష హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఎడిటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.
అలాగే ఈ చిత్రానికి ముగ్గురు దర్శకత్వం వహించినట్లు తెలిసింది. ఈ చిత్ర ప్రధాన దర్శకుడు గౌతం మీనన్. గౌతం మీనన్ మాట్లాడుతూ '' ఈ చిత్రం అజిత్ కోసమే సిద్ధం చేశా. చిత్రీకరణ తదితర పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని భావిస్తున్నాం. ఈ కారణంగా నాతోపాటు దర్శకులు శ్రీధర్ రాఘవన్, త్యాగరాజ కుమారరాజ పనిచేస్తున్నారు. వారిని సాయం కోరగానే దర్శకత్వ బాధ్యతలు చేపట్టార''ని తెలిపారు.

అజిత్ మాట్లాడుతూ.. '' ఇది ఎప్పటిలాగానే నాకోసం తయారైన చిత్రంలా ఉండకూడదు. ప్రత్యేకించి గౌతమ్ మీనన్ తరహాలో రూపొందించిన సినిమాలా కనిపించాలన్నదే నా అభిమతము''అని వివరించారు.
దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ మాట్లాడుతూ - ‘‘ ఇందులో మూడు షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో అజిత్ నటిస్తున్నారు. అనుష్క ఫారిన్ నుంచి వచ్చిన మోడ్రన్ గర్ల్‌గా నటిస్తుండగా, త్రిష సంప్రదాయ కుంటుంబం నుంచి వచ్చిన క్లాసికల్ డాన్సర్‌గా చేసారు. ఇంతకుముందు తమిళ్‌లో హీరోగా చాలా సినిమాల్లో నటించిన అరుణ్ విజయ్ ఈ చిత్రంలో అజిత్‌కి ఈక్వెల్‌గా వుండే నెగెటివ్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఆయన సరసన పార్వతి నాయర్ నటిస్తున్నారు. ఆశిష్ విద్యార్థి, సుమన్ కీలక పాత్రలు చేస్తున్నారు. హారీస్ జైరాజ్ ఈ చిత్రానికి ఎక్స్‌లెంట్ మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో ఏడు పాటలు వుంటాయి. అజిత్ కాంబినేషన్‌లో నేను చేస్తున్న ఈ సినిమా మరో సెన్సేషనల్ కమర్షియల్ ఫిలిమ్ అయ్యింది.''
నిర్మాత ఎస్.ఐశ్వర్య మాట్లాడుతూ- ‘‘ ఎనిమిది నెలలుగా ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. చెన్నై, రాజమండ్రి, మలేషియా వంటి డిఫరెంట్ ప్లేసెస్‌లో షూటింగ్ చేశాము. అలాగే జోధ్‌పూర్, జైపూర్, పెల్లింగ్, గ్యాంగ్‌టక్ వంటి ప్రదేశాల్లో అజిత్‌పై చిత్రీకరించిన పాట సినిమాకే హైలెట్‌గా నిలుస్తుంది.
ఎన్.టి .రామారావు గారి సూపర్‌హిట్ సాంగ్ అయిన ‘ఎంతవాడు గానీ, వేదాంతులైన గానీ' అనే పాటలోని పల్లవిని తీసుకొని ఎంతవాడు గానీ అనే టైటిల్‌ని ఈ చిత్రానికి పెట్టడం జరిగింది. ఈ చిత్రాన్ని జనవరిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం.'' అన్నారు.


Click it and Unblock the Notifications











