అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ రెమ్యునరేషన్.. రికార్డు బ్రేకింగ్.. ఎన్ని కోట్లంటే?
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ తాజాగా గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రానికి అదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ అజిత్ సరసన నటించి మెప్పించింది. చాలా కాలం తర్వాత మళ్లీ ఈ జంట కలిసి వెండితెరపై కనిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా ఈ చిత్రానికి మొదటి రోజు థియేట్రికల్ రిలీజ్ లో మంచి రెస్పాన్స్ దక్కింది. దాంతో ఓపెనింగ్ కలెక్షన్లు కూడా అదిరిపోయాయి.
ఇక అజిత్ చివరిగా 'విడాముయార్చి' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని 175 కోట్లకు పైగా బడ్జెట్ నిర్మించినా బాక్సాఫీస్ వద్ద మాత్రం పెద్దగా పెర్ఫామ్ చేయలేకపోయింది. కేవలం రూ.138 కోట్ల గ్రాస్ ను మాత్రమే తిరిగి ఇచ్చింది. దీంతో అజిత్ కుమార్ చివరి సినిమాతో పెద్ద దెబ్బ పడింది. కానీ అజిత్ తన కెరీర్ లో చేసిన ఉత్తమ చిత్రాలతో ఆయనకు సినిమా మార్కెట్లో పెద్దగా నష్టం జరగదని పండితులు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పుడు అదే విషయం నిజమైంది. అజిత్ కుమార్, త్రిష కృష్ణన్ జంటగా వచ్చిన చిత్రం 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో సినిమాకు సంబంధించిన విషయాలను ప్రేక్షకులకు ఆసక్తిని కలిగిస్తున్నాయి. అయితే ఈ సినిమాకు అజిత్ కుమార్ ఏకంగా రూ.175 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. దీంతో సౌత్ లో ఇప్పటికే హ్యాయేస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న జాబితాలో మొదటి వ్యక్తిగా రికార్డు క్రియేట్ చేశారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ 'జైలర్'తో మొత్తంగా రూ.210 కోట్లు అందుకొని టాప్ లో నిలిచారు. కానీ మొదట ఈ సినిమాకు తలైవా రూ.110 కోట్ల రెమ్యునరేషనే అందుకున్నారు. ఆ తర్వాత సినిమాకు వచ్చిన లాభాల ద్వారా మరో రూ.100 కోట్లు నిర్మాత ఇచ్చారు. ఇలా 210 కోట్ల రెమ్యునరేషణ్ ను పొందిన ఇండియన్ హ్యేయెస్ట్ పెయిడ్ యాక్టర్ గా రికార్డు క్రియేట్ చేశారు. ఇప్పుడు ఆ జాబితాలో అజిత్ కుమార్ చేరిపోయారు.
ఇక గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రానికి అజిత్ తీసుకున్న రెమ్యునరేషన్ ఫిల్మ్ సర్కిల్స్ లో షాకింగ్ న్యూస్ గా మారింది. అయితే ఆ సినిమా బడ్జెట్ రూ.300 కోట్లు కావడం విశేషం. అందులో 60 పర్సెంటేజ్ అజిత్ కుమారే తీసుకున్నారని అంటున్నారు. అయితే దీనిపై స్పష్టమైన ప్రకటన అంటూ ఏదీ లేదు. కానీ సినీ పలువురు మాత్రం ఇంతలా రెమ్యునరేషన్ తీసుకున్నారని అభిప్రాయపడుతున్నారు. అజిత్ కు ఉన్న మార్కెట్ కు ఆ రెమ్యునరేషన్ తీసుకోవడం తప్పేమీ లేదని అతని ఫ్యాన్స్ కూడా అభిప్రాయపడుతున్నారు.
అజిత్ కుమార్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం మొదటి రోజున రూ.70 కోట్ల వరకు గ్రాస్ ను వసూల్ చేసింది. ఇండియా నెట్ రూ.28 కోట్ల వరకు అందుకున్నట్టు సాక్ నిల్క్ తెలిపింది. ఈ చిత్రం 115 కోట్ల షేర్.. 230 కోట్ల గ్రాస్ వసూల్ చేస్తే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేసుకొనుంది. ఇక ఈ చిత్రాన్ని టాలీవుడ్ నిర్మాతలు నవీన్ ఏర్నేని, రవి శంకర్ నిర్మించారు. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











