Valimai Pre Release Bussiness: అజిత్ సినిమాపై పెట్టింది ఎంత రావాల్సింది ఎంతంటే..?

చాలా కాలం తర్వాత సౌత్ సినిమా ఇండస్ట్రీలో మళ్లీ సినిమాల సందడి మొదలైంది. ముఖ్యంగా తమిళ చిత్రపరిశ్రమలో మాస్ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న వలిమై సినిమా కూడా భారీ స్థాయిలో నేడు విడుదల అయ్యింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అజిత్ కెరీర్ లోనే అత్యధిక థియేటర్స్ లో విడుదల కానుంది. ఇక తెలుగులో కూడా మొదటిసారి అజిత్ సినిమా భారీ స్థాయిలో విడుదల అవుతుండటం విశేషం ఇక మొత్తంగా ఈ సినిమా తమిళనాడులో అలాగే తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా ఏ స్థాయిలో బిజినెస్ చేసింది. అలాగే ఎంత రాబడితే హిట్ అయినట్లు లెక్క అనే వివరాల్లోకి వెళితే..

 తెలుగు మార్కెట్ పై ఫోకస్

తెలుగు మార్కెట్ పై ఫోకస్

తమిళ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోల సినిమాలు ఎక్కువగానే ఉంది. ఇక రజనీకాంత్ లాంటి హీరోల తర్వాత అత్యధిక ఫాలోయింగ్ ఉన్న వారిలో కూడా అజిత్ టాప్ లిస్టులో ఉన్నాడు. గత కొంతకాలంగా వరుసగా కమర్షియల్ సినిమాలతో తన స్టార్ ఇమేజ్ ను పెంచుకుంటున్న అజిత్ సినిమా మిగతా రాష్ట్రాల్లో కూడా తన ప్రభావాన్ని పెంచుకోవాలని చూస్తున్నాడు. వలిమై సినిమా తెలుగులో కూడా మంచి బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది.

భారీ బడ్జెట్ తో..

భారీ బడ్జెట్ తో..

అజిత్ సినిమా అంటేనే మాస్ ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన అంచనాలు నెలకొంటాయి. ఇక ఈసారి తనకు ఎంతో ఇష్టమైన బైక్ రేసింగ్ నేపథ్యంలో వలిమై సినిమా చేశాడు వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మాస్ ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ లా ఉంటుంది అని అంతేకాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కోసం సినిమా చూసి ఎంజాయ్ చేస్తారు అని చిత్ర యూనిట్ సభ్యులు బాగానే ప్రమోట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో 150 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించిన ట్లు సమాచారం.

నాన్ థియేట్రికల్ గా..

నాన్ థియేట్రికల్ గా..

అజిత్ సినిమాలకు మొదటి సారి నాన్ థియేట్రికల్ గా కూడా భారీ స్థాయిలో లాభాలు వచ్చినట్లు సమాచారం. ఈ సినిమా డిజిటల్ శాటిలైట్ మ్యూజిక్ ఇలా నాన్ థియేట్రికల్ బిజినెస్ లో దాదాపు 60 కోట్ల వరకు ఆదాయాన్ని అందించినట్లు సమాచారం. అజిత్ సినిమా కెరీర్ లోనే ఈ సినిమా అత్యధికంగా నాన్ థియేట్రికల్ బిజినెస్ చేసింది.

తమిళనాడు బిజినెస్

తమిళనాడు బిజినెస్

తమిళనాడులో వలిమై థియేట్రికల్ రైట్స్‌కు రికార్డు ధర పలికింది. ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ ప్రీ-రిలీజ్ బిజినెస్‌ తో షాక్ ఇచ్చింది అనే చెప్పాలి. తమిళనాడులోనే సుమారు 64 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు టాక్. అజిత్ మునుపటి సినిమా వివేగం బిజినెస్ కంటే కూడా ఇది ఎక్కువ. తప్పకుండా ఈ సినిమా చాలా వేగంగా ఆ టార్గెట్ ను ఫినిష్ చేస్తుందని చెప్పవచ్చు.

తెలుగులో ఎంతంటే?

తెలుగులో ఎంతంటే?

ఇక తెలుగులో కూడా అజిత్ సినిమా మొదటి సారి భారీ స్థాయిలో విడుదల అవుతుంది ఈ సినిమాకు థియేటర్లు కూడా చాలా ఎక్కువగానే దొరికాయి. ఏపీ తెలంగాణలో మొత్తంగా 465 థియేటర్లలో వలిమై సినిమా సందడి చేయబోతోంది. ఇక తెలుగులో రూ.2.50కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. టాక్ పాజిటివ్ గా ఉంటే ఈ టార్గెట్ ఫినిష్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు.

మొత్తం బిజినెస్

మొత్తం బిజినెస్

అజిత్ కుమార్ నటించిన వలిమై థియేట్రికల్ గా వరల్డ్ వైడ్ బిజినెస్ మొత్తం ఈ విధంగా ఉంది. తమిళనాడు - రూ. 64.50 కోట్లు, ఏపీ తెలంగాణ రూ. 2.50 కోట్లు, కర్ణాటక - రూ. 4 కోట్లు, కేరళ - రూ. 2.50 కోట్లు, నార్త్ ఇండియా - రూ. 2.50 కోట్లు. ఇండియా మొత్తం - రూ. 76 కోట్ల వరకు ఈ సినిమా బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది.

Recommended Video

ఫ్యాన్ సెల్‌ఫోన్‌ లాక్కున్న Ajith, Fanism హద్దు మీరుతొంది !
టార్గెట్ ఎంతంటే?

టార్గెట్ ఎంతంటే?

ఇక ఓవర్సీస్ - రూ. 20 కోట్ల ధర పలికిన వాలిమై తప్పకుండా ఆ టార్గెట్ ను చాలా తొందరగానే ఫినిష్ చేస్తుందని తెలుస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా గట్టిగానే ఉన్నాయి. ఇక వాలిమై ప్రపంచవ్యాప్తంగా - రూ. 96 కోట్లు బిజినెస్ చేసింది. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా హిట్ అవ్వాలి అంటే 96.50 కోట్లు షేర్ సాధిస్తేనే హిట్ అయినట్లు లెక్క.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X