Valimai Pre-Release Business: అనుకున్న తేదికే రానున్న అజిత్.. తెలుగులో టార్గెట్ ఎంతంటే?

మరోసారి కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో దేశవ్యాప్తంగా డేంజర్ బెల్స్ మొదలైనట్లుగా సంకేతాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా కొన్ని సినిమాలు మాత్రం చాలా ధైర్యంగా థియేటర్స్ లో వస్తున్నాయి. ఇక ప్రస్తుతం తమిళనాడులో లాక్ డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ. అజిత్ కుమార్ వలీమై సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. మొన్నటి వరకూ ఈ సినిమా వాయిదా పడుతుంది అని అనేక రకాల కథనాలు వచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రం భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ తో తెలుగు తమిళంలో ఒకేసారి విడుదల అవుతున్నట్లు తెలుస్తోంది.

 మళ్ళీ రిలీజ్ ప్లాన్స్..

మళ్ళీ రిలీజ్ ప్లాన్స్..

హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వలీమై సినిమా జనవరి 13న తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా ఒకేసారి విడుదల కాబోతోంది. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీకపూర్ ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మించారు. మొన్నటి వరకు కరోనా ప్రభావం వలన సినిమా వాయిదా పెడుతున్నట్లు టాక్ వచ్చింది. కానీ చిత్ర యూనిట్ సభ్యులు థియేటర్స్ తో ప్రత్యేక ఒప్పందం చేసుకొని సినిమాను విడుదల చేస్తున్నట్లు సమాచారం.

 యాక్షన్ సినిమాగా..

యాక్షన్ సినిమాగా..

అజిత్ కుమార్ కు తమిళంలో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రజినీకాంత్ విజయ్ తర్వాత అత్యధిక మార్కెట్ ఉన్న కమర్షియల్ హీరోగా అజిత్ గుర్తింపు అందుకుంటున్నాడు. వలీమై సినిమా కూడా ఆయన రేంజ్ కు తగ్గట్లుగానే రూపొందినట్లు అర్థమవుతోంది. అజిత్ కుమార్ కి బైక్ రేసింగ్ అంటే చాలా ఇష్టం వలీమై సినిమా కూడా అదే కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమాలో యాక్షన్ సన్నివేశాలు కూడా బాగానే ఉన్నట్లు ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది.

స్పెషల్ అట్రాక్షన్ గా కార్తికేయ

స్పెషల్ అట్రాక్షన్ గా కార్తికేయ

ఈ సినిమాను తెలుగులో కూడా భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఎందుకంటే కార్తికేయ వలీమై లో ప్రధాన విలన్ గా కనిపించబోతున్నాడు. ఆ పాత్ర హీరోకు సరిపోయే విధంగా చాలా పవర్ఫుల్ గా ఉంటుందని పోస్టర్స్ చూస్తేనే అర్థమవుతుంది. ఇదివరకే గ్యాంగ్ లీడర్ సినిమా లో నెగటివ్ రోల్ తో ఎంతగానో ఆకట్టుకున్న కార్తికేయ ఇప్పుడు ఫుల్ యాక్షన్ ఎపిసోడ్ లో తన విలనిజాన్ని చూపించబోతున్నాడు.

ప్రీ రిలీజ్ బిజినెస్..

ప్రీ రిలీజ్ బిజినెస్..

అయితే బాలీవుడ్ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఏ స్థాయిలో ఉంటుంది అనే విషయం ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. 150 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా రెమ్యునరేషన్ లిస్ట్ కూడా ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. అజిత్ రూ. 70 కోట్లు తీసుకోగా దర్శకుడు హెచ్ వినోద్ కు రూ. 4 కోట్లు చెల్లించారని సమాచారం. ఇక సినిమా బాక్సాఫీస్ వద్ద 160కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం.

Recommended Video

Master Movie Closing Box Office Report In Telugu | లాభం ఎంతంటే..
తెలుగులో టార్గెట్ ఎంతంటే?

తెలుగులో టార్గెట్ ఎంతంటే?

ఇక తెలుగులో కూడా అజిత్ సినిమా మోదటి సారి భారీ స్థాయిలో విడుదల అవుతోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా అజిత్ సినిమా తెలుగులో 4కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో విడుదల అవుతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో తెలుగు టాలెంటెడ్ హీరో కార్తికేయ విలన్ గా నటిస్తుండడం కొంత పాజిటివ్ పాయింట్. మరి తెలుగులో ఆ టార్గెట్ ను ఎన్ని రోజుల్లో అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X