100 కోట్ల క్లబ్‌లో అజిత్ మూవీ.. డిజాస్టర్ టాక్‌లో విదాముయార్చి సంచలనం
తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్, స్టార్ హీరోయిన్ త్రిషా కృష్ణన్ జంటగా ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన చిత్రం విదాముయార్చి. ప్రముఖ నిర్మాత సుభాస్కరన్ రూపొందించిన ఈ సినిమాకు తిరుమోని దర్శకత్వం వహించారు. ఈ సినిమా తొలి ఆట నుంచే మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకొన్నది. ఈ క్రమంలో ఈ సినిమా గత 4 రోజుల్లో రాబట్టిన వసూళ్ల వివరాల్లోకి వెళితే..
విదాముయార్చి చిత్రం తమిళనాడు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తమిళంలో తొలి రోజు 26 కోట్ల రూపాయలు, రెండో రోజు 10 కోట్ల రూపాయలు, మూడో రోజు 13 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా గత మూడు రోజుల్లో 49 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. ఇక నాలుగో రోజు ఆదివారం కూడా భారీ ఆక్యుపెన్సీ నమోదు కావడం సానుకూలంగా మారిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించారు.

ఇక తెలుగులో పెద్దగా ఈ సినిమాకు స్పందన కనిపించలేదు. దాంతో పేలవంగా వసూళ్లు నమోదు అవుతున్నాయి. తెలుగులో 1వ రోజు 75 లక్షలు, రెండో రోజు 50 లక్షలు, మూడో రోజు 50 లక్షలు, నాలుగో రోజు 40 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 2.5 కోట్ల రూపాయలు నికరంగా రాబట్టింది.
ఇక కన్నడలో ఈ సినిమాకు మంచి రెస్సాన్స్ కనిపించింది. మొదటి రోజు 4.25 కోట్లు, రెండో రోజు 1 కోటి రూపాయలు, 3వ రోజు 1.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ మూవీ 6.75 కోట్ల రూపాయలు వసూలు చేసింది. కేరళలో గత మూడు రోజుల్లో 2.25 కోట్లు వసూలు చేసింది. ఇతర రాష్ట్రాల్లో 1 కోటి రూపాయలు రాబట్టింది. కన్నడ, మలయాళం, హిందీలో కలిపి 10 కోట్లు వసూలు చేసింది.

గత మూడు రోజుల్లో విదాముయార్చి చిత్రం తమిళంలో 49 కోట్ల రూపాయలు, తెలుగులో 2.5 కోట్ల రూపాయలు, కన్నడలో 6.75 కోట్లు, కేరళలో 2.25 కోట్లు, ఇతర రాష్ట్రాల్లో 1 కోటి రూపాయలు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో 33 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా మూడో రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 99 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.
ఇక నాలుగో రోజు అజిత్ మూవీకి వెరీ గుడ్ రెస్పాన్స్ లభించింది. ఈ సినిమా సుమారుగా ఇండియాలో 12 కోట్ల రూపాయలు, ఇతర ప్రాంతాల్లో 5 కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చని అంచనా వేశారు. 4వ రోజు ఈ సినిమా 15 నుంచి 17 కోట్ల మధ్య వసూళ్లు నమోదు చేయవచ్చని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా 100 కోట్ల మైలురాయిని దాటి మొత్తంగా 114 కోట్ల నుంచి 116 కోట్ల మధ్య సెటిల్ అయ్యే అవకాశం ఉంది. అయితే డిజాస్టర్ టాక్‌లో కూడా అజిత్ తన బాక్సాఫీస్ స్టామినాను చూపిస్తూ 100 కోట్ల క్లబ్‌లో సినిమాను చేర్చడం విశేషంగా మారింది.


Click it and Unblock the Notifications











