Romantic Pre release Business: పూరి తనయుడి బాక్సాఫీస్ టార్గెట్ ఎంతంటే?

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న వారసుల్లో ఆకాష్ పూరి ఒకరు. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడిగా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఆకాష్, చిరుత బుజ్జిగాడు వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. ఇప్పటికి హీరోగా రెండు సినిమాల్లో నటించిన ఆకాష్ ఇప్పుడు మూడో సినిమాతో ఎలాగైనా బాక్సాఫీస్ హిట్ అందుకోవాలని అనుకుంటున్నాడు. రొమాంటిక్ సినిమా ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఒక చిన్న టార్గెట్ తో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. సినిమా కలెక్షన్స్ ఎంత వేస్తే.. హిట్ అవుతుంది అనే వివరాల్లోకి వెళితే..

ప్రమోషన్ లో జాగ్రత్తలు

ప్రమోషన్ లో జాగ్రత్తలు

పూరి జగన్నాథ్ హోమ్ ప్రొడక్షన్ పూరి కనెక్ట్స్ లో నిర్మించిన రొమాంటిక్ సినిమాకు ఇప్పటికే ప్రమోషన్స్ విషయంలో చిత్ర యూనిట్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేలా చేసింది. ప్రభాస్ తో పాటు సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు అందరూ కూడా సినిమా పై పాజిటివ్ గా స్పందించారు. ప్రత్యేకంగా దర్శకుల కోసం స్పెషల్ షోలను కూడా వేయడం జరిగింది. ప్రమోషన్ విషయంలో అయితే దర్శకుడు పూరి జగన్నాథ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ప్రభాస్ తో ప్రత్యేకంగా ఇంటర్వ్యూ

ప్రభాస్ తో ప్రత్యేకంగా ఇంటర్వ్యూ

ప్రభాస్ తో ప్రత్యేకంగా చేసిన ఇంటర్వ్యూ ద్వారా రొమాంటిక్ సినిమా చాలామంది జనాలకు చేరువయ్యింది. సినిమాకు సంబంధించిన టీజర్ ట్రైలర్ కు కూడా చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యాయి. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు అందుకుంటుందని చిత్ర యూనిట్ నమ్మకంతో ఉంది. అలాగే హీరోయిన్ కేతికశర్మ కూడా యూత్ ని చాలా బాగా ఆకట్టుకుంటుందని అంటున్నారు.

ఏపీ తెలంగాణలో బిజినెస్ ఎంతంటే?

ఏపీ తెలంగాణలో బిజినెస్ ఎంతంటే?

ఇక ఈ సినిమా శుక్రవారం ఎలాంటి ఓపెనింగ్స్ అందుకుంటుంది అనేదానిపై మొత్తం ఫలితం ఆధారపడి ఉంది. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే బడ్జెట్ ను బట్టి గట్టిగానే జరిగినట్లు తెలుస్తోంది. నైజాంలో 2.1 కోట్లు, సీడెడ్ లో 1 కోటి ఆంధ్ర రీజన్ లో 2 కోట్ల బిజినెస్ తో క్లోజ్ అయినట్లు సమాచారం . మొత్తంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో రొమాంటిక్ సినిమా 4.5 కోట్ల వరకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ సాధించినట్లు సమాచారం.

మొత్తం టార్గెట్ ఎంతంటే

మొత్తం టార్గెట్ ఎంతంటే

ఇక వరల్డ్ వైడ్ గా రొమాంటిక్ సినిమా 4.6 కోట్ల రేంజ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ లెక్కలతో సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో వసూలు అందుకుంటుంది అనేది కూడా హాట్ టాపిక్ గా మారింది. మొత్తంగా 5 కోట్ల మేరకు షేర్ అందుకుంటేనే సక్సెస్ అయినట్లు లెక్క. సినిమా బాక్సాఫీస్ టార్గెట్ ని ఎన్ని రోజుల్లో అందుకుంటుంది అనేది కూడా మొదటి వారాంతంలో వచ్చే కలెక్షన్స్ ను బట్టి ఉంటుంది.

Recommended Video

SSMB 28 : Mahesh Babu, Trivikram నుంచి 11 ఏళ్ల తర్వాత.. హీరోయిన్ ఆమెనా? || Filmibeat Telugu
టోటల్ థియేటర్స్..

టోటల్ థియేటర్స్..

నైజాంలో మొత్తంగా 200 థియేటర్లలో విడుదల కాబోతున్న రొమాంటిక్ సినిమా సీడెడ్ లో 75 థియేటర్స్ లో విడుదల అవుతోంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో 210 థియేటర్లలో సినిమా విడుదల అవుతుండగా 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 485 థియేటర్లలో సందడి చేయబోతున్నట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే రొమాంటిక్ సినిమా 630 థియేటర్లలో విడుదల అవుతోంది. ఇక ఐదు కోట్ల బాక్సాఫీస్ టార్గెట్ ను అందుకోవడం ఈ సినిమాకు పెద్ద కష్టం కాదని టాక్ వస్తోంది. మరి పూరి తనయుడు తన సత్తాను ఎంతవరకు చాటుతాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X