Don't Miss!
- News
Udaipur murder: హంతకులకు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థతో లింక్, కరాచీలో 40 రోజులు శిక్షణ !
- Sports
Bumrah On Fire: బుల్లెట్టు బంతులు వేసేత్త పా బూమ్ బూమ్ బూమ్ బూమ్ అని..! వాన వల్ల బతికిపోయారు..
- Automobiles
కోట్లు ఖరీదు చేసే లాంబోర్ఘిని కారుతో మరో కాస్ట్లీ కారును ఢీకొట్టిన 10 ఏళ్ల బాలుడు!
- Technology
మే నెలలో 96 మిలియన్ల యూనిట్లకు పడిపోయిన SmartPhone విక్రయాలు!
- Finance
Lottery: నక్కతోక తొక్కిన ట్రక్ డ్రైవర్.. రూ. 7.50 కోట్లు తెచ్చిపెట్టిన లాటరీ టికెట్.. అదృష్టం..
- Lifestyle
పడక గదిలో మీ భర్త లేదా భార్య మీకు దగ్గరగా ఉండకపోవడానికి కారణం ఏంటో తెలుసా?
- Travel
మన్యంలో మరుపురాని దృశ్యాలు రెండవ భాగం
Akhanda 100 Days Collections: చరిత్ర సృష్టించిన బాలయ్య.. తెలుగులోనే తొలి సినిమాగా అఖండ రికార్డు
టాలీవుడ్లో కొన్ని స్పెషల్ కాంబినేషన్లు ఉన్నాయి. అందులో నటసింహా నందమూరి బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలయిక ఒకటి. గతంలో వీళ్లిద్దరూ కలిసి చేసిన 'సింహా', 'లెజెండ్' వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఇక, సుదీర్ఘ విరామం తర్వాత అంటే గత డిసెంబర్లో 'అఖండ' అనే సినిమాతో వీళ్లు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమాకు రెస్పాన్స్ కూడా భారీ స్థాయిలోనే వచ్చింది. దీంతో అత్యధిక కలెక్షన్లను రాబట్టి సూపర్ డూపర్ హిట్ అయింది. అంతేకాదు, ఏకంగా వంద రోజుల పాటు ప్రదర్శితం అయింది. ఈ నేపథ్యంలో 'అఖండ' మూవీ వంద రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

‘అఖండ’గా బాలకృష్ణ విశ్వరూపం
నటసింహం బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తీసిన చిత్రమే ‘అఖండ'. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించాడు. ఇందులో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా చేసింది. శ్రీకాంత్ నెగెటివ్ రోల్ చేశాడు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇది డిసెంబర్ 2న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది.
Bigg Boss Non Stop: సరయు రాయ్‌పై చెక్కతో దాడి.. ఆరియానా తప్పుకు ఆమె బలి.. బిగ్ బాస్ వార్నింగ్

అఖండ థియేట్రికల్ బిజినెస్ ఇలా
ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కర్నాటక, తమిళనాడు, ఓవర్సీస్లో కూడా నందమూరి బాలకృష్ణకు మంచి మార్కెట్ ఉంది. దీనికితోడు బోయపాటి శ్రీనుతో చేసిన సినిమా కావడంతో ‘అఖండ'కు భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 53 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అందుకు అనుగుణంగానే దీన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేసేశారు.

వంద రోజులు... అఖండ రికార్డులు
క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ' మూవీకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. దీంతో ఈ సినిమాకు కలెక్షన్లు పోటెత్తాయి. దీంతో ఈ మూవీ లాంగ్ రన్‌ను సొంతం చేసుకుంది. ఇలా తాజాగా ఇది వంద రోజులు పూర్తి చేసుకుంది. నేరుగా నాలుగు సెంటర్లలతో పాటు మొత్తంగా 20 కేంద్రాల్లో ఈ సినిమా ఈ మైలురాయిని చేరుకుని రికార్డు సృష్టించింది.
హాట్ షోలో గీత దాటిన సమంత: వీడియోలో అలా అందాలను ఆరబోస్తూ.. హాట్ హాట్‌గా!

100 రోజులకు కలిపి ఎంతొచ్చింది?
100 రోజులకు కలిపి ‘అఖండ'కు కలెక్షన్లు భారీగా వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 25.75 కోట్లు, సీడెడ్‌లో రూ. 18.70 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 7.14 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 4.62 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4.32 కోట్లు, గుంటూరులో రూ. 6.95 కోట్లు, కృష్ణాలో రూ. 3.90 కోట్లు, నెల్లూరులో రూ. 2.95 కోట్లతో.. తెలుగు రాష్ట్రాల్లో రూ. 74.33 కోట్లు షేర్, రూ. 130.50 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?
ఏపీ, తెలంగాణలో సత్తా చాటి ‘అఖండ' మూవీ తెలుగు రాష్ట్రాల్లో 100 రోజుల్లో రూ. 74.33 కోట్లు అందుకుంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 9.94 కోట్లు, ఓవర్సీస్లో రూ. 7.05 కోట్లు రాబట్టింది. అలాగే, మరికొన్ని చోట్ల రూ. 2.95 కోట్లు కలెక్ట్ చేసింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో రూ. 94.27 కోట్లు షేర్, రూ. 156 కోట్లు గ్రాస్ వసూలు చేసేసింది.
హీరోయిన్ హాట్ ఫొటోను షేర్ చేసిన వర్మ: ప్రైవేట్ భాగాలను చూపిస్తూ దారుణంగా!

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభాలు ఎంత?
క్రేజీ
కాంబినేషన్లో
ప్రతిష్టాత్మకంగా
వచ్చిన
‘అఖండ'
మూవీకి
అంచనాలకు
అనుగుణంగానే
ప్రపంచ
వ్యాప్తంగా
రూ.
53
కోట్లు
మేర
బిజినెస్
జరిగినట్లు
ట్రేడ్
వర్గాలు
తెలిపాయి.
దీంతో
బ్రేక్
ఈవెన్
టార్గెట్
రూ.
54
కోట్లుగా
నమోదైంది.
ఇక,
ఈ
సినిమా
100
రోజుల్లో
ప్రపంచ
వ్యాప్తంగా
రూ.
94.27
కోట్లు
వసూలు
చేసింది.
ఫలితంగా
రూ.
40.27
కోట్లు
లాభాలతో
రికార్డును
అందుకుంది.

రికార్డులతో దండయాత్ర చేసిన హీరో
‘అఖండ'
మూవీ
ఓటీటీలో
కూడా
విడుదలైంది.
అయినప్పటికీ
ఇది
20
కేంద్రాల్లో
100
రోజులు
పూర్తి
చేసుకుంది.
తద్వారా
ఈ
మధ్య
కాలంలో
ఈ
ఘనతను
అందుకున్న
తొలి
తెలుగు
సినిమాగా
నిలిచింది.
అంతేకాదు,
దీని
ద్వారా
బాలయ్య
కెరీర్లోనే
ఎక్కువ
కలెక్షన్లను
అందుకున్నారు.
అంతేకాదు,
ఈ
చిత్రం
150
కోట్ల
గ్రాస్‌ను,
40
కోట్ల
లాభాలను
కూడా
సొంతం
చేసుకుంది.