Akhanda 2 Advance Booking: అఖండ 2 అడ్వాన్స్ బుకింగ్.. బాలకృష్ణ మూవీ బాక్సాఫీస్ పరిస్థితి ఏమిటంటే?
నటసింహ నందమూరి బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం అఖండ 2: తాండవం. బ్లాక్‌బస్టర్ సాధించిన అఖండ మూవీకి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాకు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాను బాలకృష్ణ కూతురు తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
భారీ బడ్జెట్, హై ఆక్టేన్ యాక్షన్ సీన్లతో రూపొందుతున్న ఈ సినిమాకు ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సీ రామ్ ప్రసాద్, సంతోష్ డీ డీటాకే సినిమాటోగ్రఫిని, ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్, తమ్మిరాజు ఎడిటర్‌గా, రామ్ లక్ష్మణ్ ఫైట్స్ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమాకు కోటి పర్చూరి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ కావాల్సిన ఈ సినిమా విడుదల వాయిదా పడింది.
అయితే ఎరోస్ ఇంటర్నేషనల్‌తో ఉన్న ఫైనాన్స్ గొడవలను పరిష్కరించుకొని డిసెంబర్ 12వ తేదీన రిలీజ్‌కు సిద్దమైంది. ఈ చిత్రం డిసెంబర్ 11వ తేదీన ప్రీమియర్లతో బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించనున్నది. ఈ క్రమంలో అఖండ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

అఖండ సినిమా భారీ విజయం సాధించడంతో అఖండ 2 తాండవం సినిమాపై అనూహ్యమైన అంచనాలు పెరిగాయి. దాంతో ఈ సినిమాను ప్యాన్ ఇండియా మూవీగా మలిచారు. దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షించడానికి ఈ సినిమాలో భారీగా వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్ వర్క్ చేశారు. స్టార్ హీరో, హీరోయిన్లు, అలాగే టాప్ సాంకేతిక నిపుణులు, ప్రొడక్షన్ వాల్యూస్ కలుపుకొని ఈ సినిమాను సుమారుగా 200 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు.
అఖండ 2 సినిమా అడ్వాన్స్ బుకింగ్ విషయానికి వస్తే.. ఈ చిత్రం బుక్ మై షో, డిస్ట్రిక్ట్ యాప్ ద్వారా లభించిన సమాచారం ప్రకారం.. 1450 షోలు ప్రదర్శించారు. ఈ సినిమా 9.4 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ మొత్తం ఇంకా పెరిగే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నారు.
అమెరికాలో ఈ చిత్రం ఓ మోస్తారుగా అడ్వాన్స్ బుకింగ్ నమోదు అవుతున్నది. ఈ చిత్రం ఇప్పటికే 300K డాలర్లు అంటే సుమారుగా 2.7 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక యూకే, యూరప్, ఆస్ట్రేలియాలో ఈ చిత్రం 130K డాలర్లు 1.4 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ చిత్రానికి సంబంధించి 450 ప్రీమియర్లు షోలు ప్రదర్శిస్తున్నారు. దీంతో 4.8 కోట్ల రూపాయలు వసూలు అయ్యాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
డిసెంబర్ 11వ తేదీ రోజు వరకు అఖండ 2 చిత్రం ప్రీమియర్లు, ఇతర షోల అడ్వాన్స్ బుకింగ్ ద్వారా భారీగానే వసూళ్లను సాధించే అవకాశం ఉంది. ఈ చిత్రం ఇప్పటికే 18.3 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ప్రీమియర్లు, తొలి రోజు కలెక్షన్లు కలిపి ఈ చిత్రం 30 కోట్ల మేర వసూళ్లను నమోదు చేస్తుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించారు.


Click it and Unblock the Notifications











