Akhanda 2 USA Collections: ఆ విషయంలో బాలకృష్ణ రికార్డు.. భారీ నష్టాల్లో అఖండ 2.. ఎన్ని కోట్లంటే?
నటసింహ నందమూరి బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో భారీ అంచనాలతో వచ్చిన చిత్రం అఖండ 2: తాండవం. బ్లాక్‌బస్టర్ సాధించిన అఖండ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాకు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట నిర్మాతలుగా వ్యవహరించారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాను బాలకృష్ణ కూతురు తేజస్విని నందమూరి సమర్పించారు. సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రల్లో నటించారు.
భారీ బడ్జెట్, హై ఆక్టేన్ యాక్షన్ సీన్లతో రూపొందుతున్న ఈ సినిమాకు ఎస్ థమన్ మ్యూజిక్ అందించారు. సీ రామ్ ప్రసాద్, సంతోష్ డీ డీటాకే సినిమాటోగ్రఫిని, ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్, తమ్మిరాజు ఎడిటర్‌గా, రామ్ లక్ష్మణ్ ఫైట్స్ బాధ్యతల్ని నిర్వర్తించారు. ఈ సినిమాకు కోటి పర్చూరి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఈ సినిమా ఫైనాన్స్ సమస్యలు పరిష్కరించుకొని డిసెంబర్ 12వ తేదీన రిలీజైంది. ఈ చిత్రం డిసెంబర్ 11వ తేదీన ప్రీమియర్లతో బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించింది.

ట్రేడ్ వర్గాలు, డిజిటిల్ మీడియా కథనాల ప్రకారం.. అఖండ చిత్రం ఓవర్సీస్ రైట్స్ సుమారుగా 15 కోట్ల మేర అమ్ముడుపోయాయి. అయితే అనూహ్యంగా రిలీజ్ డేట్ మారడంతో థియేట్రికల్ రైట్స్ బిజినెస్ లెక్కలు కూడా మారాయి. ఆ తర్వాత కొంత మొత్తానికి కుదించారు. అయినా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించే పరిస్థితి కూడా కనిపించడం లేదు. కేవలం నార్త్ అమెరికాలోనే కాదు.. అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితిని డిస్ట్రిబ్యూటర్లు ఎదుర్కొంటున్నారు. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ చేరుకోవాలంటే.. కనీసం 2.5 మిలియన్ డాలర్లు అంటే.. సుమారుగా 20 నుంచి 22 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించారు.
అయితే ఈ సినిమా కలెక్షన్ల గురించి ట్రేడ్ అనలిస్ట్ వెంకీ బాక్సాఫీస్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ మూవీ సుదీర్ఘంగా బాక్సాఫీస్ వద్ద పోరాటం చేసి 1 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరింది. ఇది బాలకృష్ణ కెరీర్‌లో ఇలాంటి ఘనత సాధించడం 5వ సారి. సీనియర్ హీరోలలో బాలయ్య అరుదైన ఘనతను సాధించారు అని ఆయన చెప్పుకొచ్చారు.
అయితే బాలయ్య తన కెరీర్‌లో వ్యక్తిగతంగా రికార్డు క్రియేట్ చేసినా.. సినిమాను లాభాల్లోకి తీసుకు రాలేకపోయాడు. ఈ చిత్రం నార్త్ అమెరికాలో బాక్సాఫీస్ జర్నీని ముగించింది. ఈ సినిమా చివరకు భారీ నష్టాలను మాత్రమే మిగిల్చింది. అఖండ 2 చిత్రం అమెరికా, కెనడాలో రికార్డు నష్టాలతో తన యాత్రను ముగించింది అని వెల్లడించారు.


Click it and Unblock the Notifications











