Akhanda 2 Day 1 Box Office: అఖండ 2 డే 1 కలెక్షన్లు ఎన్ని కోట్లు.. ఆ రికార్డుపై గురిపెట్టిన బాలకృష్ణ
తెలుగు ప్రేక్షకులకు గాడ్ ఆఫ్ మాసెస్, నటరత్న నందమూరి బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం అఖండ 2: తాండవం. బ్లాక్‌బస్టర్ సాధించిన అఖండ మూవీకి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాకు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాను బాలకృష్ణ కూతురు తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
భారీ బడ్జెట్, హై ఆక్టేన్ యాక్షన్ సీన్లతో రూపొందుతున్న ఈ సినిమాకు ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సీ రామ్ ప్రసాద్, సంతోష్ డీ డీటాకే సినిమాటోగ్రఫిని, ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్, తమ్మిరాజు ఎడిటర్‌గా, రామ్ లక్ష్మణ్ ఫైట్స్ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమాకు కోటి పర్చూరి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ నటించిన ఈ సినిమా బిజినెస్ ఎన్ని కోట్లు? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

అఖండ సినిమా భారీ విజయం సాధించడంతో అఖండ 2 తాండవం సినిమాపై అనూహ్యమైన అంచనాలు పెరిగాయి. దాంతో ఈ సినిమాను ప్యాన్ ఇండియా మూవీగా మలిచారు. దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షించడానికి ఈ సినిమాలో భారీగా వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్ వర్క్ చేశారు. స్టార్ హీరో, హీరోయిన్లు, అలాగే టాప్ సాంకేతిక నిపుణులు, ప్రొడక్షన్ వాల్యూస్ కలుపుకొని ఈ సినిమాను సుమారుగా 200 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు.
అయితే అఖండ భారీ విజయం సాధించడంతో అఖండ 2 సినిమా మీద అంతకంటే రెండింతలు ఎక్కువగానే అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్‌కు అన్ని భాషల్లోను సానుకూలమైన స్పందన కనిసిస్తున్నది. ఈ సినిమాకు సంబంధించిన ఒక రోజు ముందుగానే అంటే డిసెంబర్ 4వ తేదీన ప్రీమియర్లు ప్రదర్శించేందుకు భారీగా ఏర్పాట్లు చేశారు. దాంతో భారీగా ఓపెనింగ్స్ నమోదు అయ్యే అవకాశం ఉంది.
ఆల్ ఇడియాలో తెలుగు వెర్షన్‌కు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా ప్రీమియర్లకు సంబంధించి 40 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. దాదాపు 50 వేల టికెట్లు అమ్ముడుపోయాయి. తద్వారా 3 కోట్ల రూపాయలు వసూలు అయ్యాయి. ఇక తొలి రోజు అడ్వాన్స్ కలెక్షన్ల విషయానికి దాదాపు 17500 టికెట్లు అమ్ముడుపోయాయి. 30 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. తద్వారా 4 కోట్ల రూపాయల వసూలైంది. ప్రీమియర్లు, తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు సుమారుగా 7 కోట్లకుపైగానే నమోదైందని ట్రేడ్ వర్గాలు వెల్లడింంచాయి.
ఓవర్సీస్ విషయానికి వస్తే.. అమెరికాలో ఈ సినిమాను 428 లోకేషన్లలో 1073 షోలు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. వీటి ద్వారా సుమారుగా 258116 డాలర్లు వసూలయ్యాయి. 10100 టికెట్లు అమ్ముడుపోయాయి. నార్త్ అమెరికాలో 280K డాలర్ల మేర వసూళ్లు నమోదయ్యాయి అంటే సుమారుగా 25 కోట్ల రూపాయలు కలెక్ట్ అయ్యాయి అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఇంకా ఒక రోజు సమయం ఉంది కాబట్టి ఈ రేంజ్ పెరిగే అవకాశం ఉందని తెలిపారు. దాంతో ఈ సినిమాకు సుమారుగా 10 కోట్ల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో నమోదయ్యాయి.
నందమూరి బాలకృష్ణ గత సినిమాల తెలుగు రాష్ట్రాల తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. అఖండ చిత్రం 15.4 కోట్ల రూపాయలు, భగవంత కేసరి 14.2 కోట్ల రూపాయలు, వీరసింహారెడ్డి 25.5 కోట్ల రూపాయలు వసూలు చేశాయి. అయితే అఖండ 2 చిత్రం ఈ సినిమా కలెక్షన్లను అధిగమిస్తుందా? అనేది ఆసక్తిగా మారింది. ఆంధ్రా, తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 20 నుంచి 25 కోట్ల మధ్య వసూలు చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు బాలయ్య కెరీర్‌లో వీర సింహ రెడ్డి వరల్డ్ వైడ్ 54 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అఖండ కూడా ఈ రేంజ్‌లో వసూలు చేయవచ్చని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











