Akhanda 2 Day 12 Collections: అఖండ 2 మూవీపై కోలుకోని దెబ్బ.. ఎన్ని కోట్ల నష్టాల్లో అంటే?

నటసింహ నందమూరి బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో భారీ అంచనాలతో వచ్చిన చిత్రం అఖండ 2: తాండవం. బ్లాక్‌బస్టర్ సాధించిన అఖండ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాకు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట నిర్మాతలుగా వ్యవహరించారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాను బాలకృష్ణ కూతురు తేజస్విని నందమూరి సమర్పించారు. సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రల్లో నటించారు.

భారీ బడ్జెట్, హై ఆక్టేన్ యాక్షన్ సీన్లతో రూపొందుతున్న ఈ సినిమాకు ఎస్ థమన్ మ్యూజిక్ అందించారు. సీ రామ్ ప్రసాద్, సంతోష్ డీ డీటాకే సినిమాటోగ్రఫిని, ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్, తమ్మిరాజు ఎడిటర్‌గా, రామ్ లక్ష్మణ్ ఫైట్స్ బాధ్యతల్ని నిర్వర్తించారు. ఈ సినిమాకు కోటి పర్చూరి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఈ సినిమా ఫైనాన్స్ సమస్యలు పరిష్కరించుకొని డిసెంబర్ 12వ తేదీన రిలీజైంది. ఈ చిత్రం డిసెంబర్ 11వ తేదీన ప్రీమియర్లతో బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించింది. ఈ సినిమా బడ్జెట్, ప్రీమియర్ కలెక్షన్లు, మూడు రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

Akhanda 2 Day 12 Box Office

అఖండ సినిమా భారీ విజయం సాధించడంతో బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్‌పై భారీగా బిజినెస్ జరిగింది. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 103 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ 104 కోట్ల టార్గెట్‌గా బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 104 కోట్ల షేర్, 208 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబడితే గానీ.. బ్రేక్ ఈవెన్‌కు చేరువ అవుతుందని అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

అఖండ 2 చిత్రం రెండో వారంలో కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ వద్ద తడబాటుతో ముందుకెళ్తున్నది. ఈ సినిమా వసూళ్లు ఏ పరిస్థితుల్లోనే పుంజుకొనేలా సానుకూల పరిస్థితులు మచ్చుకైనా కనిపించకపోవడం డిస్టిబ్యూటర్లర్లకు, ఎగ్జిబ్యూటర్లకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఇప్పటి వరకు 90 కోట్ల రూపాయల గ్రాస్, 54 కోట్లకుపైగా నెట్ కలెక్షన్లు వసూలు చేశాయని ట్రేడ్ వర్గాలు క్లారిటీ ఇచ్చారు.

గత 11 రోజుల్లో ఈ సినిమా తెలంగాణ, ఆంధ్రాలో సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. నైజాంలో సుమారుగా 19 కోట్ల రూపాయలు వసూలు చేసింది. సీడెడ్‌లో 12 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 5.5 కోట్ల రూపాయలు, తూర్పు గోదావరి జిల్లాలో 4.5 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 3.5 కోట్ల రూపాయలు, గుంటూరులో 5.5 కోట్లు కృష్ణా జిల్లాలో 3.5 కోట్లు, నెల్లూరు జిల్లాలో 3 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గత 11 రోజుల్లో సాధించిన కలెక్షన్ల విషయానికి వస్తే.. ఓవర్సీస్‌లో ఈ మూవీ 12 కోట్ల రూపాయలకుపైగా వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం ఇండియాలో అంటే కర్ణాటకలో 11 కోట్లు, తమిళనాడులో 5 కోట్లు, హిందీలో 2 కోట్లకుపైగా వసూళ్లను కలిపి మొత్తంగా 101 కోట్ల గ్రాస్, 65 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 113 కోట్ల రూపాయల వసూళ్లను నమోదు చేసింది.

అఖండ 2 సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. 103 కోట్ల రూపాయల మేర జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 104 కోట్లు. ఇప్పటి వరకు ఈ సినిమా ఇప్పటి వరకు థియేట్రికల్ బిజినెస్‌లో 60 శాతం మాత్రమే రికవరీ సాధించింది. ఇంకా 40 శాతం మేరకు రికవరీ సాధించాల్సి ఉంది. ఈ చిత్రం థియేట్రికల్ రన్‌లో మొత్తంగా 35 నుంచి 40 కోట్ల మేర నష్టాలను చవిచూసే అవకాశం ఉంది అనే అభిప్రాయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ సినిమా 12వ రోజు 75 లక్షల నుంచి 1 కోటి రూపాయలు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X