Akhanda 2 Day 2 Collections: అఖండ 2 రెండో రోజు కలెక్షన్స్.. బాలకృష్ణ మూవీకి ఎన్ని కోట్లంటే?

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అఖండ 2. ఎన్నో అవాంతరాలు దాటుకుని డిసెంబర్ 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆలస్యంగా రేసులోకి వచ్చినప్పటికీ అఖండ 2కు భారీ కలెక్షన్స్ వస్తున్నాయి. తొలిరోజు ఈ సినిమా రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టింది. ఈ నేపథ్యంలో అఖండ 2 బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? రెండో రోజు బాలయ్య సినిమా ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాలు పరిశీలిస్తే...

అఖండ 2 తారాగణం
14 రీల్స్ ప్లస్ ఎంటర్‌టైన్‌మెంట్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై రామ్ అచంట, గోపీచంద్ అచంట, ఇషాన్ సక్సెనాలు సంయుక్తంగా అఖండ 2 చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించారు. బాలకృష్ణ రెండో కుమార్తె నందమూరి తేజస్విని ఈ సినిమాకు సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్నారు. బజరంగీ భాయిజాన్ ఫేమ్ హర్షాలీ మల్హోత్రా కీలక పాత్ర పోషిస్తోంది. థమన్ సంగీతం అందిస్తుండగా... తమ్మిరాజు ఎడిటింగ్, సీ. రాంప్రసాద్, సంతోష్ దేట్కేలు సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరిస్తున్నారు.

Akhanda 2 Day 2 Expected Box Office Collections Worldwide Balakrishna s Movie get good number in weekend

అఖండ 2 బడ్జెట్
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు దాదాపు 200 కోట్ల రూపాయల బడ్జెట్‌ అయినట్లుగా ఫిలింనగర్ టాక్. అఖండ క్రేజ్, బాలయ్య ఛరిష్మా కారణంగా ఈ సినిమాకు భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఉత్తరాంధ్ర హక్కులు 13.5 కోట్ల రూపాయలు, గుంటూరు జిల్లా రైట్స్ 9.5 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 8.25 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరి జిల్లాలో రైట్స్ 6.5 కోట్ల రూపాయలు, కృష్ణా జిల్లాలో 7 కోట్ల రూపాయలు, నెల్లూరు రైట్స్ 4.5 కోట్ల రూపాయలకు, సీడెడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ 26 కోట్ల రూపాయలు, నైజాంలో 30 కోట్ల రూపాయలు మేర బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

అఖండ 2 బ్రేక్ ఈవెన్ టార్గెట్
అలాగే కర్ణాటక, రెస్టాఫ్ ఇండియాలో 11 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 15 కోట్ల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 145 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దాంతో అఖండ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ కావాలంటే 150 కోట్ల రూపాయల షేర్, 300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. అఖండ 2 సినిమాను వరల్డ్ వైడ్‌గా 2200 థియేటర్స్‌లో విడుదల చేశారు.

అఖండ 2 తొలి రోజు కలెక్షన్స్
అఖండ 2 మూవీకి ప్రీమియర్స్‌లో 8 కోట్ల రూపాయలు, తొలిరోజున 22.53 కోట్ల రూపాయలు చొప్పున ఇండియా వైడ్ 30.53 కోట్ల రూపాయల నెట్... 35.75 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సాక్‌నిక్ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్‌తో కలిపి 30.75 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 3.77 కోట్ల రూపాయలు, తమిళనాడులో 1.13 కోట్ల రూపాయలు, కేరళలలో 5 లక్షల రూపాయలు, హిందీ+ రెస్టాఫ్ ఇండియాలో 50 లక్షల రూపాయలు చొప్పున రాబట్టినట్లు సాక్‌నిక్ పేర్కొంది. అయితే అఖండ 2 తొలిరోజున వరల్డ్ వైడ్‌గా 59.5 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబట్టినట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది.

అఖండ 2 ఓవర్సీస్ కలెక్షన్స్
ఇక ఓవర్సీస్ కలెక్షన్స్ పరిశీలిస్తే.. నార్త్ అమెరికాలో ప్రీమియర్స్‌లో అఖండ 2 దుమ్మురేపాడు. అమెరికా, కెనడాలలో 230 సెంటర్స్‌లో 452 K డాలర్లు (4.09 కోట్ల రూపాయలు) రాబట్టింది. ఇక తొలిరోజున నార్త్ అమెరికాలో అఖండ 2కు 125k (1.13 కోట్ల రూపాయలు) వసూలైంది. మొత్తంగా ప్రీమియర్స్‌తో కలిపి తొలిరోజున ఒక్క నార్త్ అమరికాలోనే 5.50 కోట్ల రూపాయల వరకు వసూలు చేశాడు బాలయ్య. యూకే, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ఫ్, మిడిల్ ఈస్ట్ తదితర దేశాలో మరో 3 కోట్ల రూపాయలు వసూలైనట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

అఖండ 2 రెండో రోజు కలెక్షన్స్
పాజిటివ్ రివ్యూలు, బాలయ్య నట విశ్వరూపం, వీకెండ్ కావడంతో అఖండ 2 సినిమాకు రెండో రోజు సాలీడ్ బుకింగ్స్ జరుగుతున్నట్లుగా నివేదికలు వస్తున్నాయి. రెండో రోజు సాయంత్రం 4 గంటల వరకు బాలయ్య మూవీకి తెలుగులో 29 శాతం, తమిళంలో 15 శాతం మేర థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ నివేదించింది. ఇక కడపటి వార్తలు అందేనాటికి అఖండ 2 ఇండియాలో 6.05 కోట్ల రూపాయల నికర వసూళ్లు సాధించింది. రెండో రోజున బాలయ్య మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 15 కోట్ల రూపాయలు, తమిళనాడు+ కర్ణాటకలో 2 కోట్ల రూపాయలు, హిందీ+ రెస్టాఫ్ ఇండియాలో 30 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో 2 కోట్ల రూపాయలు చొప్పున 20 కోట్ల రూపాయలు రాబడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దాంతో అఖండ 2 చిత్రం రెండ్రోజుల్లో 80 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X