Akhanda 2 Day 3 Collections: దారుణంగా అఖండ 2 మూవీ కలెక్షన్లు.. బాలయ్య మూవీ లాభాల్లోకి రావాలంటే?
నటసింహ నందమూరి బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో భారీ అంచనాలతో వచ్చిన చిత్రం అఖండ 2: తాండవం. బ్లాక్‌బస్టర్ సాధించిన అఖండ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాకు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట నిర్మాతలుగా వ్యవహరించారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాను బాలకృష్ణ కూతురు తేజస్విని నందమూరి సమర్పించారు. సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రల్లో నటించారు.
భారీ బడ్జెట్, హై ఆక్టేన్ యాక్షన్ సీన్లతో రూపొందుతున్న ఈ సినిమాకు ఎస్ థమన్ మ్యూజిక్ అందించారు. సీ రామ్ ప్రసాద్, సంతోష్ డీ డీటాకే సినిమాటోగ్రఫిని, ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్, తమ్మిరాజు ఎడిటర్‌గా, రామ్ లక్ష్మణ్ ఫైట్స్ బాధ్యతల్ని నిర్వర్తించారు. ఈ సినిమాకు కోటి పర్చూరి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఈ సినిమా ఫైనాన్స్ సమస్యలు పరిష్కరించుకొని డిసెంబర్ 12వ తేదీన రిలీజైంది. ఈ చిత్రం డిసెంబర్ 11వ తేదీన ప్రీమియర్లతో బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించింది. ఈ సినిమా బడ్జెట్, ప్రీమియర్ కలెక్షన్లు, మూడు రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

అఖండ 2 తాండవం చిత్రం తొలి రోజు భారీగానే వసూళ్లను నమోదు చేసింది. ప్రీమియర్లు, తొలి రోజు కలెక్షన్లతోపాటు 59.5 కోట్ల రూపాయలు వసూలు చేసిందని 14 రీల్స్ ప్లస్ ప్రొడక్షన్ అధికారికంగా వెల్లడించింది. అయితే ఈ సినిమా ఏపీ, తెలంగాణలో కలిపి 25.25 కోట్లు నెట్, 38.25 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల నెట్, 48.85 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక బాలకృష్ణ సినిమా రెండో రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ సినిమా దాదాపు 45 శాతానికి పైగా డ్రాప్ అయింది. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 9 కోట్ల నెట్, 18 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తెలుగులో 15 కోట్ల నెట్, హిందీలో 15 లక్షల రూపాయలు, కన్నడలో 50 లక్షలు, తమిళనాడులో 15 లక్షలు వసూలు చేసింది అని సాక్ నిక్, ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఇండియాలో 50 కోట్ల నెట్ వసూలు చేసింది.
నార్త్ అమెరికాలో తొలి రోజు, ప్రీమియర్లు కలిపి 601K డాలర్లు వసూలు చేసింది. రెండో రోజు 50K డాలర్లు, మూడో రోజు కడపటి వార్తలు అందేసరికి 125K డాలర్లు వసూలు చేసిందని ఓవర్సీస్ ట్రేడ్ అనలిస్టులు పేర్కొన్నారు. ఈ సినిమా మొత్తంగా నార్త్ అమెరికాలో 750K డాలర్ల వరకు వసూలు చేసి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇక మూడో రోజు కలెక్షన్ల అంచనా విషయానికి వస్తే.. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్రమైన తడబాటుకు గురి అవుతున్నది. బుక్ మై షో, డిస్ట్రిక్ట్ యాప్‌లో ఈ సినిమా కలెక్షన్లు అంతంత మాత్రంగానే నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలో ఈ చిత్రం 3వ రోజు 10 కోట్ల గ్రాస్ నుంచి 12 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. దాంతో 90 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని ట్రేడ్ రిపోర్ట్.


Click it and Unblock the Notifications











