Akhanda 2 Day 4 Collections: భారీగా తగ్గిన అఖండ 2 కలెక్షన్లు.. 4 వ రోజు కలెక్షన్స్ ఎంతంటే?

Akhanda 2 Collections: నటసింహ నందమూరి బాలకృష్ణ, సెన్సేషనల్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సింహా, లెజెండ్, అఖండ వంటి బ్లాక్‌బస్టర్లతో ఈ జోడీ టాలీవుడ్‌లో ఓ ప్రత్యేక బ్రాండ్‌గా మారింది. అదే అంచనాలతో తెరకెక్కిన తాజా సినిమా 'అఖండ 2: తాండవం'. భారీ బడ్జెట్, హై వోల్టేజ్ యాక్షన్, పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో ఈ సినిమా డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. అయితే విడుదలైన నాలుగు రోజుల్లోనే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో సినిమా బడ్జెట్, ప్రీమియర్ కలెక్షన్లు, 4వ రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 'అఖండ'కు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట నిర్మించగా, బాలకృష్ణ కూతురు తేజస్విని నందమూరి సమర్పించారు. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించగా, ఆది పినిశెట్టి కీలక పాత్రలో కనిపించాడు. చిన్నారి హర్షాలీ మల్హోత్రా మరో ముఖ్య పాత్రలో నటించింది. ఎస్. థమన్ సంగీతం, సీ రామ్ ప్రసాద్- సంతోష్ డీ డీటాకే సినిమాటోగ్రఫీ, ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్ డైరెక్షన్, తమ్మిరాజు ఎడిటింగ్, రామ్-లక్ష్మణ్ ఫైట్స్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. కోటి పర్చూరి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు.

Akhanda 2 Day 4 Expected Box Office Collections Worldwide Balakrishna s Movie struggling at GBOC

ఫైనాన్షియల్ ఇష్యూస్ కారణంగా కొంతకాలం వాయిదా పడిన ఈ సినిమా చివరకు సమస్యలు పరిష్కరించుకుని డిసెంబర్ 11న ప్రీమియర్లతో బాక్సాఫీస్ ప్రయాణాన్ని ప్రారంభించింది. మొదటి రోజు ప్రీమియర్లు కలిపి భారీ ఓపెనింగ్స్ నమోదు చేసినట్టు మేకర్స్ ప్రకటించారు. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రూ.103 కోట్ల బిజినెస్ చేసింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.104 కోట్ల షేర్‌గా నిర్ణయించారు. ఈ స్థాయిలో బిజినెస్ జరగడం వల్లే అఖండ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక అఖండ 2 తొలి రోజు విషయానికి వస్తే.. ప్రీమియర్లు, మొదటి రోజు కలిపి రూ.59.5 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయని 14 రీల్స్ ప్లస్ అధికారికంగా ప్రకటించింది. ఏపీ, తెలంగాణలో కలిపి రూ.25.25 కోట్ల నెట్, రూ.38.25 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే తొలి రోజు రూ.30 కోట్ల నెట్, రూ.48.85 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదు అయినట్టు సమాచారం.

కానీ రెండో రోజు కలెక్షన్స్ పూర్తిగా మారిపోయింది. సినిమాకు దాదాపు 45 శాతానికి పైగా డ్రాప్ నమోదైంది. రెండో రోజు వరల్డ్ వైడ్‌గా కేవలం రూ.9 కోట్ల నెట్, రూ.18 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తెలుగులో రూ.15 కోట్ల నెట్, హిందీలో రూ.15 లక్షలు, కన్నడలో రూ.50 లక్షలు, తమిళనాడులో రూ.15 లక్షలు మాత్రమే రాబట్టింది. దాంతో ఇండియా మొత్తంగా రూ.50 కోట్ల నెట్ మార్క్‌ను దాటినట్టు అంచనా.

మూడో రోజు కలెక్షన్ల విషయానికి వస్తే పరిస్థితి మరింత బలహీనంగా మారింది. బుక్ మై షో, డిస్ట్రిక్ట్ వంటి టికెట్ బుకింగ్ యాప్‌లలో ఆక్యుపెన్సీ అంతంత మాత్రంగానే నమోదు అయింది. ఈ క్రమంలో మూడో రోజు వరల్డ్ వైడ్‌గా సుమారు రూ.15.1 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇందులో తెలుగులో రూ.14.15 కోట్లు, హిందీలో రూ.20 లక్షలు, కన్నడలో రూ.13 లక్షలు, తమిళనాడులో రూ.4 లక్షలు మాత్రమే వచ్చాయి. మూడు రోజులకే ఈ సినిమా సుమారు రూ.90 కోట్ల గ్రాస్ వరకు చేరినట్టు సమాచారం.

ఇక నాలుగో రోజు పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. వర్కింగ్ డే కావడం, నెగటివ్ టాక్, మిక్స్‌డ్ రివ్యూలు సినిమాపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. బుక్ మై షో, డిస్ట్రిక్ట్ యాప్‌లలో షో ఆక్యుపెన్సీ చాలా తక్కువగా ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో నాలుగో రోజు ఈ సినిమా రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల గ్రాస్ మధ్యనే వసూలు చేసే అవకాశం ఉందని అంచనా. దాంతో నాలుగు రోజులకు దేశవ్యాప్తంగా సుమారు రూ.63.38 కోట్ల గ్రాస్ వసూళ్లకు పరిమితమయ్యే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.వర్డల్ వైడ్ కలెక్షన్స్ రూ. 96 కోట్లకు చేరువ కానున్నట్టు తెలుస్తోంది.

మొత్తానికి భారీ అంచనాలతో విడుదలైన 'అఖండ 2: తాండవం' తొలి రోజు తప్ప ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోతోంది. వీకెండ్‌లో పరిస్థితి కొంత మెరుగుపడితేనే బ్రేక్ ఈవెన్ దిశగా ప్రయాణం సాగించే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లేదంటే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోర్లా పడే అవకాశముందని ట్రేడ్ వర్గాల టాక్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X