Akhanda 2 Day 5 Collections: భారీగా క్షీణించిన అఖండ 2 కలెక్షన్లు.. నష్టాల నుంచి బయటపడాలంటే?
నటసింహ నందమూరి బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో భారీ అంచనాలతో వచ్చిన చిత్రం అఖండ 2: తాండవం. బ్లాక్‌బస్టర్ సాధించిన అఖండ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాకు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట నిర్మాతలుగా వ్యవహరించారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాను బాలకృష్ణ కూతురు తేజస్విని నందమూరి సమర్పించారు. సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రల్లో నటించారు.
భారీ బడ్జెట్, హై ఆక్టేన్ యాక్షన్ సీన్లతో రూపొందుతున్న ఈ సినిమాకు ఎస్ థమన్ మ్యూజిక్ అందించారు. సీ రామ్ ప్రసాద్, సంతోష్ డీ డీటాకే సినిమాటోగ్రఫిని, ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్, తమ్మిరాజు ఎడిటర్‌గా, రామ్ లక్ష్మణ్ ఫైట్స్ బాధ్యతల్ని నిర్వర్తించారు. ఈ సినిమాకు కోటి పర్చూరి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఈ సినిమా ఫైనాన్స్ సమస్యలు పరిష్కరించుకొని డిసెంబర్ 12వ తేదీన రిలీజైంది. ఈ చిత్రం డిసెంబర్ 11వ తేదీన ప్రీమియర్లతో బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించింది. ఈ సినిమా బడ్జెట్, ప్రీమియర్ కలెక్షన్లు, మూడు రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

అఖండ సినిమా భారీ విజయం సాధించడంతో బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్‌పై భారీగా బిజినెస్ జరిగింది. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 103 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ 104 కోట్ల టార్గెట్‌గా బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 104 కోట్ల షేర్, 208 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబడితే గానీ.. బ్రేక్ ఈవెన్‌కు చేరువ అవుతుందని అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అఖండ సినిమా ప్రీమియర్లకు మంచి ఆదరణ లభించింది. ఇండియాలో ప్రీమియర్ల ద్వారా 8 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక ఫస్ట్ డే రోజున 22.5 కోట్ల రూపాయలు, రెండో రోజు 15.5 కోట్ల రూపాయలు రాబట్టింది. మూడో రోజు 15.1 కోట్ల రూపాయలు, 4వ రోజు 5.25 కోట్ల రూపాయలు, 5వ రోజు 4.58 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇండియాలో ఈ సినిమా 70 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది అని సాక్ నిక్ వెల్లడించింది.
తెలుగు రాష్ట్రాల కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ చిత్రం తొలి రోజున 22 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు, రెండో రోజు 15 కోట్ల రూపాయల గ్రాస్, మూడో రోజు 14.5 కోట్లు, నాలుగో రోజు 5 కోట్ల రూపాయలు, 5వ రోజు 4.25 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్లతో కలిపి 65 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.
గత 5 రోజుల ఆంధ్రా, నైజాం కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. నైజాంలో ఈ చిత్రం 16.5 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 10.5 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రాలో 5 కోట్ల రూపాయలు, తూర్పు గోదావరి జిల్లాలో 5 కోట్ల రూపాయలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 3 కోట్ల రూపాయలు, గంటూరులో 5 కోట్ల రూపాయలు, కృష్ణా జిల్లాలో 3.5 కోట్ల రూపాయలు, నెల్లూరులో 2.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
వరల్డ్ వైడ్‌గా అఖండ 2 కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ సినిమా ఇండియాలో 68 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు, 83 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్‌లో ఈ చిత్రం 11 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. మొత్తంగా 94 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం 35 కోట్ల మేర వసూళ్లను సాధించాల్సిన పరిస్థితి ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











