Akhanda 2 Day 6 Collections: దారుణంగా అఖండ 2 కలెక్షన్స్... 6 రోజుల్లో బాలయ్య మూవీకి ఎన్ని కోట్లంటే?
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అఖండ 2. మూడేళ్ల క్రితం వీరిద్దరి కాంబోలో వచ్చిన అఖండకు సీక్వెల్‌గా అఖండ 2ని నిర్మించారు. డిసెంబర్ 12న ఈ భారీ చిత్రం వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో బాలయ్య సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించగా, ఆది పినిశెట్టి విలన్‌గా కనిపించారు. బజరంగీ భాయిజాన్ ఫేమ్ హర్షాలి మల్హోత్రా కీలకపాత్ర పోషించారు. కబీర్ దుహన్ సింగ్, స్వస్త ఛటర్జీ, రాన్‌సన్ విన్సెంట్, అచ్యుత్ కుమార్, సంగే షెల్ట్రిమ్, రవి మరియా, విక్రమ్‌జిత్, పూర్ణ, సాయికుమార్, హర్ష చెముడు తదితరులు ఇతర పాత్రలు పోషించారు.
14 రీల్స్ ప్లస్ ఎంటర్‌టైన్‌మెంట్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై రామ్ అచంట, గోపీచంద్ అచంట, ఇషాన్ సక్సెనాలు సంయుక్తంగా అఖండ 2 చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. బాలకృష్ణ చిన్న కుమార్తె నందమూరి తేజస్విని ఈ సినిమాకు సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. థమన్ మ్యూజిక్ డైరెక్షన్ చేయగా... తమ్మిరాజు ఎడిటింగ్, సీ. రాంప్రసాద్, సంతోష్ దేట్కేలు సినిమాటోగ్రాఫర్లుగా పనిచేశారు. ఈ నేపథ్యంలో అఖండ 2 బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఆరో రోజు బాలయ్య సినిమా ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాలు పరిశీలిస్తే...

అఖండ 2 బడ్జెట్
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు దాదాపు 200 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా ఫిలింనగర్ టాక్. అఖండ క్రేజ్, బాలయ్య ఛరిష్మా కారణంగా ఈ సినిమాకు భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఉత్తరాంధ్ర హక్కులు 13.5 కోట్ల రూపాయలు, గుంటూరు జిల్లా రైట్స్ 9.5 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 8.25 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరి జిల్లాలో రైట్స్ 6.5 కోట్ల రూపాయలు, కృష్ణా జిల్లాలో 7 కోట్ల రూపాయలు, నెల్లూరు రైట్స్ 4.5 కోట్ల రూపాయలకు, సీడెడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ 26 కోట్ల రూపాయలు, నైజాంలో 30 కోట్ల రూపాయలు మేర బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.
అఖండ 2 బ్రేక్ ఈవెన్ టార్గెట్
అలాగే కర్ణాటక, రెస్టాఫ్ ఇండియాలో 11 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 15 కోట్ల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 103 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దాంతో అఖండ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ కావాలంటే 104 కోట్ల రూపాయల షేర్, 208 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. అఖండ 2 సినిమాను వరల్డ్ వైడ్‌గా 2200 థియేటర్స్‌లో విడుదల చేశారు.
అఖండ 2 ఐదు రోజుల కలెక్షన్స్
అఖండ 2కు పెయిడ్ ప్రీమియర్స్‌లో 8 కోట్ల రూపాయలు, తొలిరోజున 22.5 కోట్ల రూపాయలు, రెండో రోజున 15.5 కోట్ల రూపాయలు, మూడో రోజున 15.1 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 5.25 కోట్ల రూపాయలు, ఐదో రోజున 4.25 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో 5 రోజుల వరకు బాలయ్య మూవీకి ఇండియాలో 70.85 కోట్ల రూపాయల నెట్.. 84 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది.
తెలుగు రాష్ట్రాల్లో బాలయ్య మూవీకి పెయిడ్ ప్రీమియర్స్‌కు 8 కోట్ల రూపాయలు, తొలి రోజున 21.95 కోట్ల రూపాయలు, రెండో రోజున 14.85 కోట్ల రూపాయలు, మూడో రోజున 14.45 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 4.95 కోట్ల రూపాయలు, ఐదో రోజున 3.8 కోట్ల రూపాయలు, ఆరో రోజున 3.15 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతాల వారీగా అఖండ 2 కలెక్షన్స్ పరిశీలిస్తే.. నైజాంలో 15.84 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 10.22 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 4.64 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 3.67 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరిలో 2.68 కోట్ల రూపాయలు, గుంటూరులో 4.90 కోట్ల రూపాయలు, కృష్ణా జిల్లాలో 3.20 కోట్ల రూపాయలు, నెల్లూరులో 2.39 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
అఖండ 2 చిత్రం ఇప్పటి వరకు కర్ణాటకలో 9.03 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 68.5 కోట్ల రూపాయలు, తమిళనాడులో 4.08 కోట్ల రూపాయలు, కేరళలో 14 లక్షల రూపాయలు, హిందీ + రెస్టాఫ్ ఇండియాలో 1.8 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
ఓవర్సీస్‌లో అఖండ 2 చిత్రం హడావుడి కొంతమేర తగ్గినట్లే కనిపిస్తోంది. బాలయ్యకి స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉన్న నార్త్ అమెరికాలో 6వ రోజున ఈ సినిమాకు 17K డాలర్లు (15.36 లక్షల రూపాయలు) మాత్రమే వసూలు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దాంతో ఇప్పటి వరకు నార్త్ అమెరికాలో అఖండ 2కు 920K (భారత కరెన్సీలో 8.31 కోట్ల రూపాయలు) వసూలైంది. మిగిలిన దేశాల నుంచి ఈ సినిమాకు 3 కోట్ల వరకు వచ్చింది. దాంతో అఖండ 2కు ఓవర్సీస్ నుంచి దాదాపు 11.20 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
6వ రోజు అఖండ 2 కలెక్షన్స్
నందమూరి బాలకృష్ణ మూవీకి క్రమంగా వసూళ్లు పడిపోతూనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు నుంచి అఖండ 2కు చెప్పుకోదగ్గ వసూళ్లు వస్తుండగా... హిందీ బెల్ట్, ఓవర్సీస్‌లో అఖండ 2పై దురంధర్ గట్టి దెబ్బ కొట్టింది. తెలుగు రాష్ట్రాల్లోనూ బీ, సీ సెంటర్స్‌లో అఖండ 2కు ఆదరణ లభిస్తోంది. 6వ రోజు బాలయ్య మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 18 శాతం, తమిళంలో 14 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ నివేదించింది. ఆరవ రోజు అఖండ 2కు తెలుగు రాష్ట్రాల్లో 3.15 కోట్ల రూపాయలు, హిందీలో 5 లక్షల రూపాయలు, కన్నడంలో 2 లక్షల రూపాయలు, తమిళంలో 27 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో 15.36 లక్షల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 3.75 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది. దాంతో ఆరు రోజుల వరకు ఈ సినిమాకు వరల్డ్ వైడ్‌గా 98.6 కోట్ల రూపాయల గ్రాస్... 60 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. బాలయ్య సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద మరో 44 కోట్ల రూపాయల షేర్, 110 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











