Akhanda 2 Day 7 Collections: అఖండ 2 మూవీపై కోలుకోలేని దెబ్బ.. నష్టాల నుంచి బయటపడాలంటే?
నటసింహ నందమూరి బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో భారీ అంచనాలతో వచ్చిన చిత్రం అఖండ 2: తాండవం. బ్లాక్‌బస్టర్ సాధించిన అఖండ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాకు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట నిర్మాతలుగా వ్యవహరించారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాను బాలకృష్ణ కూతురు తేజస్విని నందమూరి సమర్పించారు. సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రల్లో నటించారు.
భారీ బడ్జెట్, హై ఆక్టేన్ యాక్షన్ సీన్లతో రూపొందుతున్న ఈ సినిమాకు ఎస్ థమన్ మ్యూజిక్ అందించారు. సీ రామ్ ప్రసాద్, సంతోష్ డీ డీటాకే సినిమాటోగ్రఫిని, ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్, తమ్మిరాజు ఎడిటర్‌గా, రామ్ లక్ష్మణ్ ఫైట్స్ బాధ్యతల్ని నిర్వర్తించారు. ఈ సినిమాకు కోటి పర్చూరి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఈ సినిమా ఫైనాన్స్ సమస్యలు పరిష్కరించుకొని డిసెంబర్ 12వ తేదీన రిలీజైంది. ఈ చిత్రం డిసెంబర్ 11వ తేదీన ప్రీమియర్లతో బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించింది. ఈ సినిమా బడ్జెట్, ప్రీమియర్ కలెక్షన్లు, మూడు రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

అఖండ సినిమా భారీ విజయం సాధించడంతో బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్‌పై భారీగా బిజినెస్ జరిగింది. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 103 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ 104 కోట్ల టార్గెట్‌గా బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 104 కోట్ల షేర్, 208 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబడితే గానీ.. బ్రేక్ ఈవెన్‌కు చేరువ అవుతుందని అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అఖండ 2 మూవీ వివిధ భాషల్లో వసూలు చేసిన కలెక్షన్ల విషయానికి వస్తే.. బాలయ్య సినిమా కర్ణాటకలో 10 కోట్ల రూపాయలు, తమిళనాడులో 5 కోట్ల రూపాయలు, మలయాళంలో 25 లక్షల రూపాయలు, హిందీలో 2 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ఈ చిత్రం తెలుగేతర రాష్ట్రాల్లో 17.25 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 7వ రోజులో వసూలు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. నైజాంలో 17 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 10 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 5 కోట్ల రూపాయలు, తూర్పు గోదావరి జిల్లాలో 4 కోట్ల రూపాయలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 3 కోట్ల రూపాయలు, గుంటూరులో 5 కోట్ల రూపాయలు, కృష్ణా జిల్లాలో 3.5 కోట్ల రూపాయలు, నెల్లూరు జిల్లాలో 2.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.
ఇక నార్త్ అమెరికాలో కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ చిత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ సినిమా ఇప్పటి వరకు 1 మిలియన్ డాలర్ల క్లబ్‌కు అటు ఇటుగా ఉంది. ఈ సినిమా 4.75 కోట్ల నెట్, 9.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
అఖండ చిత్రం ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా 102 కోట్ల రూపాయల గ్రాస్, 60 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం ఓవరాల్‌గా 103 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. కనీసం 104 కోట్ల నెట్, 210 కోట్ల గ్రాస్ వసూళ్లను సంపాదించాల్సి ఉంది. ప్రస్తుతం వసూలు చేసిన కలెక్షన్లను చూస్తే.. చిత్రం ఇంకా 45 కోట్ల రూపాయలకుపైగానే వసూలు చేయాల్సి ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











