Akhanda 2 Overseas Collections: అఖండ 2 ఓవర్సీస్ కలెక్షన్లు.. లాభమెంత? నష్టమెంత?
అఖండ చిత్రం భారీ అంచనాలను పెంచుకొని రిలీజ్‌కు సిద్దమైంది. అయితే ఎరోస్ ఇంటర్నేషనల్‌తో ఆర్థిక సమస్యల కారణంగా మూవీ వాయిదా పడటం అనేక గందరగోళాలకు దారి తీసింది. అయితే ఇండస్ట్రీ పెద్దలందరూ కలిసి ఈ సినిమా రిలీజ్‌కు మార్గాన్ని సుగమం చేశారు. అయితే వాస్తవంగా డిసెంబర్ 5 తేదీన రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం మద్రాస్ హైకోర్టు ఆదేశాల ప్రకారం డిసెంబర్ 12వ తేదీన రిలీజ్ అయింది. ఈ చిత్రం 11 డిసెంబర్ తేదీన ప్రీమియర్లతో అట్టహాసంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా సగటు సినీ అభిమానిని తీవ్రంగా నిరాశకు గురిచేసింది. దాంతో ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లపై తీవ్రంగా ప్రభావం పడిందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
అఖండ సినిమా ఓవర్సీస్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నది. థియేట్రికల్ బిజినెస్ జరిగిన మొత్తంతో పోల్చుకొంటే డిస్ట్రిబ్యూటర్లను భారీగా నష్టాల్లో ముంచేసే పరిస్థితి నెలకొన్నది. ఈ సినిమా నార్త్ అమెరికాలో కలెక్షన్లు సాధించలేకపోతున్నది. దాంతో ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు ఆందోళనలో ఉన్నారనే చర్చ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతున్నది.

ట్రేడ్ వర్గాలు, డిజిటిల్ మీడియా కథనాల ప్రకారం.. అఖండ చిత్రం ఓవర్సీస్ రైట్స్ సుమారుగా 15 కోట్ల మేర అమ్ముడుపోయాయి. అయితే అనూహ్యంగా రిలీజ్ డేట్ మారడంతో థియేట్రికల్ రైట్స్ బిజినెస్ లెక్కలు కూడా మారాయి. ఆ తర్వాత కొంత మొత్తానికి కుదించారు. అయినా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించే పరిస్థితి కూడా కనిపించడం లేదు. కేవలం నార్త్ అమెరికాలోనే కాదు.. అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితిని డిస్ట్రిబ్యూటర్లు ఎదుర్కొంటున్నారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించారు.
అఖండ చిత్రం నార్త్ అమెరికాలో భారీ నష్టాల్లో ముగిసే ఛాన్స్ ఉంది. ఈ సినిమా ఇప్పటి వరకు 800K డాలర్లకు అటు ఇటుగా వసూలు చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ సుమారుగా 2.5 మిలియన్ డాలర్లు అంటే.. దాదాపు 20 నుంచి 22 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్లు వసూలు చేయాల్సి ఉంటుంది. ఈ సినిమా టోటల్ థియేట్రికల్ రన్‌లో1 మిలియన్ డాలర్లకు అటు ఇటుగా క్లోజ్ అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు.
నటసింహ నందమూరి బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో భారీ అంచనాలతో వచ్చిన చిత్రం అఖండ 2: తాండవం. బ్లాక్‌బస్టర్ సాధించిన అఖండ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాకు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట నిర్మాతలుగా వ్యవహరించారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాను బాలకృష్ణ కూతురు తేజస్విని నందమూరి సమర్పించారు. సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రల్లో నటించారు.
భారీ బడ్జెట్, హై ఆక్టేన్ యాక్షన్ సీన్లతో రూపొందుతున్న ఈ సినిమాకు ఎస్ థమన్ మ్యూజిక్ అందించారు. సీ రామ్ ప్రసాద్, సంతోష్ డీ డీటాకే సినిమాటోగ్రఫిని, ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్, తమ్మిరాజు ఎడిటర్‌గా, రామ్ లక్ష్మణ్ ఫైట్స్ బాధ్యతల్ని నిర్వర్తించారు. ఈ సినిమాకు కోటి పర్చూరి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఈ సినిమా ఫైనాన్స్ సమస్యలు పరిష్కరించుకొని డిసెంబర్ 12వ తేదీన రిలీజైంది.


Click it and Unblock the Notifications











