Akhanda 2 Overseas Collection: ఓవర్సీస్‌లో అఖండ 2 తాండవం... బాలయ్య మూవీకి రిలీజ్‌కు ముందే ఎన్ని కోట్లంటే?
సింహా, లెజెండ్, అఖండల తర్వాత నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన అఖండ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా నందమూరి అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 5న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లతో అఖండ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగినట్లుగానే అడ్వాన్స్ బుకింగ్‌లో అఖండ 2 దుమ్మురేపుతోంది. ఈ నేపథ్యంలో అఖండ 2 బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అడ్వాన్స్ బుకింగ్‌లో ఇప్పటి వరకు ఈ సినిమాకు ఎన్ని కోట్లు వచ్చాయి? ఓవర్సీస్‌లో ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాలు పరిశీలిస్తే...
అఖండ 2 తారాగణం
14 రీల్స్ ప్లస్ ఎంటర్‌టైన్‌మెంట్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై రామ్ అచంట, గోపీచంద్ అచంట, ఇషాన్ సక్సెనాలు సంయుక్తంగా అఖండ 2 చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించారు. బాలకృష్ణ రెండో కుమార్తె నందమూరి తేజస్విని ఈ సినిమాకు సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్నారు. బజరంగీ భాయిజాన్ ఫేమ్ హర్షాలీ మల్హోత్రా కీలక పాత్ర పోషిస్తోంది. థమన్ సంగీతం అందిస్తుండగా... తమ్మిరాజు ఎడిటింగ్, సీ. రాంప్రసాద్, సంతోష్ దేట్కేలు సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరిస్తున్నారు.

అఖండ 2 బడ్జెట్ ఎంత?
అఖండను తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్, దేశంలోని కొన్ని ప్రాంతాల్లో విడుదల చేయగా... అఖండ 2ను మాత్రం పాన్ ఇండియా మూవీగా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. దాంతో ప్రొడక్షన్ కాస్ట్ భారీగా పెరిగినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు దాదాపు 200 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా ఫిలింనగర్ టాక్. ఈ సినిమాకు ఇప్పటి వరకు 145 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
దాంతో అఖండ 2 చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. 300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. ఇది బాలయ్య కెరీర్‌లోనే ఒక సినిమాకు జరిగిన అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్. ఈ రేంజ్ టార్గెట్‌తో బరిలోకి దిగడం కూడా ఇదే తొలిసారి. దాంతో బాలకృష్ణ అభిమానులే కాదు, టాలీవుడ్ వర్గాలు కూడా అఖండ 2 కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.
అఖండ 2 కలెక్షన్స్
అఖండ 2 మూవీపై ఉన్న అంచనాల నేపథ్యంలో ఓవర్సీస్‌లో ముందుగానే అడ్వాన్స్ బుగింగ్ ఓపెన్ చేశారు. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 4వ తేదీ రాత్రి అమెరికాలో ప్రీమియర్ షోలు పడనున్నాయి. దానికి తగినట్లుగానే అఖండ 2 విధ్వంసం సృష్టిస్తోంది. అమెరికాలోని 335 లోకేషన్స్‌లో... 874కు షోలకు గాను 8445 టికెట్లు సేల్ అయ్యాయి. తద్వారా 2,18,919 డాలర్లు (భారత కరెన్సీలో 1.96 కోట్ల రూపాయలు) వసూలైనట్లుగా నివేదికలు చెబుతున్నాయి. ఇక కెనడాతో కలుపుని మొత్తంగా నార్త్ అమెరికాలో అఖండ 2 చిత్రానికి 240K డాలర్లు (భారత కరెనసీలో 2.15 కోట్ల రూపాయలు) రాబట్టినట్లుగా చెబుతున్నారు. రిలీజ్‌కు మరో మూడు రోజుల సమయం ఉండటంతో అఖండ 2 చిత్రం కలెక్షన్స్ పరంగా ఇంకెన్ని సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











