Akhanda 2 Overseas Collection: అఖండ 2.. అడ్వాన్స్ బుకింగ్‌ జోరు.. రిలీజ్‌కు ముందే ఎన్ని కోట్లంటే?

బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం అఖండ 2. డిసెంబర్ 5న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. ఇప్పటికే అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్‌ల హిట్‌తో మంచి ఊపు మీదున్న బాలయ్య.. మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోనున్నారు. బోయపాటి- బాలయ్య కాంబోలో వస్తున్న నాలుగో చిత్రం కావడంతో అఖండ 2పై చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగినట్లుగానే అడ్వాన్స్ బుకింగ్‌లో ఈ సినిమా దుమ్మురేపుతోంది. ముఖ్యంగా ఓవర్సీస్‌లో అఖండ 2 ప్రీమియర్స్ కోసం బుకింగ్ ఓపెన్ చేయగా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈ నేపథ్యంలో అఖండ 2 బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అడ్వాన్స్ బుకింగ్‌లో ఈ సినిమాకు ఎన్ని కోట్లు వచ్చాయో పరిశీలిస్తే..

అఖండ 2 తారాగణం
14 రీల్స్ ప్లస్ ఎంటర్‌టైన్‌మెంట్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై రామ్ అచంట, గోపీచంద్ అచంట, ఇషాన్ సక్సెనాలు సంయుక్తంగా అఖండ 2 చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. బాలకృష్ణ రెండో కుమార్తె నందమూరి తేజస్విని ఈ సినిమాకు సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్నారు. బజరంగీ భాయిజాన్ ఫేమ్ హర్షాలీ మల్హోత్రా కీలక పాత్ర పోషిస్తోంది. థమన్ సంగీతం అందిస్తుండగా... తమ్మిరాజు ఎడిటింగ్, సీ. రాంప్రసాద్, సంతోష్ దేట్కేలు సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరిస్తున్నారు.

Akhanda 2 Overseas Collection Nandamuri Balakrishna s Movie heading towards 1 crore mark In in Advance Booking

అఖండ 2 బడ్జెట్ ఎంత?
అఖండ సినిమా భారీ విజయం సాధించడంతో అఖండ 2 తాండవం మూవీని పాన్ ఇండియా మూవీగా రిలీజ చేయనున్నారు. దాంతో నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ వాల్యూస్ కారణంగా ఈ సినిమాను సుమారుగా 200 కోట్ల రూపాయల బడ్జెట్‌ అయినట్లుగా ఫిలింనగర్ టాక్. ఈ సినిమాకు ఇప్పటి వరకు 145 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉత్తరాంధ్ర హక్కులు 13.5 కోట్ల రూపాయలు, గుంటూరు జిల్లా రైట్స్ 9.5 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరి రైట్స్ 8.25 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరి రైట్స్ 6.5 కోట్ల రూపాయలు, కృష్ణా జిల్లా రైట్స్ 7 కోట్ల రూపాయలు, నెల్లూరు రైట్స్ 4.5 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి.

అఖండ 2 ప్రీ రిలీజ్ బిజినెస్
ఇక సీడెడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ 26 కోట్ల రూపాయల మేర క్లోజ్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఇక నైజాం ఏరియా రైట్స్ చర్చల దశలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఏరియాలో అఖండ 2 థియేట్రికల్ బిజినెస్ 30 కోట్ల రూపాయల మేర జరగవచ్చని, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు వీటిని సొంతం చేసుకోవచ్చనే భావిస్తున్నారు. దాంతో అఖండ 2కి ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారుగా 105 కోట్ల రూపాయల మేర జరిగిందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. 115 కోట్ల షేర్, 230 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

అఖండ 2 ఓవర్సీస్ కలెక్షన్స్
మరోవైపు.. బాలయ్యకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నార్త్ అమెరికాలోనూ అఖండ 2 క్రేజ్ మామూలుగా లేదు. రిలీజ్‌కు ఒకరోజు ముందు అంటే డిసెంబర్ 4వ తేదీన యూఎస్ఏ, కెనడాలలో అఖండ 2 ప్రీమియర్స్ పడనున్నాయి. దాంతో నెలరోజుల ముందే ఈ సినిమాకు బుకింగ్స్ ఓపెన్ అవ్వగా.. టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఇప్పటి వరకు అమెరికా వ్యాప్తంగా అఖండ 2కు 247 సెంటర్స్‌లో 645 షోలకు గాను1,01,370 డాలర్లు (భారత కరెన్సీలో 90.39 లక్షల రూపాయలు) వసూలు చేసింది. రిలీజ్‌కు మరో 13 రోజులు సమయం ఉండగానే కోటి రూపాయలకు దగ్గరలో వసూళ్లు రాబట్టాడు అఖండ. మరి రానున్న రోజుల్లో బాలయ్య విధ్వంసం ఎలా ఉంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X