Akhanda 2 Andhra, Nizam Business: అఖండ 2 ఆంధ్రా, నైజాం బిజినెస్ ఎంత? ఎన్ని కోట్లు వస్తే లాభాల్లోకి అంటే?

తెలుగు ప్రేక్షకులకు గాడ్ ఆఫ్ మాసెస్, నటరత్న నందమూరి బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం అఖండ 2: తాండవం. బ్లాక్‌బస్టర్ సాధించిన అఖండ మూవీకి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాకు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాను బాలకృష్ణ కూతురు తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

భారీ బడ్జెట్, హై ఆక్టేన్ యాక్షన్ సీన్లతో రూపొందుతున్న ఈ సినిమాకు ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సీ రామ్ ప్రసాద్, సంతోష్ డీ డీటాకే సినిమాటోగ్రఫిని, ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్, తమ్మిరాజు ఎడిటర్‌గా, రామ్ లక్ష్మణ్ ఫైట్స్ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమాకు కోటి పర్చూరి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ మూవీ బడ్జెట్ ఎంత? ఈ చిత్రానికి జరిగిన థియేట్రికల్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

Akhanda 2 Thandavam Theatrical Business in Telugu States Balakrishna s Movie Break Even Target details

అఖండ సినిమా భారీ విజయం సాధించడంతో అఖండ 2 తాండవం సినిమాపై అనూహ్యమైన అంచనాలు పెరిగాయి. దాంతో ఈ సినిమాను ప్యాన్ ఇండియా మూవీగా మలిచారు. దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షించడానికి ఈ సినిమాలో భారీగా వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్ వర్క్ చేశారు. స్టార్ హీరో, హీరోయిన్లు, అలాగే టాప్ సాంకేతిక నిపుణులు, ప్రొడక్షన్ వాల్యూస్ కలుపుకొని ఈ సినిమాను సుమారుగా 200 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమాకు ఇప్పటి వరకు 145 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

అయితే ఈ మూవీ తెలుగు రాష్ట్రాల బిజినెస్ చాలా క్రేజీగా జరిగింది. ఆంధ్రా, నైజాం థియేట్రికల్ హక్కులు రికార్డు స్థాయికి అమ్ముడుపోయాయి. ఈ సినిమా ఉత్తరాంధ్ర హక్కులు 13.5 కోట్ల రూపాయలు, గుంటూరు జిల్లా రైట్స్ 9.5 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 8.25 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరి జిల్లాలో రైట్స్ 6.5 కోట్ల రూపాయలు, కృష్ణా జిల్లాలో 7 కోట్ల రూపాయలు, నెల్లూరు రైట్స్ 4.5 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. ఇక సీడెడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ 26 కోట్ల రూపాయల మేర పూర్తి అయింది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

ఇక నైజాం ఏరియా హక్కుల విషయంలో చర్చలు జరుగుతున్నాయి. ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారుగా 30 కోట్ల రూపాయల మేర జరగవచ్చు. ఈ చిత్రం హక్కులను నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకోవచ్చనే వార్త సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ఈ చిత్రం హక్కులు దక్కించుకోవడానికి మరో ప్రముఖ నిర్మాణ సంస్థ పావులు కదుపుతున్నది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

అఖండ 2 తాండవ చిత్రం తెలుగు రాష్ట్రాల హక్కులు రికార్డు స్థాయిలో అమ్ముడుపోయాయి. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారుగా 105 కోట్ల రూపాయల మేర జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. 115 కోట్ల షేర్, 230 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X