ఆ ఏరియాలో రికార్డ్ ధరకు అఖండ 2 బిజినెస్.. బాలయ్య కెరీర్‌లోనే హయ్యెస్ట్, ఎన్ని కోట్లంటే?

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీనుల కాంబినేషన్ తెరకెక్కుతోన్న మూవీ అఖండ 2. గతంలో వచ్చిన అఖండకు సీక్వెల్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. బాలయ్య- బోయపాటి కాంబోలో వస్తున్న నాలుగో సినిమా ఇది. గతంలో సింహా, లెజెండ్, అఖండలు హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నాయి. తాజా చిత్రంపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా అఖండ 2 ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమాకు థియేట్రికల్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరుగుతోంది? ఈ వివరాల్లోకి వెళితే..

అఖండ 2 తారాగణం
14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ అచంట, గోపీచంద్ అచంట సంయుక్తంగా అఖండ 2 చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. బాలకృష్ణ రెండో కుమార్తె నందమూరి తేజస్విని ఈ సినిమాకు సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. బాలయ్య ఆస్థాన సంగీత దర్శకుడు థమన్ స్వరాలు సమకూరుస్తున్నాడు. ఈ చిత్రంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. ఆది పినిశెట్టి, బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఓ కీలకపాత్ర పోషిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

Akhanda 2 theatrical business Nandamuri Balakrishna Movie s Guntur Rights Sold for Record Price

అఖండ 2కు రికార్డ్ బిజినెస్?
అప్పట్లో అఖండ చిత్రం నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు భారీగా లాభాలను అందుకోవడంతో అఖండ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ పూర్తి కాకుండానే అఖండ 2‌కు రికార్డ్ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతున్నట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. థియేట్రికల్, శాటిలైట్, ఓటీటీ, ఆడియో రైట్స్ సొంతం చేసుకునేందుకు బడా సంస్థలు క్యూకడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల అఖండ 2 ఓటీటీ హక్కులను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ దాదాపు 80 కోట్లకు పైగా వెచ్చించి దక్కించుకున్నట్లుగా ఫిలింనగర్‌లో ఊహాగానాలు వినిపించాయి. ఇది బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక మొత్తంలో ఓ సినిమాకు ఓటీటీ రైట్స్ అమ్ముడుకావడం ఇదే తొలిసారని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

ఆ ఏరియాలో రికార్డ్ బిజినెస్
అఖండ థియేట్రికల్ బిజినెస్‌పై సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్న సమాచారాన్ని పరిశీలిస్తే.. సీడెడ్‌లో 24 కోట్ల రూపాయలు, ఆంధ్రలో 54 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే బాలయ్య హవా గట్టిగా ఉండే గుంటూరు జిల్లా రైట్స్ రికార్డ్ ధర పలికినట్లుగా వార్తలు వస్తున్నాయి. రాధాకృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ అఖండ 2 గుంటూరు థియేట్రికల్ హక్కులను 9.5 కోట్లకు దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది.

పెరిగిపోతోన్న అఖండ 2 బడ్జెట్
ఇది నందమూరి బాలకృష్ణ కెరీర్‌లోనే అత్యధిక మొత్తంగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మొత్తంగా వరల్డ్ వైడ్‌గా అఖండ 2 మూవీకి థియేట్రికల్ బిజినెస్ 135 కోట్ల రూపాయలకు పైగా జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదే జరిగితే అఖండ 2 లాభాల్లోకి రావాలంటే వరల్డ్ వైడ్‌గా 140 కోట్ల రూపాయల షేర్.. 270 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంది. అయితే అఖండ 2 విషయంలో బోయపాటి ఎక్కడా తగ్గడం లేదు.. నిర్మాణ విలువలు, వీఎఫ్ఎక్స్ ఇలా అన్ని విషయాలను దగ్గరుండి చూసుకుంటున్నారు. దాంతో అఖండ 2 బడ్జెట్ 120 కోట్ల రూపాయలు దాటే అవకాశం ఉందని ఫిలింనగర్‌లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే దీనిని బాలయ్య కొట్టగలుగుతాడా? లేదా అన్నది క్వశ్చన్ మార్క్‌గా మారింది. బాలకృష్ణ సినిమాకు హిట్ టాక్ వస్తే కాసుల పంటే అనేది తెలిసిందే. మరి అఖండ 2 ఫైనల్‌గా ఎన్ని కోట్ల రూపాయల బిజినెస్ చేస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X