Akhanda 2 2 Weeks Collections: నష్టాల్లోనే అఖండ 2.. బాలయ్య మూవీ 2 వారాల్లో ఎంత రాబట్టిందంటే?

బోయపాటి శ్రీను- నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా అఖండ 2: తాండవం. గతంలో వచ్చిన అఖండకు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కింది. పలు అవాంతరాలను దాటుకుని డిసెంబర్ 12న అఖండ 2 ప్రేక్షకుల ముందుకొచ్చింది. 14 రీల్స్ ప్లస్ ఎంటర్‌టైన్‌మెంట్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై రామ్ అచంట, గోపీచంద్ అచంట, ఇషాన్ సక్సెనాలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. బాలకృష్ణ కుమార్తె నందమూరి తేజస్విని ఈ సినిమాకు సమర్పకురాలిగా వ్యవహరించారు.

అఖండ 2లో బాలయ్య సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించగా, ఆది పినిశెట్టి విలన్‌గా కనిపించారు. బజరంగీ భాయిజాన్ ఫేమ్ హర్షాలి మల్హోత్రా కీలకపాత్ర పోషించారు. కబీర్ దుహన్ సింగ్, స్వస్త ఛటర్జీ, రాన్‌సన్ విన్సెంట్, అచ్యుత్ కుమార్, సంగే షెల్ట్రిమ్, రవి మరియా, విక్రమ్‌జిత్, పూర్ణ, సాయికుమార్, హర్ష చెముడు తదితరులు ఇతర పాత్రలు పోషించారు. థమన్ స్వరాలు అందించగా... తమ్మిరాజు ఎడిటింగ్, సీ. రాంప్రసాద్, సంతోష్ దేట్కేలు సినిమాటోగ్రాఫర్లుగా పనిచేశారు. ఈ నేపథ్యంలో అఖండ 2 బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 2 వారాల్లో బాలయ్య సినిమా ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాలు పరిశీలిస్తే...

Akhanda 2 Two Weeks Box Office Collections Worldwide Balakrishna s Movie failed to meet high expectations

అఖండ 2 బడ్జెట్
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు దాదాపు 200 కోట్ల రూపాయల బడ్జెట్‌ అయినట్లుగా ఫిలింనగర్ టాక్. అఖండ క్రేజ్, బాలయ్య ఛరిష్మా కారణంగా ఈ సినిమాకు భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఉత్తరాంధ్ర హక్కులు 13.5 కోట్ల రూపాయలు, గుంటూరు జిల్లా రైట్స్ 9.5 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 8.25 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరి జిల్లాలో రైట్స్ 6.5 కోట్ల రూపాయలు, కృష్ణా జిల్లాలో 7 కోట్ల రూపాయలు, నెల్లూరు రైట్స్ 4.5 కోట్ల రూపాయలకు, సీడెడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ 26 కోట్ల రూపాయలు, నైజాంలో 30 కోట్ల రూపాయలు మేర బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

అఖండ 2 బ్రేక్ ఈవెన్ టార్గెట్
అలాగే కర్ణాటక, రెస్టాఫ్ ఇండియాలో 11 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 15 కోట్ల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 103 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దాంతో అఖండ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ కావాలంటే 104 కోట్ల రూపాయల షేర్, 208 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. అఖండ 2 సినిమాను వరల్డ్ వైడ్‌గా 2200 థియేటర్స్‌లో విడుదల చేశారు.

ఇండియాలో అఖండ 2 కలెక్షన్స్
అఖండ 2కు ఇండియాలో పెయిడ్ ప్రీమియర్స్‌లో 8 కోట్ల రూపాయలు, తొలిరోజున 22.5 కోట్ల రూపాయలు, రెండో రోజున 15.5 కోట్ల రూపాయలు, మూడో రోజున 15.1 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 5.25 కోట్ల రూపాయలు, ఐదో రోజున 4.25 కోట్ల రూపాయలు, ఆరో రోజున 3.3 కోట్ల రూపాయలు, ఏడో రోజున 2.85 కోట్ల రూపాయలు, ఎనిమిదవ రోజున 1.7 కోట్ల రూపాయలు, తొమ్మిదవ రోజున 2.55 కోట్ల రూపాయలు, పదో రోజున 3.45 కోట్ల రూపాయలు, పదకొండో రోజున 1.05 కోట్ల రూపాయలు, పన్నెండో రోజున కోటి రూపాయలు, పదమూడో రోజున 1.1 కోట్ల రూపాయలు, పద్నాలుగో రోజున 1.65 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో 14 రోజుల వరకు బాలయ్య మూవీకి ఇండియాలో 89.25 కోట్ల రూపాయల నెట్.. 105.4 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది.

తెలుగు రాష్ట్రాల్లో అఖండ 2 కలెక్షన్స్
తెలుగు రాష్ట్రాలలో అఖండ 2 రెండు వారాల కలెక్షన్స్ పరిశీలిస్తే.. పెయిడ్ ప్రీమియర్స్‌తో 8.35 కోట్ల రూపాయలు, తొలి రోజు 22.65 కోట్ల రూపాయలు, రెండో రోజు 14.50 కోట్ల రూపాయలు, మూడో రోజు 14.25 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 5 కోట్ల రూపాయలు, ఐదో రోజున 3.75 కోట్ల రూపాయలు, ఆరో రోజున 3 కోట్ల రూపాయలు, ఏడో రోజున 2.5 కోట్ల రూపాయలు, ఎనిమిదో రోజున 1.75 కోట్ల రూపాయలు, తొమ్మిదో రోజున 2.6 కోట్ల రూపాయలు, పదో రోజున 3.5 కోట్ల రూపాయలు, పదకొండో రోజున 1.07 కోట్ల రూపాయలు, పన్నెండో రోజున 1.03 కోట్ల రూపాయలు, పదమూడో రోజున 1.1 కోట్ల రూపాయలు, పద్నాలుగో రోజున 12.37 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.

తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా అఖండ 2 కలెక్షన్స్ పరిశీలిస్తే.. నైజాంలో 18.70 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 11.80 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 5.60 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 4.25 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరిలో 3.25 కోట్ల రూపాయలు, గుంటూరులో 5.45 కోట్ల రూపాయలు, కృష్ణాలో 3.70 కోట్ల రూపాయలు, నెల్లూరులో 2.75 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ఓవర్సీస్‌లో అఖండ 2 కలెక్షన్స్
నార్త్ అమెరికాలో అఖండ 2 చిత్రం బుధవారం వరకు 988K డాలర్లు (భారత కరెన్సీలో 8.87 లక్షల రూపాయలు) వసూలు చేసింది. ఈ వీకెండ్‌తో అఖండ 2 ఇక్కడ 1 మిలియన్ మార్క్ క్లబ్‌లోకి చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఇక యూరప్, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ఫ్, మిడిల్ ఈస్ట్ దేశాలలో మరో 4 కోట్ల రూపాయల చొప్పున మొత్తంగా అఖండ 2 మూవీకి ఓవర్సీస్‌లో రెండు వారాల వరకు 12.25 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి.

అఖండ 2 రెండు వారాల కలెక్షన్స్
అఖండ 2 తొలి వారం ఇండియా వైడ్‌గా 90.85 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. కర్ణాటకలో 9.68 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 74 కోట్ల రూపాయలు, తమిళనాడులో 5.02 కోట్ల రూపాయలు, కేరళలో 16 లక్షల రూపాయలు, హిందీ + రెస్టాఫ్ ఇండియాలో 1.99 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రెండో వారంలో బాలయ్య మూవీకి ఇండియా వైడ్‌గా 12.50 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో రెండో వారంలో 12.37 కోట్ల రూపాయలు, హిందీ + రెస్టాఫ్ ఇండియాలో 15 లక్షల రూపాయలు చొప్పున వసూలు చేసింది. ఓవర్సీస్ కలెక్షన్స్‌తో కలిపి రెండు వారాల వరకు బాలయ్య మూవీ 117.65 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది.

అఖండ 2 లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద మరో 35 కోట్ల రూపాయల షేర్, 90 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. అయితే ప్రస్తుతం దురంధర్, అవతార్ 3తో పాటు ఛాంపియన్, శంబాల, పతంగ్, దండోరా వంటి చిత్రాల నుంచి విపరీతమైన పోటీ నేపథ్యంలో అఖండ 2 బాక్సాఫీస్ బరిలో నిలబడటం కష్టమేనని విశ్లేషకులు చెబుతున్నారు. మరి థియేట్రికల్ రన్ ముగిసేసరికి బాలయ్య - బోయపాటిల చిత్రం ఎన్నికోట్లు రాబడుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X